(K. Haribabu,News18, Rajanna siricilla)
ప్రజల సమస్యలు (Problems) పరిష్కరించాల్సిన అధికారులు ముఖం చాటేశారు. గ్రామాభివృద్ధి (Village Development) పై ప్రభుత్వం శీతకన్ను వహించింది. ఇక ప్రభుత్వాలు, అధికారులను నమ్ముకుంటే పని కాదని భావించిన ఆ గ్రామ యువకులు (Village Youth) తమంతట తామే ముందుకు వచ్చి సమస్యని పరిష్కరించుకున్నాడు. మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల (Sircilla) నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలం మంగళ్ళపల్లి గ్రామంలో రోడ్డు కిలోమీటర్ వరకు గుంతల మయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు విన్నవించినా, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఆ ఊరి ప్రజల గోడు ఎవరూ పట్టించుకోలేరు.
మంగళ్ళపల్లి (Mangallapally) గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఊరడి మధు, ఉప్పుల శ్రీకాంత్, సాసాల సురేష్‌లు గ్రామంలోని రోడ్డు సమస్యను పరిష్కరించేందుకు ముందుకు కదిలారు. ప్రయాణికుల అవస్థలు, గ్రామ ప్రజల ఇబ్బందులు చూడలేక దాదాపు రూ. 40 వేలు తమ సొంత డబ్బులు పోగేసి, రోడ్డుకు మొరం మట్టి పోయించి చదును చేసి గుంతలను పూడ్చారు. యువకులు చేసిన మంచి పనిని చూసి గ్రామ ప్రజలు అభినందించారు. గ్రామంలో ఉన్న ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ముందుకొచ్చి యువకులు చేసిన మంచి పనిని అందరూ అభినందిస్తున్నారు.
ఈ సందర్భంగా గ్రామ యువకులు మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డు సమస్య ఇలానే ఉందని, ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ ఊరి రోడ్డుని పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ఎమ్మెల్యేకు, కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇచ్చినా వారి నుంచి ఎటువంటి స్పందనా లేదని యువకులు వాపోయారు. వర్షాలకు పూర్తిగా దెబ్బతిని, గతుకుల మయంగా మారిన రోడ్డుపై ప్రయాణికులు, గ్రామ ప్రజల అవస్థలు చూడలేక తమ సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మతులు చేయించినట్లు యువకులు తెలిపారు.
Thieves: దొంగల వింత డిమాండ్.. ఐదుగురం దొంగతనం చేశాం.. ఇద్దరినే పట్టుకుంటే ఎలా?
ఈ రోడ్డు గుండా నిత్యం ఎనిమిది గ్రామాల ప్రజలు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారని, వర్షాలు పడ్డ సమయంలో ఈ రోడ్డు గుండా వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుందని యువకులు అంటున్నారు. అత్యవసరసమయంలో మండల కేంద్రానికి వెళ్లాలన్నా, గర్భిణీలు ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోతున్నామని యువకులు అంటున్నారు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్, జిల్లా అధికారులు స్పందించి గ్రామానికి బీటీ రోడ్డు వేయించాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Sircilla, Village