శంషాబాద్ ఏసీపీని కలిశారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తెలంగాణలో సంచలనం రేపిన దిశ హత్యాచారం... దోషుల ఎన్ కౌంటర్ పై రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఈ సినిమా తీసేందకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొనే ప్రయత్నంలో పడ్డారు. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి అసలు పోలీసుల వైపు నుంచి ఏం జరిగింది ? వారి వెర్షన్ ఎలా ఉంది ? అని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇందులో భాగంగానే శంషాబాద్ ఏసిపి ని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కలిశారు. ఈ సందర్భంగా దిశ ఘటకు సంబంధించిన వర్మ పలు వివరాలు కూడా సేకరించారు. ప్రధానంగా దిశపై ఎఫ్ఐఆర్ నమోదైన దగ్గర్నుంచి ఎన్ కౌంటర్ జరిగిన పూర్తి వివరాలు కూడా తెలుసుకున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకున్నారా? లేదా? అనే విషయం ప్రశ్నించినప్పుడు సినిమాపై ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు వర్మ. సినిమా తీసేందుకు స్వేచ్ఛ ఉందని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.
దిశ సినిమా కోసం ఇప్పటికే దిశ కేసు దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్యను కూడా రాంగోపాల్ వర్మ కొన్ని రోజుల క్రితమే కలిశారు. ప్రత్యేకంగా ఓ టీవీ ఛానల్‌లో ఇంటర్య్యూ కూడా చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్యను కూడా కలిశారు. కొన్ని వివరాలు తెలుసుకున్నాడు. చెన్నకేశవులు భార్య రేణుక 16ఏళ్లకే రేణుక పెళ్లి చేసుకుందని.. ఇప్పుడు 17 ఏళ్ల వయస్సులోనే ఓబిడ్డకు జన్మనివ్వబోతుందని ట్వీట్ చేశారు. అతడు దిశతో పాటు... రేణుకను కూడా బాధితురాలిని చేశాడంటూ వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
నవంబర్ 27న రాత్రి దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి హత్య చేశారు. షాద్ నగర్ మండలం చటాన్‌పల్లి సమీపంలో ఆమె మృతదేహాన్ని కాల్చారు. అయితే, దిశను తగులబెట్టిన చోటే డిసెంబరు 6న నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. షాద్ నగర్ మండలం చటాన్‌పల్లి బ్రిడ్జి సమీపంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు చనిపోయారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో పోలీసులపై దాడిచేసి పారిపోయేందుకు నలుగురు నిందితులు ప్రయత్నించారని పోలీసులు అదే రోజు వెల్లడించారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి తుపాకులు లాక్కొని కాల్పులు జరిపారని.. పోలీసుల జరిగిన ఎదురుకాల్పులో వారు చనిపోయారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Disha accused Encounter, Disha murder case, Ram Gopal Varma, Tollywood Movie News, Tollywood news