హోమ్ /వార్తలు /తెలంగాణ /

Shocking News: విధి ఆడిన వింత నాటకం.. యువతికి మృత్యువును చూపించిన తేలు.. 

Shocking News: విధి ఆడిన వింత నాటకం.. యువతికి మృత్యువును చూపించిన తేలు.. 

యువతి

యువతి

చదువు పూర్తి చేసుకున్న ఆ యువతీ మంచి ఉద్యోగం సంపాందించింది. మరో రెండు రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉండగా విధి ఆడిన వింత నాటకానికి బలైంది. తేలు కాటుకు గురైన ఓ యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (Haribabu, News18, Rajanna Sircilla)

  చదువు పూర్తి చేసుకున్న ఆ యువతీ (Woman) మంచి ఉద్యోగం (Job) సంపాందించింది. మరో రెండు రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉండగా విధి ఆడిన వింత నాటకానికి బలైంది. తేలు కాటుకు గురైన ఓ యువతి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన సిరిసిల్ల (Sircilla) మున్సిపల్ పరిధిలోని రుగుడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం..రగుడుకు చెందిన దొంతుల బాలమల్లు - పద్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో కూతురు మాలతి (22) బీటెక్ పూర్తి చేసి ఇటీవలే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. మరికొన్ని రోజుల్లో ఉద్యోగంలో జాయిన్ కావాల్సి ఉంది. ఈక్రమంలో ఆదివారం తల్లిదండ్రులతో కలిసి తమ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన మాలతి, కూరగాయలు తెంపుతున్న సమయంలో కాలికి ఏదో విషపురుగు కుట్టినట్లు అనిపించిందని చెప్పింది. అక్కడున్న వారికి తేలు (Scorpio) కనిపించింది. మాలతిని వెంటనే సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె హృదయ స్పందన తక్కువగా ఉందని, మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

  రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన మాలతి పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. ఉద్యోగం చేసి ,తమకు అండగా ఉంటుందనుకున్న కూతురు ఇలా తమ కళ్లెదుటే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

  వినాయకుడి ఊరేగింపులో ఘర్షణ, ఒకరి పరిస్థితి విషమం:

  వినాయకుడి నిమజ్జన ఊరేగింపు సమయంలో పలువురి మధ్య చోటుచేసుకున్న ఘర్షణ చివరకు కత్తులతో పొడుచుకునే వరకు వెళ్ళింది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు కథలాపూర్ మండలం పెగ్గేర్ల గ్రామంలో సోమవారం రెండు గ్రూపులకు చెందిన వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. ఈక్రమంలో ఊరేగింపుగా వెళుతున్న ఇరువర్గాల వారు ఒక్కసారిగా కత్తులతో ఒకరినొకరు దాడి చేసుకున్నారు. ఈదాడుల్లో మహేష్, నరేష్, ప్రశాంత్, రాజులకు గాయాలు అయ్యాయి. వీరిలో మహేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Local News, Sircilla, WOMAN, Women died

  ఉత్తమ కథలు