హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: అవినీతి ఆరోపణలున్న అధికారి ఈఓగా నియామకం.., ఆ ఆలయంలో ఏం జరుగుతోంది..?

Rajanna Siricilla: అవినీతి ఆరోపణలున్న అధికారి ఈఓగా నియామకం.., ఆ ఆలయంలో ఏం జరుగుతోంది..?

రాజన్న ఆలయ ఈవో నియామకంపై వివాదం

రాజన్న ఆలయ ఈవో నియామకంపై వివాదం

దక్షిణ కాశీగా, ప్రముఖ శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం (Vemulawada Raja Rajeswara Swamy Temple) నూతన ఈఓగా డి.కృష్ణ ప్రసాద్ నియామకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Vemulawada R, India

  Haribabu, News18, Rajanna Sircilla

  దక్షిణ కాశీగా, ప్రముఖ శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం (Vemulawada Raja Rajeswara Swamy Temple) నూతన ఈఓగా డి.కృష్ణ ప్రసాద్ నియామకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఉన్న డి.కృష్ణ ప్రసాద్‌ను ఆలయ ఈఓగా నియమించడం సరైంది కాదని విశ్వహిందూ పరిషత్ నాయకుడు గడప కిషోర్ అన్నారు. ఈవో నియామకం పట్ల గడప కిషోర్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో అవినీతి ఆరోపణలు, విజిలెన్స్ కేసులు ఉన్న వ్యక్తిని తిరిగి ఈఓగా ఎలా నియమిస్తారని మండిపడ్డారు. గతంలో డి.కృష్ణ ప్రసాద్ ఈఓగా ఉన్నప్పుడు అక్రమంగా అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమకాలు జరిపాడని, మళ్ళీ అదే వ్యక్తిని కొత్తగా నియమించడం పట్ల విశ్వహిందూ పరిషత్ తరుపున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు గడప కిషోర్ అన్నారు. వెంటనే ఎండోమెంట్ కమిషనర్ స్పందించి మరొక అధికారిని ఈవోగా నియమించాలని కోరారు. లేని పక్షంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్దంగా నిరసన చేపడతామని పేర్కొన్నారు.

  ఈఓ మార్పుపై మొదట్నుంచి గందరగోళం

  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రముఖ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈఓ నియామకంపై మొదట్నుంచి గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు ఆలయం ఈవోగా పనిచేసిన రమాదేవిని హైదరాబాదులోని దేవాదాయ శాఖ కార్యాలయానికి బదిలీ చేయడంతో, నూతన ఈవోగా డి.కృష్ణ ప్రసాద్‌ను నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆలయ ఇంచార్జీ ఈవో రమాదేవి బదిలీ వెనుక అనేక కారణాలుతో పాటు వివాదాస్పద సంఘటనలు ఉండటంతోనే బదిలీ వేటు పడిందని పట్టణంలో జోరుగా చర్చ నడుస్తుంది. రమాదేవి ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బాధ్యతయుతంగా పనిచేసేదని అవినీతి అక్రమాలను సహించేది కాదని అంతేకాకుండా ముక్కు సూటిగా ఉండటమే ఆమె బదిలీకి కారణమైందని పలువురు భావిస్తున్నారు.

  ఇది చదవండి: విధి నిర్వహణ కోసం రోజూ 8 కి.మీ కాలినడకన.., అంగన్వాడీ టీచర్ ను మెచ్చుకోవాల్సిందే..!

  ఈఓ రమాదేవి నిజాయితీ తనమే ఆమె బదిలీకి కారణమైందా!?

  గతంలో రాజన్న ఆలయానికి కేంద్ర మంత్రి కృష్ణపాల్ గుర్జర్ వచ్చిన సందర్భంలో ఈవో రమాదేవి ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపిస్తూ.. బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ నాయకులు ఘటనను తీవ్రంగా తీసుకోవడంతో పాటు పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. దీనిపై రమాదేవి కొన్ని సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి వివరణ కూడా ఇచ్చారు. స్థానిక బీజేపీ నాయకులకు ఉచిత గదులతో పాటు స్వామి వారి లడ్డూప్రసాదాలు ఇవ్వలేదనే కారణంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొంతమంది స్థానిక నేతల ద్వారా రాజన్న ఆలయం నుంచి సరుకులు బయటకు వెళ్లేవని తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ సరుకులను బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రమాదేవి ప్రధానంగా ఆరోపించారు. అంతేకాకుండా వారి నుంచి ప్రాణ భయం కూడా ఉందని అప్పట్లో రమాదేవి చెప్పడం పట్టణంలో సంచలనంగా మారింది.

  అయితే ఆలయ ఈవోగా రమాదేవి చేసిన ఆరోపణలను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి ఆలయ ఈవోగా కాకుండా ఒక నియంతల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వేములవాడ పట్టణ ప్రజలకు ఉన్న దర్శన సమయాన్ని కూడా తొలగించారని ప్రతాప రామకృష్ణ ప్రధానంగా ఆరోపించారు. కరోనా కంటే ముందు భక్తులకు ఎలాంటి దర్శన సదుపాయాలు ఉండేవో ప్రస్తుతం అవే నిబంధనలు ఆలయంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈవో వైఖరిని నిరసిస్తూ పట్టణంలో బంద్ చేపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈవో రమాదేవి వ్యవహారం చర్చినీయాంశం అయింది. ఈనేపథ్యంలోనే అనేక సంఘటనలతో వివదాస్పదంగా మారిన రమాదేవిని రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల తర్వాత..ప్రస్తుతం బదిలీ చేయడంతో హాట్ టాపిక్‌గా మారింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Telangana, Vemulawada

  ఉత్తమ కథలు