హోమ్ /వార్తలు /తెలంగాణ /

పిల్లల్ని చదివించిన తల్లిదండ్రులు ఏడుస్తున్నారు: వైఎస్ షర్మిల

పిల్లల్ని చదివించిన తల్లిదండ్రులు ఏడుస్తున్నారు: వైఎస్ షర్మిల

షర్మిల Pc: (Twitter/ANI)

షర్మిల Pc: (Twitter/ANI)

కంప్యూటర్ నుంచి పేపర్ లీక్ అయితే నాకేం సంబంధం అని.. కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. TSPSC కి ట్రాన్స్పరెన్సీ ఉంది అని పచ్చి అబద్ధాలు చెప్తున్నారన్నారు. బంగారు తెలంగాణ లో వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Karimganj

వన్ పరీక్ష రద్దు చేయడంతో... ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుటుంబాన్ని పరామర్శించారు తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిల. ఉద్యోగం దొరకక నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఈ ఘటన చాలా బాధకరమన్నారు. నవీన్ కుటుంబం టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబమన్నారు. అయినా మానవత్వం తో పరామర్శ కి వచ్చామన్నారు షర్మిల. ఇక్కడ ఏ పార్టీ కుటుంబం అనేది కాదు.. ఇక్కడ సమస్య నిరుద్యోగం అన్నారామె. నవీన్ ఆత్మహత్య చేసుకున్నది నిరుద్యోగంతోనే అని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగం లో తెలంగాణ నంబర్ 1 అని విమర్శించారు. ఏడాది క్రితం అసెంబ్లీ లో నిలబడి 88 వేల ఉద్యోగాలు అంటూ ప్రకటన చేశారన్నారు.

కానీ ఏడాదిలో ప్రభుత్వం ఇచ్చినవి 26 వేల ఉద్యోగాలు మాత్రమే అన్నారు. ఇప్పటికీ 8 వేల ఉద్యోగాలకు మాత్రమే పరీక్షలు జరిగాయన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో గ్రూప్ 1 రాయొద్ధని రెచ్చగొట్టారన్నారు. మరి 8 ఏళ్లలో గ్రూప్ 1 ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వడం కేసీఆర్ ప్రభుత్వానికి చేతకాలేదన్నారు. కేసీఅర్ ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు షర్మిల. బిడ్డ ఓడిపోతే జాబ్ లేదని వెంటనే MLC జాబ్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవాలి.. కేసీఅర్ బిడ్డలు మాత్రం రాజ్యం ఏలాలి అంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

కంప్యూటర్ నుంచి పేపర్ లీక్ అయితే నాకేం సంబంధం అని.. కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. TSPSC కి ట్రాన్స్పరెన్సీ ఉంది అని పచ్చి అబద్ధాలు చెప్తున్నారన్నారు. ఇద్దరికీ తెలియాల్సిన పాస్ వర్డ్ లు అందరికీ తెలియడం ట్రాన్స్పరెన్సీ అంటారా? అంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారు షర్మిల. ఐటీ శాఖ మంత్రిగా ఆయనకు సిగ్గుండాలన్నారు. సిస్టమ్ లో సమాచారం భద్రత లేక పోతే ఐటీ శాఖ మంత్రి బాధ్యత కాదా అని నిలదీశారు. రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చాం అని అబద్ధాలు చెప్తున్నారన్నారు. మీకు దమ్ముంటే 2 లక్షల ఉద్యోగాల మీద వైట్ పేపర్ రిలీజ్ చేయాలన్నారు. ఇంత జరిగినా కూడా TSPSC నీ కేటీఆర్ వెనుక వేసుకు వస్తున్నారన్నారు. వెంటనే బోర్డ్ ను రద్దు చేయాలని... పరీక్షలను మళ్లీ తొందరగా నిర్వహించాలని షర్మిల డిమాండ్ చేశారు.

బంగారు తెలంగాణ లో వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కనీసం ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఉద్యోగాల కల్పన లేదన్నారు. కేసీఅర్ చేసిన మోసాలకు నిరుద్యోగులు లెటర్లు రాసి పెట్టీ మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల చావులకు కారణం కేసీఅర్ అన్నారు షర్మిల. నిరుద్యోగుల ఆత్మహత్యలు ప్రభుత్వం చేస్తున్న ఆత్మహత్యలే అన్నారు. బిడ్డలను చదివించి తప్పు చేశాం అని ఏడుస్తున్నారన్నారు. ఇది బంగారు తెలంగాణ కాదు.. ఆత్మహత్యల తెలంగాణఇది బార్ల తెలంగాణ.. బీర్ల తెలంగాణ అంటూ షర్మిల కేసీఆర్ పాలనపై మండిపడ్డారు.

First published:

Tags: CM KCR, Local News, YS Sharmila

ఉత్తమ కథలు