హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Sircilla: ఆ గ్రామ సర్పంచ్​ భర్త చేసిన ఓ తప్పుకు.. ఊరంతా ఒకరోజు చీకట్లో బతకాల్సి వచ్చింది.. ఏం జరిగిందంటే?

Rajanna Sircilla: ఆ గ్రామ సర్పంచ్​ భర్త చేసిన ఓ తప్పుకు.. ఊరంతా ఒకరోజు చీకట్లో బతకాల్సి వచ్చింది.. ఏం జరిగిందంటే?

వేములవాడ

వేములవాడ

ఆ ఊరి గ్రామ సర్పంచ్ భర్త చేసిన నిర్వాకంతో రోజంతా కరెంటు లేక పడిగాపులు పడ్డారు ఆ గ్రామ ప్రజలు. ఉత్సవాలకు అడ్డుగా ఉందన్న కారణంతో రావి చెట్టును తొలగించేందుకు మర రంపంతో ఏర్పాట్లు చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Vemulawada R, India

  (K. Haribabu, News18, Rajanna siricilla)

  మంచి చేయబోతే చెడు ఎదురైంది అన్న చందంగా తయారయింది ఆ గ్రామంలో (Village). ఆ ఊరి గ్రామ సర్పంచ్ భర్త  (Village Sarpanch Husband) చేసిన నిర్వాకంతో రోజంతా కరెంటు లేక (No Power) పడిగాపులు పడ్డారు ఆ గ్రామ ప్రజలు. రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా వేములవాడ గ్రామీణ మండలం హన్మాజీపేట గ్రామంలో దుర్గామాత ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలోని గడి దగ్గర ఎంతో విశిష్టత ఉన్నా రావి చెట్టు ఉత్సవాలకు అడ్డుగా ఉందన్న కారణంతో చెట్టును తొలగించేందుకు మర రంపంతో ఏర్పాట్లు చేశారు. అయితే చెట్టును నరికి వేస్తున్న సమయంలో చెట్టుకొమ్మలు విరిగి ఒక్కసారిగా దగ్గరలో ఉన్న విద్యుత్ స్తంభాలపై పడటంతో దాదాపు నాలుగు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

  ఆ సమయంలో విద్యుత్ వైర్ల (Electric Wires) కింద ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. ఒకవేళ ఆ సమయంలో పిల్లలు, మరెవరైనా అటుగా వచ్చి ఉంటే పరిస్థితి ఊహించుకోవడానికే కష్టంగా ఉందని అన్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పనులు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  పనులు నిర్వహిస్తున్న రావి చెట్టు సమీపంలోని విద్యుత్ స్తంభంపైన చెట్టు కొమ్మలు ఒక్కసారిగా పడటంతో విద్యుత్ స్తంభం విరిగిపోయి రోడ్డుపై పడిపోయింది. గ్రామపంచాయతీ ఎదుట గజ్జల శంకరయ్య ఇంటి సమీపంలో ఉన్న స్తంభాలు వంగిపోయి ప్రమాదకరంగా మారాయి. అంతేకాకుండా విక్కుర్తి ఎల్లయ్య దుకాణంపైన విద్యుత్ స్తంభం పూర్తిగా ఓరగడంతో భయందోలనకు గురవడంతో పాటు ఆస్తి నష్టం వాటిల్లింది.

  Thieves: దొంగల వింత డిమాండ్​.. ఐదుగురం దొంగతనం చేశాం.. ఇద్దరినే పట్టుకుంటే ఎలా?

  చెట్టును తొలగించే ముందు విద్యుత్ వైర్లు ఉండడంతో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోరా అంటూ గ్రామ ప్రజలు సర్పంచ్ భర్తపై మండిపడుతున్నారు. మరోవైపు గ్రామ ప్రజలు చల్లగా సేద తీరేందుకు, ఎండలకు రక్షణగా ఉన్న చెట్టును తొలగించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామంలో తొలిసారిగా దుర్గామాత విగ్రహం ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించగా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై గ్రామ ప్రజలు అపశకునంగా భావిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Local News, Sircilla, Vemulawada

  ఉత్తమ కథలు