హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dragon fruit Farming: ఒకసారి పంట వేస్తే 35 ఏళ్ల వరకు లైఫ్​.. ఎకరాకు రూ. 4 లక్షల ఆదాయం.. సంగారెడ్డి యువకుడి వినూత్న వ్యవసాయం

Dragon fruit Farming: ఒకసారి పంట వేస్తే 35 ఏళ్ల వరకు లైఫ్​.. ఎకరాకు రూ. 4 లక్షల ఆదాయం.. సంగారెడ్డి యువకుడి వినూత్న వ్యవసాయం

చదువుకోని అక్కడే ఉద్యోగం చేశాడు. కానీ, ఎందుకో అది అంతగా సంతృప్తి ఇవ్వలేదు. దీంతో వ్యవసాయం చేయాలనే ఆలోచనతో సొంత ఊరికి వచ్చాడు. విజయవంతమైన వ్యవసాయం చేస్తూ, అత్యధిక లాభాలు గడిస్తూ రమేశ్‌ రెడ్డి అనే యువకుడు ఆదర్శ రైతుగా నిలుస్తున్నాడు.

చదువుకోని అక్కడే ఉద్యోగం చేశాడు. కానీ, ఎందుకో అది అంతగా సంతృప్తి ఇవ్వలేదు. దీంతో వ్యవసాయం చేయాలనే ఆలోచనతో సొంత ఊరికి వచ్చాడు. విజయవంతమైన వ్యవసాయం చేస్తూ, అత్యధిక లాభాలు గడిస్తూ రమేశ్‌ రెడ్డి అనే యువకుడు ఆదర్శ రైతుగా నిలుస్తున్నాడు.

చదువుకోని అక్కడే ఉద్యోగం చేశాడు. కానీ, ఎందుకో అది అంతగా సంతృప్తి ఇవ్వలేదు. దీంతో వ్యవసాయం చేయాలనే ఆలోచనతో సొంత ఊరికి వచ్చాడు. విజయవంతమైన వ్యవసాయం చేస్తూ, అత్యధిక లాభాలు గడిస్తూ రమేశ్‌ రెడ్డి అనే యువకుడు ఆదర్శ రైతుగా నిలుస్తున్నాడు.

ఇంకా చదవండి ...

  (News 18 ప్రతినిధి, కె.వీరన్న,మెదక్ జిల్లా)

  చదువుకోని అక్కడే ఉద్యోగం చేశాడు. కానీ, ఎందుకో అది అంతగా సంతృప్తి ఇవ్వలేదు. దీంతో ఆ ఉద్యోగాన్ని వదులుకొని ఎనిమిది దేశాలు తిరిగి డ్రాగన్‌ ప్రూట్స్‌ వ్యవసాయం  (Dragon Fruits Farming) చేయాలనే ఆలోచనతో సొంత ఊరికి వచ్చాడు. విజయవంతమైన వ్యవసాయం చేస్తూ, అత్యధిక లాభాలు గడిస్తూ  రమేశ్‌ రెడ్డి అనే యువకుడు ఆదర్శ రైతుగా నిలుస్తున్నాడు. రమేశ్‌ రెడ్డి న్యూజిలాండ్‌లో 2014లో చదువు పూర్తి చేసుకున్నాడు.  2016 వరకు అక్కడ ఉద్యోగం చేశారు రమేశ్​. ప్రభుత్వం బిందు సేద్యం పరికరాలు, డ్రాగన్‌ ప్రూట్స్‌  (Dragon Fruits)  సాగుకు సబ్సిడీ ఇవ్వడం, తండ్రి నర్సింహారెడ్డి ప్రోత్సాహం తోడవటంతో వ్యవసాయ రంగంలో అడుగుపెట్టాడు. బంగ్లాదేశ్‌ మొక్కలు కొనుగోలు చేసి 7ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. మొదట 10 రకాలు మొక్కలను సాగు చేశారు. మొక్కలపై పరిశోధన చేసి 80 రకాలు మొక్కలను కొత్త పద్ధతిలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 153 రకాల మొక్కలను నర్సరీలో పెంచి దేశంలోని వివిధ రాష్ర్టాలతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు మొక్కలను ఎగుమతి చేస్తున్నారు.

  ఒక్కసారి వేస్తే 35 సంవత్సరాల వరకు..

  డ్రాగన్‌ ప్రూట్స్‌ (Dragon Fruits) ఒక్కసారి వేస్తే 35 సంవత్సరాల వరకు పంట కాలపరిమితి ఉంటుందన్నారు. పంట వేసినప్పటి నుంచి 25 సంవత్సరాలు వరకు మంచి దిగుబడి ఉంటుంది. ఎకరానికి మొదటి సంవత్సరం 2 టన్నులు, రెండో సంవత్సరం 5 టన్నులు, మూడో సంవత్సరం 8 టన్నుల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. ఎక్కువ దిగుబడి రావడానికి రాత్రి సమయంలో మొక్కలకు వేడి వాతావరణం కోసం పొలంలో కరెంట్‌ దీపాలు ఏర్పాటు చేస్తారు.

  సాగుతో రూ. 4 లక్షల ఆదాయం..

  సంగారెడ్డి (Sangareddy) జిల్లా జహీరాబాద్‌ (Zaheerabad) మండలంలోని రంజోల్‌ గ్రామానికి చెందిన బసంత్‌పూర్‌ నర్సింహారెడ్డి కుమారుడు రమేశ్‌రెడ్డి. న్యూజిలాండ్‌లో ఎంబీఏ చదివి, ఆ దేశంలో ఉద్యోగం చేసేవాడు. కొత్త పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు బంగ్లాదేశ్‌, కోల్‌కతా నుంచి డ్రాగన్‌ప్రూట్‌ (సిరిజెమ్మెడు పండు) మొక్కలు కొనుగోలు చేసి సాగు చేశాడు. ఇలా సాగు చేసి ఎకరాకు రూ. 4 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. వ్యవసాయ క్షేత్రంలో డ్రాగన్‌ ప్రూట్స్‌ నర్సరీ ఏర్పాటు చేసి దేశంలోని పలు రాష్ట్రాలక మొక్కలు సరఫరా చేయడంతో పాటు ప్రపంచంలో అమెరికా, కెన్యా, ఐలాండ్‌, సింగపూర్‌, ఆఫ్రికా దేశాలకు మొక్కలను ఎగుమతి చేస్తున్నారు.

  డ్రాగన్​ ఫ్రూట్స్​

  రంజోల్‌ నుంచి ఇతర దేశాలకు..

  రంజోల్‌ నర్సరీలో పెంచిన మొక్కలను ఆఫ్రికా దేశాలతో పాటు భారత్‌ దేశంలో ఉన్న పలు రాష్ట్రలకు మొక్కలను సరఫరా చేస్తున్నాడు రమేశ్​. ఒక్క మొక్క ధర రూ. 60 నుంచి రూ. 2000 వరకు పలుకుతోంది. రమేశ్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో డ్రాగన్‌ప్రూట్స్‌  (Dragon Fruits) రైతు సంఘం ఏర్పాటు చేసి 300 మంది రైతులకు పంట సాగుపై అవగాహన కలిపిస్తున్నారు. పంట సాగు, దిగుబడి కోసం ప్రపంచంలోని 8దేశాల్లో పర్యటించి పరిశోధన చేశారు. .

  వైన్‌ తయారీ కోసం ప్రయత్నం: రమేశ్‌రెడ్డి

  ‘‘ప్రూట్స్‌తో వైన్‌ తయారు చేసేందుకు ప్రభు త్వ అనుమతి కోసం దరఖాస్తు చేశాను. ప్రభుత్వ అనుమతి రాగానే వైన్‌ ఉత్పత్తి చేసేందుకు కంపెనీ ఏర్పా టు చేస్తాను. ఇప్పటికే ప్రూట్స్‌తో వైన్‌ తయారు చేసేందుకు పరిశోధన చేసి విజయం సాధించాను. సర్కార్‌ అనుమతి ఇవ్వగానే ఉత్పత్తి చేసి, మార్కెట్‌లో అమ్మకాలు చేస్తాం. విదేశాల కంటే సొంత గ్రామంలో వ్యవసాయం చేసి తల్లిదండ్రుల వద్ద ఉండటం సంతోషంగా ఉంది”. అన్నారు రమేశ్​ రెడ్డి.

  First published:

  Tags: Farmer, Organic Farming, Sangareddy

  ఉత్తమ కథలు