హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad Floods: సీఎంఆర్ఎఫ్ కు రామోజీ గ్రూప్ భారీ విరాళం.. కేటీఆర్ కు చెక్కు అందజేత

Hyderabad Floods: సీఎంఆర్ఎఫ్ కు రామోజీ గ్రూప్ భారీ విరాళం.. కేటీఆర్ కు చెక్కు అందజేత

రామోజీరావు Photo : Twitter

రామోజీరావు Photo : Twitter

Hyderabad Floods: వర్షాలు, వరదలతో ఇబ్బందిపడుతున్న హైదరాబాద్ వాసులను ఆదుకోవడానికి రామోజీగ్రూప్ ముందుకు వచ్చింది. వరద బాధిత సహాయార్థం రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు.

  హైదరాబాద్ మహానగరాన్ని జలప్రళయం అతలాకుతలం చేసింది. అనేక మంది చనిపోయారు. నివాసాలు కూలిపోయాయి. రోడ్లు, ఇతర వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దాతలు విరాళాలు ఇవ్వాలని కోరింది. దీంతో అనేక మంది ప్రముఖులు, సినీ హీరోలు, నటులు, దర్శక నిర్మాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామోజీగ్రూప్ సైతం వర్షాలు, వరదలతో ఇబ్బందిపడుతున్న హైదరాబాద్ వాసులను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. వరద బాధిత సహాయార్థం రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ చెక్కును తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు రామోజీ గ్రూప్ సంస్థల ప్రతినిధి గురువారం అందించారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(MEIL) సైతం భారీ విరాళం ప్రకటించిని విషయం తెలిసిందే. వర్షాల వల్ల నష్టపోయిన తెలంగాణ ప్రజలను ఆదుకోవడానికి ముందుకొచ్చిన మేఘా సంస్థ రూ. 10 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నారు. ఈ మేరకు మేఘా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

  ఇప్పటికే నందమూరి నట సింహం బాలకృష్ణ .. హైదరాబాద్ వరద బాధితులకు రూ. 1.50 కోటి విరాళం ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ వరదల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ తమ వంతు విరాళం ప్రకటించారు. తెలంగాణ సహాయనిధికి రూ. 50 లక్షల విరాళం ప్రకటించాడు. మరోవైపు ఎన్టీఆర్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతుగా రూ. 50 లక్షలు ప్రకటించాడు. మహేష్ బాబు కూడా రూ. కోటి విరాళం ప్రకటించారు.మరోవైపు చిరంజీవి కూడా 1 కోటి రూపాయాలను విరాళం అందజేస్తున్నట్టు ప్రకటించాడు. విజయ్ దేవరకొండ రూ. 10లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్.. రూ. 5లక్షల విరాళం ప్రకటిస్తే.. హరీష్ శంకర్, అనిల్ రావిపూడి చెరో రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు.

  ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. చెరువులు తెగి, నాళాలు ఉప్పొంగి.. వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా ఇప్పటికే పదుల సంఖ్యంలో ప్రజలు గల్లంతయ్యారు. వరదనష్టం అంచనా ఇంకా కొలిక్కిరాలేదు. కాగా, రెండ్రోజులుగా వరుణ దేవుడు కాస్తంత శాంతించినా.. వరద ఉధృతి మాత్రం తగ్గడం లేదు. నగరంలోని పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు చెప్పుకోలేని బాధలు అనుభవిస్తునే ఉన్నారు. నగరంలోని సరూర్ నగర్ లో వరదల ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  సరూర్ నగర్ లో ని పలు లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఇప్పటికీ అక్కడ వరద మోకాలిలోతు ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లో నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నా.. ప్రజలకు ఇక్కట్లు మాత్రం తప్పడం లేదు. వరద నీరు ముంచెత్తుతుండటంతో ప్రజలంతా బిల్డింగ్ పైకి ఎక్కి ఆశ్రయం పొందుతున్నారు. బుధవారం రాత్రైనా వరద ప్రవాహం తగ్గలేదు. దీంతో అక్కడున్నవారందరికీ రాత్రంతా జాగరం చేయాల్సి వచ్చింది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Hyderabad Floods

  ఉత్తమ కథలు