హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ganesh Visarjan 2022: గంగమ్మ ఒడికి గణేశుడు.. అడుగడుగునా సీసీ కెమెరాలతో నిఘా

Ganesh Visarjan 2022: గంగమ్మ ఒడికి గణేశుడు.. అడుగడుగునా సీసీ కెమెరాలతో నిఘా

వేములవాడలో

వేములవాడలో గణేశ్ నిమజ్జనం సందడి

తెలంగాణ (Telangana) వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం (Ganesh Visarjan 2022) సందడి నెలకొంది. హైదరాబాద్ (Hyderabad) కూడా గణపయ్యల ఊరేగింపులు, డీజే సౌండ్లతో మార్మోగుతోంది. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) వేములవాడ పట్టణంలో వినాయక నిమజ్జనాల కోలాహలం మొదలైంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vemulawada R, India

  Haribabu, News18, Rajanna Sircillaతెలంగాణ (Telangana) వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం (Ganesh Visarjan 2022) సందడి నెలకొంది. హైదరాబాద్ (Hyderabad) కూడా గణపయ్యల ఊరేగింపులు, డీజే సౌండ్లతో మార్మోగుతోంది. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) వేములవాడ పట్టణంలో వినాయక నిమజ్జనాల కోలాహలం మొదలైంది. శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అర్చకుల సూచన మేరకు శుక్రవారం రోజున వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని వేములవాడ పట్టణ గుడి చెరువులోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈమేరకు పోలీస్ మరియు మునిసిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి పరిశీలించారు. పట్టణ ప్రజలు భక్తిశ్రద్ధలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా గుడి చెరువులో నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో చెరువు కట్ట ప్రాంతంను చదును చేసి లైటింగ్, బారికేడ్లు, తాగు నీటి సౌకర్యం కల్పించామని వారు తెలిపారు. అత్యవసర నిమిత్తం గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు.
  వేములవాడ పట్టణంలోని శ్రీరాజరాజేశ్వర దేవ స్థానం చేరువును సంబంధిత అధికారులతో కలిసి సందర్శించినఎస్పీ రాహుల్ హెగ్డే రాత్రి సమయంలో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వినాయక నిమజ్జనాల సందర్భంగా తీసుకోవల్సిన జాగ్రత్తలపై పోలీసు సిబ్బందితో పాటు మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, ఫైర్ డిపార్ట్మెంట్స్ అధికారులకు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిమజ్జనం జరిగే రహదారులలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిన్నట్టు తెలిపారు. దారి మళ్లింపు, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ తరపున ఏర్పాట్లు చేపడుతున్నామని అన్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో నిమజ్జనం జరిగే స్థలాలు, శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సీసీ కెమెరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటరుకు అనుసంధానం చేసి ఒక ప్రత్యేక బృందం ద్వారా నిమజ్జనం జరిగే ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందుతుందని అని ఎస్పీ తెలిపారు.

  ఇది చదవండి: ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు.. ఇప్పుడు మాత్రం ఆదర్శ దంపతులు


  నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు చేపట్టినట్లు డిఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. అడుగడుగునా భద్రత కోసమని పోలీస్ సిబ్బందిని నిమజ్జనం డ్యూటీకే కేటాయించినట్లు ఆయన తెలిపారు. మండప నిర్వహకులు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వేములవాడ రాజన్న ఆలయ చెరువును డిఎస్పి నాగేంద్ర చారి పరిశీలించారు. శుక్రవారం రాత్రి వరకు నిమజ్జనం కొనసాగేలా భారీ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ పేర్కొన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Ganesh Visarjan 2022, Local News, Telangana, Vemulawada

  ఉత్తమ కథలు