Haribabu, News18, Rajanna Sircilla
ఒకప్పుడు ఫోక్ సాంగ్స్ అంటే చిన్న చూపు ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి మూవీలో ఫోక్ సాంగ్స్ తోనే మూవీస్ హిట్ అవుతున్నాయంటే అర్ధం చేసుకోవచ్చు ఫోక్ సాంగ్స్ కు ప్రజాదరణ ఎంత ఉంటుందో. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచే కొంతమేర జానపద కళాకారులకు ప్రాముఖ్యత పెరిగిందనే చెప్పాలి. తెలంగాణ (Telangana) సాంస్కృతి సాంప్రదాయాలకు బోనాలు ప్రతీక అయిన సంగతి తెలిసిందే. కాగా, మొట్టమొదటిసారిగా యూట్యూబ్ (You Tube) తల్లి గూగులమ్మ, బద్ది పోచమ్మ తల్లికి బోనాలు వేడుక నిర్వహించి యూట్యూబర్లు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. "యూట్యూబ్ తల్లి, గూగులమ్మ బద్ది పోచమ్మ తల్లికి బోనాలు' అనే ట్యాగ్ లైన్ తో ఈ వేడుకలు నిర్వహించారు.
బద్ది పోచమ్మ తల్లికి బోనాలు
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి (Vemulawada Temple) వారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ బద్ది పోచమ్మతల్లికి (ITF)ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా యూట్యూబర్స్, కళాకారులు బద్దిపోచమ్మకు బోనాలను సమర్పించుకొని సేవలో తరించారు. యూట్యూబ్, గూగుల్ తో ఉపాధి పొందుతున్న కళాకారులు.. యూట్యూబ్, గూగుల్ కళాకారులు ఆటపాటలతో పట్టణ పురవీధులు మారుమోగాయనే చెప్పాలి. కళాకారులు, యూట్యూబ్ స్టార్స్ సందడి చేశారు.
వేములవాడలో భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించుకుని సేవలో తరించారు. అమ్మవారి కరుణాకటాక్షాలతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు వారు. ముందుగా వేములవాడ పట్టణంలోని అమరవీరుల స్తూపం, మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ బోనాలతో యూట్యూబర్స్ ఉదయం మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి వేములవాడ పట్టణంలోని మహారాజా ఫంక్షన్ హాల్ లో ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ భారీ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షకలక శంకర్ హాజరై.. తను హీరోగా నటిస్తున్న దళారి మూవీ ట్రైలర్ విడుదల చేసి సందడి చేశాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒగ్గు, జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేములవాడ పట్నంతో పాటు వివిధ గ్రామాల నుంచి భారీగా యువత తరలిరావడంతో జగిత్యాల బస్టాండ్ ప్రాంతమంతా రద్దంగా మారింది. ఈ వేడుకల్లో ప్రముఖులు రాజ్ నరేంద్ర, తేలు విజయ, స్వర్ణ, మధుప్రియ, మౌనిక యాదవ్, మాట్ల తిరుపతి , GL నాందేవ్, మామిడి మౌనిక, శిరీష, వడ్లకొండ అనిల్, మల్లిక్ తేజ, బుర్ర నటరాజ్, మారం ప్రవీణ్,రఫీ, జెడి సుమన్, గణేష్, బుర్ర సతీష్, పొద్దుపొడుపు శంకర్, సరిత, జానపద కళాకారులు తదితరులు ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Siricilla, Telangana, Vemulawada