Home /News /telangana /

RAJANNA SIRCILLA VEMULAWADA CONSTITUENCY POWER STRUGGLE BETWEEN CHENNAMANENI AND CHALMEDA GROUPS SNR KNR

Political war: వేములవాడ అధికార పార్టీలో వర్గపోరు..పంతం నీదా నాదా

(చెన్నమనేని వర్సెస్‌ చల్మెడ)

(చెన్నమనేని వర్సెస్‌ చల్మెడ)

Political war:వేములవాడ నియోజకవర్గంలో అధికారపార్టీలో వర్గపోరు మొదలైందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అటు చెన్నమనేని..ఇటు చల్మెడ వర్గాల మధ్య ఆధిపత్యపోరు పార్టీ అధిష్టానానికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ ఎవరికి ప్రాధాన్యత కల్పిస్తుందోననే సందేహాలు అందరిలో నెలకొన్నాయి.

ఇంకా చదవండి ...
  (P.Srinivas,News18,Karimnagar)
  ఓవైపు గులాబీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే..మరోవైపు ద్వితియశ్రేణి నాయకుల మధ్య గులాబీ ముళ్లు గుచ్చుకుంటున్నట్లుగా ఉంది పరిస్ధితి. ముఖ్యంగా కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల (Siricilla)జిల్లాలోనే అధికార పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగడం ఒకింత పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఇదంతా వేములవాడ (Vemulawada)శాసనసభ నియోజకవర్గానికి చెందిన నాయకుల మధ్య కనిపించని కోల్డ్‌వార్ నడుస్తోందని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారు. సీనియర్ కాంగ్రెస్(Congress) నాయకుడు చల్మెడ లక్ష్మీ నరసింహరావు(Chalmeda Lakshmi Narasimha Rao)టీఆర్ఎస్ (Trs)తీర్థం పుచ్చుకున్న తర్వాత కేటీఆర్‌(ktr) పిలుపు మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు. అందులో ఒకటే లక్ష్మీనరసింహరావు తన స్వగ్రామమైన వేములవాడ నియోజకవర్గంలోని మల్కపేట స్కూల్‌ను రూ .రేండు కోట్ల వరకూ వెచ్చించి బాగు చేయించారు . చల్మెడ పాఠశాల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్తో పాటు మరో మంత్రిని ఆహ్వానించారు. సోమవారం జరగాల్సిన ఈ కార్యక్రమం షడన్‌గా రద్దైంది. చల్మెడ ఆహ్వానించిన కార్యక్రమానికి మంత్రులు వస్తారని అంతా ఫిక్సైన తర్వాత ప్రోగ్రామ్ క్యాన్సిల్ కావడం చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు (Chennamaneni Rameshbabu)హస్తం ఉందనే టాక్ ఉంది.

  గులాబీ పార్టీలో ముళ్లు..
  అయితే ఇదంతా వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు తెర వెనుక ఉండి నడిపించిన రాజకీయ ఎత్తుగడే అనే వార్త టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చెన్నమనేని పౌరసత్వంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టానం వేములవాడ అభ్యర్ధి విషయంలో ప్రత్యామ్నాయమార్గం వెదుకుతోందని..అందులో భాగంగానే చల్మెడ గులాబీ కండువా కప్పుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

  చల్మెడ వర్సెస్‌ చెన్నమనేని..
  చల్మెడ్ టీఆర్‌ఎస్‌ చేరి మంత్రి కేటీఆర్‌కి దగ్గరడం, వేములవాడ నియోజకవర్గంలో సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఈవిషయంపైనే అటు చెన్నమనేని రమేష్‌బాబు కూడా దృష్టి పెట్టి చల్మెడ వర్గం చేస్తున్న కార్యకలాపాలను నియంత్రించే పనిలో పడ్డారని తెలుస్తోంది. ఇప్పుడు జరుగుతున్న ఈ కోల్డ్‌ వార్ చూసుకుంటే గతంలో కూడా వేములవాడ టికెట్ ఆశించిన జెడ్పీ చైర్పర్సన్ గా పని చేసిన తుల ఉమ భంగపడే బీజేపీలో చేరారనేది ఓపెన్‌ సీక్రెట్‌గా చెప్పుకుంటారు.

  సైలెంట్‌ పొలిటికల్ వార్..
  గతం సంగతి పక్కన పెడితే రాబోయే రోజుల్లో కూడా చల్మెడ వర్గంతో చెన్నమనేని రమేష్‌బాబు సీటుకు ఎర్త్‌ తగిలే ప్రమాదం ఉంది. అందుకోసమే ముందస్తు జాగ్రత్తగా తన నియోజకవర్గంలో చల్మెడ దూకుడికి చెన్నమనేనికి సైలెంట్‌గా చెక్ పెడుతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. నియోజకవర్గంలో పోటాపోటీగా ఉన్న ఈ రెండు వర్గాల్లో అధిష్టానం ఎవరికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది..ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపుతుందనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. మరోవైపు రెండు దశాబ్దాలకుపైగా పూర్తి చేసుకొని వ్యవస్థాపక దినోత్సవాలు చేసుకుంటున్న సమయంలో అధిష్టానానికి వేములవాడలో వర్గపోరు లాంటి తలనొప్పిని తెచ్చి పెట్టిందనే వాదన టీఆర్‌ఎస్‌ శ్రేణుల నుంచే వినిపిస్తోంది.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Politics, Vemulawada

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు