Ramagundam: ఓటుకు డబ్బులు ఇచ్చాం కదా .. మీ పని ఏదైనా డబ్బులు ఇవ్వాల్సిందే ..!

ఆర్డీవో వద్ద తమ గోడు వ్యక్తం చేస్తున్న ప్రజలు

చాలా మంది నాయకులు ఓట్లు ప్రక్రియ పూర్తయ్యేవరకే  ప్రజలతో మమేకమై.. ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. ఓ సారి ఎన్నికల పూర్తయిన తర్వాత ప్రజల వద్దకు వచ్చి పలకరించే నాథుడే లేకుండా పోతున్నాడు.

 • Share this:
  వ్యవస్థకు దిశా నిర్దేశం చేసి ముందుకు నడిపించే వాడే నాయకుడు., సమష్టిగా లక్ష్యసాధనకు , తమ తోటి వారిని ప్రభావితం చేయగలుగుతూ , ముందుండి నడిపించగల సామర్థ్యం కలిగి ఉన్నవారే నాయకుడని ప్రజల చేత అనిపించుకుంటారు. అటువంటి వారినే ప్రజలు తమ నాయకుడిగా ఎన్నుకొంటారు. అలా ఎన్నుకొబడిన ప్రజాప్రతినిధి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే ఆపద కాలంలో వారికి అండగా నిలబడాల్సి అవసరం ఉంది. కానీ ఈ కాలంలో నాయకుల తీరు మారుతోంది. చాలా మంది నాయకులు ఓట్లు ప్రక్రియ పూర్తయ్యేవరకే  ప్రజలతో మమేకమై.. ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. ఓ సారి ఎన్నికల పూర్తయిన తర్వాత ప్రజల వద్దకు వచ్చి పలకరించే నాథుడే లేకుండా పోతున్నాడు. ఎన్నికల సమయంలో ఓటర్లను దేవుళ్లుగా చూసేవారు.. తమ సమస్యల గురించి ప్రశ్నిస్తే మాత్రం తమకేం సంబంధం లేదంటున్నారు.

  తాజాగా ఇప్పటికాలంలో నాయకత్వ లక్షణాలు ఎలా ఉన్నాయో.. ప్రజలు ఎం చెబుతున్నారో తెలిపే ఓ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓట్లకు డబ్బులు ఇచ్చాం కదా.. ఇప్పుుడు మీ పని చేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిందినేని ప్రజాప్రతినిధులు తమను అడుగుతున్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ప్రజలు వాపోతున్నారు. వివరాలు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆసరా ఫించన్ , వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు తదితర ఫించన్లను అందజేస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవిర్భవించిన తర్వాత అధికారం చేపట్టిన తెరాస ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటీ నుంచి విజయవంతంగా ఫించన్లు పంపిణీ చేస్తుంది. అయితే రామగుండలో మాత్రం అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లను ఫించన్ కోసం అర్హులైన వారు సంప్రదిస్తే మాత్రం.. వారినే కార్పొరేటర్లు డబ్బులు అడుతున్నారు.

  రామగుండం కార్పొరేషన్ లోని ఓ డివిజన్ లో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ కమిషన్లకు పింఛన్లు అంటున్నాడని ప్రజలు చెబుతున్నారు. ఓటు పుక్యానికే వేశారా? డబ్బులు తీసుకొనే కధ వేసింది.. 2000 వేలు ఇస్తేనే పింఛన్ డబ్బులు వచ్చేటట్టు చేస్తాను అని ప్రజలకు డైరెక్ట్‌గా హెచ్చరిస్తున్నాడు. ఈ విషయాన్ని భూ సర్వే చేసేందు వచ్చిన RDO అధికారిని ప్రజలు అడిగారు. దీంతో ఆర్డీవో కూడా డబ్బులు తీసుకునే ఓటు వేశారు కాదా అని మొదట నోరు జారారు. ఆ తర్వాత ప్రజలు తాము ఎవరిని డబ్బలు కావాలని అడగలేదని.. ఇంట్లో ఉన్న తమ వద్దకు వచ్చి దండాలు పెట్టి మరి డబ్బులు ఇచ్చారని ఆర్డీవోకు తెలిపారు. డబ్బులు రోడ్డు మీద పారేయమంటారా? అంటూ బదులిచ్చారు. దీంతో మాట మార్చిన ఆర్డీవో దరఖాస్తు ఇవ్వండి చూద్దాం అని అక్కడినుండి వెళ్లి పోయాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది ఏది ఏమైనా వీడియో చూసిన ప్రజలంతా ఇప్పటికైనా ఇకనైనా సరైన నాయకులను ఎన్నుకోవడానికి ఓటు హక్కును వినియోగించాలని చర్చించుకుంటునారు.
  Published by:Sumanth Kanukula
  First published: