Home /News /telangana /

RAJANNA SIRCILLA VEMULAWADA MUNICIPAL OFFICIALS REMOVES ILLEGAL OCCUPATIONS UNDER MULAVAGU BUFFER ZONE ABH BRV RKH

Rajanna Sircilla: మూలవాగు ఒడ్డున అక్రమ కట్టడాల కూల్చివేత... సమయం ఇవ్వలేదంటూ బాధితుల అరణ్య రోదన

మూలవాగు

మూలవాగు ఒడ్డున అక్రమ కట్టడాల కూల్చివేత

వేములవాడ పరిధిలో మూలవాగు పై అక్రమ కట్టడాల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. వేములవాడ మూలవాగు ఒడ్డున బఫర్ జోన్‌లో నిర్మించిన భవనాలను రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, పోలీసు అధికారుల సమక్షంలో కూల్చి వేశారు.

    (K.Hari babu, News 18, Rajanna sircilla)

    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలో మూలవాగు పై అక్రమ కట్టడాల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. వేములవాడ మూలవాగు ఒడ్డున బఫర్ జోన్‌లో నిర్మించిన భవనాలను రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, పోలీసు అధికారుల సమక్షంలో కూల్చి వేశారు. గతంలో ఈ విషయమై పలుమార్లు భవన యజమానులకు నోటీసులు అందించినా వారి నుంచి స్పందన లేకపోవడంతో కూల్చివేతలు ప్రారంభించినట్లు మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ రావు తెలిపారు. వరదల సమయంలో మూలవాగుపై ప్రమాదం పొంచి ఉండడంతో అధికారులు ఈ భవనాలను కూల్చివేస్తున్నట్లు తెలిపారు.

    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మూలవాగు ఒడ్డున బఫర్ జోన్‌లో 42 ఇండ్లు అక్రమ కట్టడాలుగా గుర్తించిన అధికారులు నోటీసులు అందించారు. ఇందులో 28 మంది కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోగా, 9 ఇళ్లు బఫర్ జోన్‌లో ఉండడంతో వాటిని కూల్చివేశారు. అయితే బాధితుల వాదన మరోలా ఉంది. గతంలో తమకు నోటీసులు ఇచ్చినా తమ గోడు వెళ్లబోసుకునేందుకు అధికారులు సమయం ఇవ్వలేదని, స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు, ప్రజాప్రతినిధులు సైతం తమకు అందుబాటులోకి రావడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయామని బాధితులు అన్నారు. జేసీబీ ద్వారా మా కట్టడాలను కూల్చివేయడంతో భారీనష్టం వాటిల్లుతుందని, తమకు కాస్త టైం ఇస్తే సొంతంగా కూల్చుకుంటామని బాధితులు విన్నవించుకున్నా అధికారులు తమ పని చేసుకుపోయారు. ఎవరికి వ్యక్తిగతంగా నోటీసులు రాలేదన్న బాధితులు అధికారుల తీరుపై మండిపడ్డారు. పట్టా ఉన్న భూయజమానులకు నోటీసులు ఇవ్వకుండా ఇలా తమ కట్టడాలను ఎందుకు కూల్చివేస్తున్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. 10 నుంచి 15 రోజులు గడువు ఇవ్వాలని బాధితులు వేడుకోగా అధికారులు తొమ్మిది భవనాల్లో ఎనిమిది భవనాల ప్రహరీలు, భవన గోడలను పాక్షికంగా కూల్చివేసి వదిలిపెట్టారు.

    ఎమ్మెల్యే నివాసం బఫర్ జోన్‌లో లేదా?: కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్
    వేములవాడ మూలవాగు ఒడ్డున నిర్మించిన కట్టడాల్లో ఎమ్మెల్యే ఇల్లు బఫర్ జోన్లో లేదా అంటూ టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ అధికారులను ప్రశ్నించారు. తన నివాసంలో మాట్లాడుతూ .. బఫర్ జోన్లోని భవన యజమానులకు సర్వే సమయంలో నోటీసులు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. సామాన్యులకు ఒక న్యాయం, ప్రజాప్రతినిధులకు ఒక న్యాయమా అంటూ అధికారులను నిలదీశారు. మంత్రి కేటీఆర్, కలెక్టర్ అనురాగ్ జయంతిలు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Sircilla, Telangana

    తదుపరి వార్తలు