హోమ్ /వార్తలు /తెలంగాణ /

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీలు భర్తీ అయ్యేదెప్పుడో? ఏడాదిన్నరగా నిరీక్షణ

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీలు భర్తీ అయ్యేదెప్పుడో? ఏడాదిన్నరగా నిరీక్షణ

అంగన్‌వాడీ కేంద్రం

అంగన్‌వాడీ కేంద్రం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 587 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో 560 ప్రధాన కేంద్రాలు, 20 మినీ కేంద్రాలుగా ఉన్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం 80 ఖాళీలు ఉండగా 72 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Sircilla, India

రిపోర్టర్ : హరిబాబు

లొకేషన్ : సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది. 2021 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అంగన్వాడీ టీచరు, అంగన్వాడీ సహాయకుల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. 2022 అక్టోబర్ మాసంలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి అయిన విషయం తెలిసిందే. అనంతరం ప్రక్రియలో కదలికలేకపోవడంతో పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారోనని దరఖాస్తుదారులు నిరీక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 587 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో 560 ప్రధాన కేంద్రాలు, 20 మినీ కేంద్రాలుగా ఉన్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం 80 ఖాళీలు ఉండగా 72 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇందులో 13 ప్రధాన అంగన్వాడీటీచర్స్, ఒక మినీ అంగన్వాడీ టీచర్, 58 మంది అంగన్వాడీ సహాయకుల ఖాళీలకు సంబంధించి 600 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దాదాపు12నెలల తర్వాత గత సంవత్సరం అక్టోబరులో సర్టిఫికెట్లను పరిశీలించారు.

ఖాళీల్లో వేములవాడ ICDS ప్రాజెక్ట్ పరిధిలో బోయినపల్లి -2, రామన్నపేట,జోగాపూర్ - 1, అంగన్వాడీ టీచర్ పోస్టులు, కొత్తపేట మినీ అంగన్వాడీ టీచర్ పోస్టు ఖాళీ ఉన్నాయి. అంగన్వాడి సహయకుల్లో.. బోయినిపల్లి 2, రామన్నపేట, నీలోజుపల్లి, విలా సాగర్ 1, వీలాసాగర్4, వీలాసాగర్5, వరవెల్లి -1, మల్యాల -2, మర్రిగడ్డ -1, చందుర్తి -2, రుద్రంగి -3, నిమ్మపల్లి -1, పల్లిమక్త, మల్కపేట-2, మర్రిపల్లి-1, మల్లారం-2, అనుపురం-1, హన్మాజీపేట-1 కొడుముంజ, వేములవాడ ఓల్డ్ అర్బన్ కాలనీలో ఖాళీలు ఉన్నాయి. సిరిసిల్ల ఐసీడీఎస్( ICDS )పరిధిలో అంగన్వాడీ టీచర్ పోస్టుల్లో తుక్కారావుపల్లె, ఇందిరానగర్-2, టెక్స్టైల్ పార్కు ఇందిరమ్మకాలనీ, పెద్దలింగాపూర్-1, అరెపల్లి, జంగమరెడ్డిపల్లె, గోరంటాల-2, లింగన్నపేటతండా, గంభీరావుపేట-10, పోత్గల్-2లోని 10 పోస్టులకు సంబంధించి 2022 అక్టోబరు 21న సిరిసిల్ల ICDS కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. 22వ తేదీన అంగన్వాడీ సహాయకుల్లో సిరిసిల్ల వెంకంపేట-2, శాంతినగర్- 2, నెహ్రూనగర్ - 1, నెహ్రూనగర్ 2, అశోక్ నగర్, తంగళ్లపల్లి మండలం మండెపల్లి -1, తాడూర్ -2, బస్వాపూర్, జిల్లెల్ల -1, టెక్స్టైల్ పార్కు ఇందిరమ్మ కాలనీ, జిల్లెల్ల - 4, అంకిరెడ్డిపల్లె, అంకిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీ, సోమారంపేట, అనంతగిరి - 2, అనంతారం - 2, సిరికొండ, నర్మాల క్యాంపు, లింగన్నపేట - 4, నర్మాల -1, నర్మాల -2, గంభీరావుపేట -2, సముద్రలింగాపూర్ -1, గంగవరం1, కొత్తపల్లి - 4, శ్రీగాధ, కొత్తపల్లి - 1, గంభీరావుపేట 7, గంభీరావుపేట -10, గూడెం - 2, గూడెం - 3, సేవాలాల్ తండా, మద్దిమల్ల - 2, వీర్నపల్లి 3, పదిర2, ముస్తాబాద్, చీర్లవంచ ఆర్అండ్ ఆర్ కాలనీకు, ఎల్లారెడ్డిపేట-7కు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్లను పరిశీలించారు. ఫొటోలు, సర్టిఫికెట్ల జిరాక్స్ సెట్లను తీసుకున్నారు. భర్తీ జరుగుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న దాదాపు 4 నెలలు గడిచినా ఇప్పటివరకు జాబితాను వెల్లడించలేదు. మరో వారం రోజుల్లో జాబితా వెల్లడిస్తారని దరఖాస్తుదారులు భావిస్తున్నారు.

19 కేంద్రాలకు తాజాగా ప్రతిపాదనలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా విస్తరిస్తున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల పెంపునకు కూడా ప్రతిపాదనలు పంపించారు. జిల్లాలో కొత్తగా 19 అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. వేములవాడ ప్రాజెక్ట్ పరిధిలో 8 కేంద్రాలు, సిరిసిల్ల ప్రాజెక్ట్ పరిధిలో 11 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఇందులో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 3 ఉండగా, 16 మినీ కేంద్రాలకు ప్రతిపాదనలు పంపించారు. ఇందులో తంగళ్లపల్లి మండలంలో మండెపల్లి కేసీఆర్ కాలనీ, చింతల్రాణా, ఎల్లారెడ్డిపేట మండలం బాకురుపల్లి తండా, గర్జనపల్లి, గుంటపల్లి చెరువు తండా, కిష్టునాయక్ తండా, ముస్తాబాద్ మండలం మోయినికుంట పిట్టల కాలనీ, సిరిసిల్లలోని తుర్కాశిపల్లె, ఇల్లంతకుంట మండల కిష్టరావుపల్లి, గూడెపుపల్లి, వీర్నపల్లి మండలం రాశిగుట్ట తండా, వేములవాడ అర్బన్ మండలం ఇస్లాంనగర్, తూర్కాశిపల్లి, శాలరామన్నపల్లె, కోనరావుపేట మండలంలో రామన్నపేట, గొల్లపల్లి, కమ్మరిపేట తండా, అజ్మీర్ తండా, చాంద్ నగర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ICDS ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ కేంద్రాలు పోషక కేంద్రాలుగా మారాయి. కేంద్రాల ద్వారా నిత్యం గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారాన్ని అందుకుంటున్నారు. ఇందులో గర్భిణులు 3,793 మంది, బాలింతలు 2318 మంది ఉన్నారు. వీరితో పాటు 3 సంవత్సరాలలోపు పిల్లలు 16,676 మంది, 3 నుండి 6 సంవత్సరాల పిల్లలు 14,594 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. 3 సంవత్సరాల పిల్లలకు బాలామృతం, 16 కోడి గుడ్లు, టేక్ హోం రేషన్ కింద అందిస్తున్న విషయం తెలిసిందే. బాలింతలు, గర్భిణులకు 3 నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఒక పూట సంపూర్ణభోజనం, ప్రతీ రోజు కూరగాయలు, గుడ్డు, పాలు, పప్పుతో సంపూర్ణ ఆహారాన్ని అందిస్తున్నారు. ఇటీవల మిల్లెట్ ఫుడ్ ను సైతం ఇస్తున్నారు. దీంతోపాటు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. ఆట, మాట, పాట, కథ, సృజనాత్మక వంటి కార్యక్రమాలతో విద్యను అందిస్తున్నారు. పోషణ్ అభియాన్ ద్వారా పిల్లల బరువులు, పోషణ లోపాన్ని గుర్తించి వారికి ఆహారాన్ని అందజేస్తున్నారు. మున్సిపల్, గ్రామాలు, మండల స్థాయిలోనూ అవగాహన కార్యాక్రమాలను చేపడుతున్నారు. అయితే కేంద్రాలకు సిబ్బంది కొరత ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది.

First published:

Tags: Local News, Rajanna sircilla, Telangana

ఉత్తమ కథలు