రిపోర్టర్ : హరిబాబు
లొకేషన్ : సిరిసిల్ల
ఒక కాన్పులో ఒకరు లేదా ఇద్దరు శిశువులు జన్మించడం సహజం. అరుదుగా మనం ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు పిల్లలు జన్మించిన సందర్భాలు చూస్తుంటాం. అలాంటి సంఘటనే ఇది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కాన్పు కోసం చేరిన ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని సముద్రలింగాపూర్ గ్రామానికి చెందిన గొట్టుముక్కల లావణ్య కాన్పు కోసం ముస్తాబాద్ పీపుల్స్ ఆస్పత్రిలో చేరారు.
ఇది ఆమెకు 2వ కాన్పు కాగా మొదటి కాన్పులో బాబు.. పుట్టాడు. అతనికి 9 ఏళ్లు. 2వ కాన్పులో తొలుత బాబు, తరువాత పాప, అనంతరం మరో ఇద్దరు బాబులు జన్మించారు. వీరికి మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట చిల్డ్రన్ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఒకే కాన్పులో నలుగురికి పిల్లలకు జన్మనివ్వడంతో పాటు వారంతా ఆరోగ్యంగా ఉండటంఅరుదైన విషయమని వైద్యులు వెల్లడించారు.
ముస్తాబాద్ మండల కేంద్రంలోని పీపుల్స్ హాస్పిటల్ లో ఒకే కాన్పులో 4 శిశువులు జన్మనిచ్చిన గొట్టేముక్కుల లావణ్య, భర్త కిషన్ లకు మొదటి కాన్పులో కుమారుడు జన్మించగా రెండో కాన్పులో ముగ్గురు మగ శిశువులు ఒకరు ఆడ శిశువు జన్మించారు. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామం వారిది..ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ శంకర్ మాట్లాడుతూ.. 10 లక్షల్లో ఒకరికి కాన్పులో ఇలా జన్మిస్తారని అన్నారు.
డాక్టర్ అఖిల సైతం మాట్లాడుతూ.. నిన్నటి రోజున మార్చి 27న ఆసుపత్రిలో లావణ్య అడ్మిన్ కాగా 8నెల గర్భిణీఉమ్మనీరు ఎక్కువగా వెళ్లడంతో 10 గంటలకు ఆపరేషన్ చేయగా నలుగురు పిల్లలకు జన్మించారు.ఒక్కొక్కరు కిలోకు పైగా బరువుతో ఉన్నారని పేర్కొన్నారు. అందరూ క్షేమంగా ఉన్నారని, పుట్టిన పిల్లలను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తల్లి, నాలుగు మంది శిశువులు ఆరోగ్యంగానే ఉన్నారని, కొద్ది వారాల పాటు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో తరువాత వారిని డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తోంది. శిశువులు, తల్లి క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Rajanna sircilla