హోమ్ /వార్తలు /తెలంగాణ /

Adulterated Oil : రంగారెడ్డి జిల్లాలో కల్తీ నూనె దందా .. పట్టుకున్నా పట్టించుకునే వారేరి

Adulterated Oil : రంగారెడ్డి జిల్లాలో కల్తీ నూనె దందా .. పట్టుకున్నా పట్టించుకునే వారేరి

(కల్తీ నూనె)

(కల్తీ నూనె)

Adulterated oil: కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. తినే తిండి దగ్గర నుంచి తాగే పాలు, ఆహారంలో కలుపుకునే పెరుగు, కూరల్లో ఉపయోగించే నూనె ఇలా ఒకటేమిటి మనిషి కడుపు నింపు కోవడం కోసం తీసుకునే ప్రతి పదార్ధం కల్తీ అవుతూనే ఉంది. అలాగే మార్కెట్‌లో విచ్చలవిడిగా సప్లై అవుతూనే ఉంది.

ఇంకా చదవండి ...

(Syed Rafi, News18,Mahabubnagar)

ప్లాస్టిక్ రైస్(Plastic Rice), రసాయనాలు, యూరియాతో పాల ప్యాకెట్లు(Adulterated milk) తయారు చేయడం, జంతు కళేభరాలతో నూనెలు ఉత్పత్తి చేయడం విన్నాం. కళ్లారా చూశాం. తాజాగా వంట నూనెలను సైతం కల్తీ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. మార్కెట్‌లో వంట నూనెల ధరలు అమాంతం పెరిగిపోవడంతో అక్రమార్కుల చూపు కల్తీ నూనె(Adulterated oil)ల తయారిపై పడింది. పాలు, బియ్యం కల్తీ చేస్తే ఏమొస్తుంది..నూనె కల్తీ చేస్తే కేజీకి వందకుపైగా లాభం వస్తుందనే దురాశతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. రంగారెడ్డి (Rangareddy)జిల్లా షాద్ నగర్(Shadnagar) నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు(Kothuru)ఉమ్మడి మండలాల్లో సీక్రెట్‌గా కల్తీ నూనెల వ్యాపారం సాగుతోంది. .మినీ ఇండియాగా పేరున్న కొత్తూరు, నందిగామ(Nandigama)పారిశ్రామిక ప్రాంతాల్లో నివసించే ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు అంటగట్టడానికే ఈ కల్తీ నూనె ఇక్కడ సప్లై చేస్తున్నారు. ఆయిల్ ప్యాకెట్, బాటిల్, టిన్ ఏది చూసినా పైకి బ్రాండ్‌ నేమ్‌ కనిపిస్తుంది. లోపలున్న కల్తీ నూనె దర్శనమిస్తుంది.

కొత్తూరులో కల్తీ నూనె..

తాజాగా కొత్తూరు మండల కేంద్రంలోని పెంజర్ల రోడ్డులో ఓ షాప్ లో కల్తీ నూనెను గుర్తించారు స్థానికులు. కొనుగోలు చేసిన నూనెను కూరలు, పిండి వంటల్లో ఉపయోగించి ఖచ్చితంగా కల్తీ నూనె అనే నిర్ధారించుకొని షాపు యజమానిని నిలదీశారు. జనానికి అమ్ముతోంది కల్తీ నూనె అని కస్టమర్లకు తెలిసిపోవడంతో షాపు యజమాని గుర్తించిన వినియోగదారుడి కాళ్ల, వేళ్ల పడి తప్పును ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. తన అక్రమ దందా బయటకు చెప్పకుండా ఉండేందుకు కొంత మూల్యం చెల్లించుకున్నాడనే మాట వినిపిస్తోంది. పొట్టకూటి కోసం వలస వచ్చి ఈ ప్రాంతంలో బతుకుతున్న కార్మికులు ఈనిజం తెలియక కల్తీ నూనె వాడుతూ అనారోగ్యాల పాలవుతుంటే ..వ్యాపారస్తుడి లోటుపాటులు తెలిసిన కొందరు మీడియా ముసుగులో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే వార్తలు ఉన్నాయి.

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా..

సాధారణంగా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లేత పసుపు రంగులో ఉంటుంది. కాని ప్రస్తుతం మార్కెట్లో సప్లై అవుతున్న నూనె మాత్రం ఎరుపురంగులో ఉంటోంది. ఈ కల్తీనూనె తయారిలోనే ఏదో తేడాలు ఉన్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. మార్కెట్‌లో రెగ్యులర్‌గా దొరికే వంట నూనెను ప్రస్తుతం చలామణి అవుతున్న కల్తీ నూనెను పరిశీలిస్తున్న మహిళలు రంగు మార్పు చూసి ఖంగుతింటున్నారు. నూనెతో ఏం వండినా వెంటనే నురుగు వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు.

ఇది చదవండి: 4ఏళ్లలో వెయ్యి మందికిపైగా నకిలీ సర్టిఫికెట్లు .. ఆసరా అర్హత పేరుతో భారీగా అవినీతిపట్టించుకునే వారేరి..

కొత్తూరులో ఎక్కువగా ఇదే తరహా ఆయిల్‌ వ్యాపార సరఫరా కేంద్రాలు ఉన్నట్టు సమాచారం. ఎక్కువగా ఎడిబుల్‌  ఆయిల్స్‌ తయారవుతున్నాయని చెబుతున్నారు. కొందరు వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి ముడి సరుకును తీసుకువచ్చి ఇక్కడ ప్యాకింగ్‌ చేస్తుంటారని ఇలా ప్యాకింగ్‌ చేసే క్రమంలో కల్తీ అవుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈప్రాంతంలో విక్రయిస్తున్న వంటనూనెను ప్రభుత్వ ల్యాబ్‌ల్లో పరీక్షిస్తే ఏ మేరకు కల్తీ జరిగిందో తెలుస్తుందని స్థానికులు కోరుతున్నారు. ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నూనెలను ల్యాబ్‌ల్లో పరీక్షించగా చాలా వరకు కల్తీ అవుతున్నట్లు గుర్తించడం జరిగింది. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అదే నిజమని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని ఇలాంటి ప్రాంతాల్లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు చేసి వాటి నాణ్యతను పరిశీలించాల్సింది పోయి వారిని పట్టించుకోకపోవడం చూస్తుంటే అధికారులపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు జనం.

Published by:Siva Nanduri
First published:

Tags: Cooking oil, Rangareddy

ఉత్తమ కథలు