Home /News /telangana /

RAJANNA SIRCILLA VILLAGE REVENUE ASSISTANTS PROTESTING AGAINST THE GOVERNMENT IN RAJANNA SIRCIALL DISTRICT ABH BRV RKH

Rajanna Sircilla: జోరు వానలోనూ సమ్మె కొనసాగిస్తున్న వీఆర్ఏలు... పే స్కేల్ చెల్లించాలని డిమాండ్

జోరు

జోరు వానలోనూ సమ్మె కొనసాగిస్తున్న వీఆర్ఏలు.. పే స్కేల్ చెల్లించాలని డిమాండ్

రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులుగా వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేస్తున్నారు. వివిధ పార్టీల నాయకులతో పాటు వీఆర్వోలు సైతం వీఆర్ఏల సమ్మెకు మద్దతు తెలిపారు. వీఆర్ఏలకు పే స్కేల్ చెల్లించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఇంకా చదవండి ...
    (K.Haribabu, News 18, Rajanna siricilla)

    రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులుగా వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేస్తున్నారు. వివిధ పార్టీల నాయకులతో పాటు వీఆర్వోలు సైతం వీఆర్ఏల సమ్మెకు మద్దతు తెలిపారు. వీఆర్ఏలకు పే స్కేల్ చెల్లించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా వీఆర్ఏలకు పే స్కేల్, ప్రమోషన్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ..పెద్ద ఎత్తున వీఆర్ఏలు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఏల జేఏసీ నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు ఇస్తున్నటువంటి రూ.10,500 జీతంతో తమ కుటుంబాలను ఏలా పోషించాలని ప్రశ్నిస్తూ ఆవేదన చెందారు. వీఆర్ఏల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లను నెరవేర్చకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా వున్న దాదాపు 23 వేల వీఆర్ఏలందరూ మూకుమ్మడిగా సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు.

    సీఎం కేసీఆర్, ప్రభుత్వం స్పందించకపోవడంతో జిల్లా కేంద్రంలోని వేములవాడ, సిరిసిల్ల, చందుర్తి, కొనరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాధ్, గంభీరావుపేట్ మండల కేంద్రాల్లో వీఆర్ఏలు నిరవధిక సమ్మె కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరవధిక సమ్మెకు కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ పార్టీ నేతలు మద్దతు తెలిపారు. వేములవాడ వీఆర్వోలు సైతం వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం సైతం వెంటనే వీఆర్ఏలకు న్యాయం చేయాలని కోరారు. వేములవాడ రూరల్ మండలం,పట్టణ వీఆర్వోలు ముకుమ్మడిగా మద్దతు తెలిపారు.

    సీఎం కేసీఆర్ అసెంబ్లీ ప్రగతి భవన్ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వీఆర్ఏల జేఏసీ కార్యదర్శి అర్జున్కోరారు. మొన్నటి రోజు మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో తమ గోడును మంత్రికి విన్నవించుకుంటామని ప్లకార్డులు ప్రదర్శించిన తొమ్మిది మంది వీఆర్ఏల పై జిల్లా ఎస్పీ కేసులు నమోదు చేయించారని, వెంటనే ఆ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలు కూడా లాండ్ ఆర్డర్లో భాగమేనని అన్నారు. పెరిగిన నిత్యవసర సరుకులు ధరల నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే రూ. 10,500 గౌరవ వేతనం సరిపోక అవస్థలకు గురవుతున్నామని, కుటుంబ పోషణ భారంగా మారిందని అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. అన్ని మండల కేంద్రాల్లోని ఎమ్మార్వో కార్యాలయాల ముందు నిరసన తెలిపి వినతి పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Sircilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు