Home /News /telangana /

RAJANNA SIRCILLA VEMULAWADA POLICE CRACKED THE MURDER CASE HUSBAND IS THE MURDERER RKH BRV PRV

Rajanna Sircilla: భర్తే కాలయముడు: సిరిసిల్ల మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు

నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్న మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. సదరు మహిళను భర్తే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈమేరకు మంగళవారం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Vemulawada R, India
    (K. Haribabu, News 18, Rajanna Sircilla)

    రాజన్న సిరిసిల్ల (Rajanna siricilla) జిల్లా తంగళ్లపల్లిలో చోటుచేసుకున్న మహిళ హత్య (Woman Murder) కేసు మిస్టరీ వీడింది. సదరు మహిళను భర్తే (Husband) హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ మేరకు మంగళవారం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ ఉపేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తంగళ్లపల్లికి చెందిన కొండ జ్యోతి ఆగష్టు 1న హత్యకు గురైంది. ఘటనపై బాధిత బంధువుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతురాలి భర్త రామాంజనేయులే జ్యోతిని హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. ఆమె నిద్రిస్తున్న సమయంలో హత్య చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు. భార్య జ్యోతి అనారోగ్యంగా ఉండటంతో లక్ష రూపాయలు ఖర్చు చేశానని అయినా ఆరోగ్యం బాగు కాకపోవడంతో తట్టుకోలేక హత్య చేసినట్లు రామాంజనేయులు చెప్పాడని పోలీసులు తెలిపారు.

    Hyderabad boy Pakistan Girl: ప్రేమెంత పనిచేసే.. లవ్​ కోసం పాకిస్తాన్​ నుంచి అమ్మాయిని దింపిన హైదరాబాద్​ కుర్రాడు.. చివరికి..

    108 వాహనంలో ప్రసవం:

    రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో..పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించింది. 108 సిబ్బంది తెలిపిన వివరాలు ప్రకారం రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఎస్.రజిత పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన రుద్రంగి చేరుకున్న108 సిబ్బంది... అప్పటికే పురిటి నొప్పులతో బాధపడుతున్న రజితను చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించేందుకు సిద్ధమయ్యారు.



    ఈ క్రమంలో మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువగా వస్తుండడంతో 108 సిబ్బంది అంబులెన్స్‌ను రోడ్డు పక్కన నిలిపి ఆమెకు సుఖ ప్రసవం చేశారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు 108 ఫైలెట్ వనపర్తి అనిల్ కుమార్, ఆశా వర్కర్ సుజాత తెలిపారు. అనంతరం తల్లి బిడ్డను వేములవాడ పట్టణంలోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Local News, Nagarkurnool

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు