సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ..

CM KCR NTR Nandamuri Ramakrishna | తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌కు అన్న ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. తన తండ్రి నందమూరి తారక రామారావు జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో ప్రచురించడం పట్ట సంతోషం వ్యక్తం చేసారు.

news18-telugu
Updated: September 10, 2020, 6:45 PM IST
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ..
సీఎం కేసీఆర్‌కు నందమూరి రామకృష్ణ కృతజ్ఞతలు (Twitter/Photo)
  • Share this:
CM KCR NTR Nandamuri Ramakrishna | తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌కు అన్న ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. తన తండ్రి నందమూరి తారక రామారావు జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో ప్రచురించడం పట్ట సంతోషం వ్యక్తం చేసారు. నందమూరి తారక రామారావు గారి గురించి భావి తరాలకి స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకం లో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణా ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నందమూరి కుటుంబ సభ్యుల తరుపున అభిమానుల తరుపు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు నందమూరి రామకృష్ణ. ఈ  సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ..  మేమె కాదు, యావత్ ప్రపంచమంతటా తెలుగు ప్రజలు వారి వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ గర్వపడుతున్నారు.అంతటి మహనీయుని జీవిత చరిత్రను తెలంగాణ పాఠశాల సిలబళ్ళో చేర్చి పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశం చేయటం భావితరాలకు తప్పకుండా మార్గ దర్శకం ఉంటుందన్నారు.


ఇక స్వర్గీయ ఎన్టీఆర్ గారిలో ఉన్న నీతి, నిజాయితీ,కృషి, క్రమశిక్షణ, పట్టుదల, నిబద్దత, ఇవన్నీ భావి తరాల విద్యార్థలకు ఒక ఊపిరిగా స్పూర్తిగా తీసుకుంటే.. ఉత్తమ పౌరులుగా తయారువుతారరన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు తెలంగాణ కేబినేట్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.  ఇప్పటికే ఈ విషయమై నందమూరి బాలకృష్ణ.. సీఎం కేసీఆర్‌కు ఇప్పటికే కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే కదా.

తనయులతో ఎన్టీఆర్ (File/Photo)


ఎన్టీఆర్ విషయానికొస్తే.. సినిమా నటుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయనకంటూ కొన్ని పుస్తకాలే రాసుకున్నారు. అంతేకాదు సినిమా నటుడిగా ఉంటూ తెలుగు దేశం పార్టీ ( టీడీపీ) అనే రాజకీయ పార్టీ  స్థాపించి తొమ్మిది నెలల్లోనే  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాదు ఉమ్మడి ఏపీలో తొలి కాంగ్రేసేతర సీఎంగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు. ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు ఎన్టీఆర్. మదరాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ ఎన్టీఆర్‌ జీవిత చరిత్రకు పాఠ్య పుస్తకాల్లో చోటు కల్పించడంతో అన్నగారి అభిమానులు కేసీఆర్‌ను కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 10, 2020, 4:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading