హోమ్ /వార్తలు /తెలంగాణ /

Open Drinking: బహిరంగంగా మద్యం సేవించిన వ్యక్తులపై పోలీసుల కొరడా.. కఠిన చర్యలకు రంగం

Open Drinking: బహిరంగంగా మద్యం సేవించిన వ్యక్తులపై పోలీసుల కొరడా.. కఠిన చర్యలకు రంగం

వేములవాడ

వేములవాడ

బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఆరుగురు వ్యక్తులపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని నూకలమర్రి, పాత అనుపురం గ్రామాల పరిధిలో బుధవారం రోడ్డు పక్కన మద్యం సేవించిన వ్యక్తులను పోలీసులు గుర్తించారు

 • News18 Telugu
 • Last Updated :
 • Vemulawada R, India

  (K. Haribabu, News18, Rajanna siricilla)

  రాజన్న సిరిసిల్ల (Rajanna Siricilla) జిల్లాలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న (Open Drink) ఆరుగురు వ్యక్తులపై వేములవాడ (Vemula Wada) పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని నూకలమర్రి, పాత అనుపురం గ్రామాల పరిధిలో బుధవారం రోడ్డు పక్కన మద్యం సేవించిన వ్యక్తులను పోలీసులు గుర్తించారు. ఆరుగురిపై కేసు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో (Open Places) మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వేములవాడ రూరల్ ఎస్సై నాగరాజు హెచ్చరించారు. చట్ట వ్యతిరేకమైన పనులు ఎవరు చేసినా ఉపేక్షించబోమని చెప్పారు. ప్రజలు చుట్టుపక్కల జరుగుతున్న చట్ట వ్యతిరేకమైన పనుల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

  అడవి పంది ఢీకొని యువకుడికి గాయాలు:

  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ద్విచక్ర వాహనానికి అడవిపంది అడ్డుగా రావడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గా రాజేశ్వరతండాకు చెందిన బానోతు రాజేశ్ (24) అనే యువకుడు పని నిమిత్తం గంభీరావుపేటకు వెళ్లి బైక్ పై తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో సిరిసిల్ల -కామారెడ్డి ప్రధాన రహదారిపై పెద్దమ్మ అటవీ ప్రాంతం గుండా వస్తుండగా అడవిపంది అడ్డుగా వచ్చింది. దాన్ని తప్పించబోయి బైక్ అదుపుతప్పడంతో రాజేశ్ కిందపడ్డాడు. రాజేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అటుగా వెళ్లే వాహనదారులు గమనించి గాయపడిన రాజేశ్‌ను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

  తల్లి బాగోగులు చూడని కుమారులపై కేసు నమోదు:

  వృద్ధాప్యంలో ఉన్న తల్లి బాగోగులు పట్టించుకోని కుమారులపై కేసు నమోదు చేసినట్లు గంభీరావుపేట ఎస్సై మహేశ్ తెలిపారు. గంభీరావుపేటకు చెందిన బోధనకారి సత్తమ్మ (75)కు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. భర్త రాములు అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతిచెందాడు. ఈ క్రమంలో ఆమె ఏడాది క్రితం తన ఆస్తిని ఆరుగురు సంతానానికి సమానంగా పంచింది.

  Thieves: దొంగల వింత డిమాండ్​.. ఐదుగురం దొంగతనం చేశాం.. ఇద్దరినే పట్టుకుంటే ఎలా?

  పంపకాల సమయంలో సత్తమ్మకు ఆమె కుమారులు, కూతుళ్లు తలో రూ. 1.50 లక్షలు ఇవ్వాలని పెద్దలు నిర్ణయించారు. దానిప్రకారం చిన్న కుమారుడు మహేశ్, కుమార్తెలు డబ్బులు ఇచ్చారు. కానీ మొదటి కుమారుడు రాజు, రెండో కుమారుడు రమేశ్, మూడో కుమారుడు సురేశ్ డబ్బులు ఇవ్వడం లేదు. కుమారులు తన బాగోగులు పట్టించుకోవడం లేదంటూ సత్తమ్మ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Drinkers, Local News, Sircilla, Vemulawada

  ఉత్తమ కథలు