Green India Challenge: మొక్కలు నాటితేనే భవిష్యత్ : రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే

రాజ్యసభ ఎంపీ, టీఆర్ఎస్ నాయకుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశమంతా విస్తరిస్తున్నది. పలువురు సెలబ్రిటీలే గాక రాజకీయ నాయకులు, సివిల్ సర్వెంట్లు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు.

news18
Updated: October 23, 2020, 11:41 AM IST
Green India Challenge: మొక్కలు నాటితేనే భవిష్యత్ : రాజన్న సిరిసిల్ల  ఎస్పీ రాహుల్ హెగ్డే
మొక్క నాటుతున్న ఎస్పీ
  • News18
  • Last Updated: October 23, 2020, 11:41 AM IST
  • Share this:
రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే స్వీకరించారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మూడు మొక్కలు నాటారు.
అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ కు, నిజామాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయకు, కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతా కు గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించాల్సిందిగా కోరారు. మొక్కలు నాటి పర్యవారణాన్ని కాపాడాలని ఆయన ప్రజలకు సూచించారు. మన భావితరాలకు అందించేది మంచి పర్యావరణమేనని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హారతహరం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అమలు చేయడం జరుగుతోందని అన్నారు. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు, ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా రానున్న రోజుల్లో భవిష్యత్తు తరాలవారికి కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడం కోసం ప్రత్యక్ష భాగస్వామలవుదామని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో ఆదర్శనీయమని, ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందివ్వాలని అని కోరారు.

rajanna siricilla sp, sp rahul hegde, collector krishna bhaskar, nizamabad cp, kamareddy sp, green india challenge, rajyasabha mp santhosh kumar, trs, santhosh kumar
మొక్కకు నీళ్లు పోస్తున్న ఎస్పీ


జాతీయ అటవీ సంరక్షణ సంస్థ చేసిన సర్వే ప్రకారం.. మన రాష్ట్రం దేశంలోనే 5 వ స్థానం ఉన్నదంటే దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరిత హారం యొక్క ప్రతిఫలం, సీఎం దూరదృష్టికి నిదర్శనం అని కొనియాడారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి జిల్లాలోని పోలీసు కార్యాలయాలలో విస్తృతంగా మొక్కలు నాటుతున్నామని తెలిపారు.

అలాగే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచిస్తూ సకాలంలో వర్షాలు కురవాలన్నా, వాతావరణ సమతుల్యత కావాలన్నా మొక్కల పెంపకం ఒక్కటే మార్గమని అన్నారు. మన భావితరాలకు కాలుష్యం లేని పర్యావరణం అందించాల్సిన నైతిక బాధ్యత మనపైనే ఉన్నదని ఎస్పీ తెలిపారు.
Published by: Srinivas Munigala
First published: October 23, 2020, 11:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading