ప్రముఖ ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు ( Ramoji rao ) ఇటివల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ కవితకు ( mlc kavita ) శుభాకాంక్షలు తెలుపుతూ.. లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన మీరు శాసనమండలిలో ప్రజావాణిని మరింత గట్టిగా వినిపించి జననాయకురాలిగా ఇనుమడించిన కీర్తి గడిస్తారని ఆశీస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. ( Ramoji rao writes a letter to Kavita )ఈ క్రమంలో ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించి అందరి మన్ననలందుకుంటారని భావిస్తున్నానంటూ పేర్కొన్నారు. దీంతో ఆయన రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది.
కాగా కొద్ది రోజుల క్రితం కూడా మంత్రి కేటీఆర్ ( KTR ) జన్మదినం సంధర్భంగా కూడా ఆయన లేఖ రాశారు. ఆయన నాయకత్వ లక్షణాలు, రాజకీయ చతురతతో అనతికాలంలోనే పరిణతి కల్గిన నాయకుడిగా ఎదిగాడని పేర్కొన్నారు. ( Ramoji rao writes a letter to Kavita ) కాగా అప్పుడే ఆయన రాసిన లేఖకూడా చర్చనీయంగా మారింది. ప్రస్తుతం కవితకు కూడా లేఖ రాయడంతో మరోసారి చర్చగా మారింది. అయితే గతంలో రామోజీరావు ఎవరికి లేఖలు రాసిన ధాఖలాలు లేవు. దీంతో.. రాజకీయ చర్చలు కూడా ప్రారంభమయ్యాయి.
Revanth reddy : ఇందిరాపార్క్ వేదిక రైతు కాళ్లు మొక్కిన రేవంత్ రెడ్డి.. ఆ రైతు చేసిన పనికి ఫిదా
Hyderabad : మద్యం మత్తులో తండ్రి కర్కశం.. పిల్లాడిని కిందపడేసి దారుణం.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kalvakuntla Kavitha, Nizamabad