హోమ్ /వార్తలు /తెలంగాణ /

Elections: మంత్రి కేటీఆర్ ఇలాకాలో రసవత్తరంగా ఆటో యూనియన్ ఎలక్షన్.. పూర్తి వివరాలివే 

Elections: మంత్రి కేటీఆర్ ఇలాకాలో రసవత్తరంగా ఆటో యూనియన్ ఎలక్షన్.. పూర్తి వివరాలివే 

సిరిసిల్లలో

సిరిసిల్లలో ఎన్నికలు

కేటీఆర్​ ఇలాకాలో ఆటో యూనియన్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈనెల 25వ తేదీన జరగనున్న ఎన్నిక తేలనుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (K. Haribabu, News18, Rajanna Sircilla)

  రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా. కేటీఆర్​ (KTR)ఇలాకాగా ప్రసిద్ధి. ఇపుడు అక్కడ జరిగే ఎన్నికలు చర్చనీయాంశం అయ్యాయి. వేములవాడ (Vemula wada) ఆటో యూనియన్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మునుపెన్నడు లేని విధంగా అధికార పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు ఆటో యూనియన్ ఎలక్షన్లో (Auto Union Elections) నామినేషన్ వేస్తున్న ఆటో కార్మికునికి మద్దతు తెలపడం, అటు కాంగ్రెస్ పార్టీ సైతం మాజీ అధ్యక్షుడికి తమ మద్దతు తెలపడం సర్వత్ర ఆటో యూనియన్ ఎలక్షన్ పై ఆసక్తి నెలకొంది. ఈసారి అధికార పార్టీ కౌన్సిలర్లు బలపరిచిన అభ్యర్థి వేములవాడ ఆటో యూనియన్ అధ్యక్షపదవిని దక్కించుకుంటాడ...లేక మళ్లీ మాజీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడే అధ్యక్షుడు అవుతాడా! అనేది ఈనెల 25వ తేదీన జరగనున్న ఎన్నిక తేలనుంది.

  ఆటో కార్మికుడు బత్తుల దేవరాజు నామినేషన్ వేశాడు. కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాస రావు, సిరిగిరి రామచంద్రం, జోగిని శంకర్, తెరాస నాయకుడు కుమ్మరి శ్రీనివాస్‌లు దేవరాజుకు మద్దతు తెలిపారు. ఇటు ఆటో యూనియన్ మాజీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ సైతం నామినేషన్ వేశాడు. వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ (Congress) పార్టీ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్‌కు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ సన్నిహితుడు. శ్రీనివాస్ గౌడ్ పలుమార్లు ఆటో యూనియన్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందాడు. ఎప్పుడూ లేని విధంగా అన్ని పార్టీల చూపు ఆటో యూనియన్ ఎలక్షన్సపై పడడంతో పట్టణంలో ఇదే విషయమై చర్చ నడుస్తుంది.

  బలాబలాలు ఎలా ఉన్నాయంటే: అధికార పార్టీ (TRS) బలపరిచిన అభ్యర్థి గతంలోనూ ఆటో యూనియన్ ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఈసారైనా ఆటో యూనియన్ అధ్యక్ష పదవికి అవకాశం కల్పించాలని సానుభూతి, అధికార పార్టీ అండ రెండు కలిసిరానున్నాయి. మాజీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పని చేశాడు. కాంగ్రెస్ నేత (Congress leader) ఆది శ్రీనివాస్ ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. గతంలో అధ్యక్షునిగా చేసిన అనుభవం, తోటి ఆటో కార్మికులతో ఉన్న స్నేహం ఆయనకు కలిసి రానుంది. ఇరువర్గాలు ఎవరికి వారు గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  గతంలో అటో యూనియన్ అధ్యక్షునిగా పనిచేసిన చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్.. కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా ఉంటాడనే కారణంతో ఆటో కార్మికుల సమస్యలను అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యే సైతం పట్టించుకోవడంలేదని వాదనలు ఉన్నాయి. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరసనలు, ధర్నాలు సైతం చేసినా, క్షేత్రస్థాయిలో వారి సమస్యల పరిష్కారం కోసం అధికార పార్టీ నేతలు పట్టించుకోకపోవడం, ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆటో కార్మికులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఆటో యూనియన్లో మాత్రం చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్‌కు మంచి పేరు ఉంది. అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమే వారి సమస్యలు అధికార పార్టీ నేతలు పట్టించుకోవడంలేదని చర్చ సైతం జరుగుతుంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Elections, KTR, Local News, Sircilla, Vemulawada

  ఉత్తమ కథలు