Home /News /telangana /

RAJANNA SIRCILLA WOMAN DIED UNDER SUSPICIOUS CIRCUMSTANCES POLICE FILE CASE IN VEMULAWADA RKH BRV PRV

Rajanna Sircilla: ఇంటిపై బట్టలారేయడానికి వెళ్లిన మహిళ.. విగతజీవిగా ఎందుకు మారింది.. అసలేం జరిగింది?

రాజన్న సిరిసిల్ల జిల్లా క్రైమ్​

రాజన్న సిరిసిల్ల జిల్లా క్రైమ్​

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన బైరి లచ్చవ్వ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఇది హత్యా? ఆత్మహత్యా?

  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India
    (K. Haribabu, News 18, Rajanna sircilla)

    రాజన్న సిరిసిల్ల (Rajanna Siricilla) జిల్లా వేములవాడ (Vemulawada) రూరల్ మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన బైరి లచ్చవ్వ (40) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిందని రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నామని అన్నారు. ఇంటిపైన బట్టలు ఆరేసేందుకు వెళ్లిన లచ్చవ్వ అక్కడే విగతజీవిగా పడిపోయింది. పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరెంట్ షాక్ తో మృతిచెందిందా లేక !?అనారోగ్యంతో మృతిచెందిందా! అనేది తెలియాల్సి ఉందన్నారు.

    కారు, ద్విచక్ర వాహనం ఢీ..

    రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద బుధవారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే ..సింగారం గ్రామం నుంచి వస్తున్నా కారు... పాత బస్టాండ్ వద్ద సిరిసిల్ల వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తంగళ్లపల్లి మండలం జిల్లెలకు చెందిన సలీంకు తీవ్రగాయాలు కాగా, మరో వ్యక్తికి స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికంగా ప్రథమ చికిత్స అందించి ఇద్దరిని సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

    OMG: ఇంతటి దారుణమా? ఇద్దరు పిల్లలు తనకు పుట్టలేదనే అనుమానంతో గుట్టపైకి తీసుకెళ్లి..



    అపరిచిత వ్యక్తులతో అప్రమత్తం..

    రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల ప్రజలకు పోలీసులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల్లోకి వచ్చే అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని ఏఎస్సై కిషన్ రావు అన్నారు. గ్రామాల పరిధిలో చోరీ ఘటనలపై మండల కేంద్రంలో బుధవారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం దుమాలలో డ్రంకెన్ డ్రైవ్ లో ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. వాహనదారులందరూ విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. డ్రంక్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్ చేస్తే జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనదారులందరూ ప్రమాదాల నివారణకు నియంత్రిత వేగంతో ప్రయాణించాలని సూచించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Local News, Siricilla

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు