హోమ్ /వార్తలు /తెలంగాణ /

జిల్లాలో నిలకడగా భూగర్భ జలాలు.. వ్యవసాయానికి ఢోకా లేకుండా సాగునీరు

జిల్లాలో నిలకడగా భూగర్భ జలాలు.. వ్యవసాయానికి ఢోకా లేకుండా సాగునీరు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెరిగిన భూగర్భ జలాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెరిగిన భూగర్భ జలాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) లో గత ఏడాదితో పోల్చితే... భూగర్భ జలాలు నిలకడగానే ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా పడటంతో జిల్లాలో నీటి వనరులు పెరిగాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Vemulawada R, India

  Haribabu, News18, Rajanna Sircilla

  రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) లో గత ఏడాదితో పోల్చితే... భూగర్భ జలాలు నిలకడగానే ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా పడటంతో జిల్లాలో నీటి వనరులు పెరిగాయి. జిల్లాకు పై భాగంలో ఎగువ మానేరు, దిగువన మధ్యమానేరు, అటు మూలవాగు, ఇటు అనంతారం ప్రాజెక్టు, మరోవైపు నక్కవాగు జలాశయాలతో భూగర్భ జలాలు (పదిలంగా) మెండుగా ఉన్నాయి. గతేడాది(2021)తో పోల్చితే పెద్దగా మార్పు లేకపోగా ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడడంతో భూగర్భ జలాలు నిలకడగా ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబరు నెలతో సరి చూస్తే 0.47 మీటర్ల లోతుల్లోకి భూగర్భ జలమట్టం పడిపోయింది. ఇది పెద్ద మార్పు ఏమీ కాదు. నీటిని పొదుపుగా వాడుకుంటే మంచిది. భూగర్భ జలాలు జిల్లాలో పైనే ఉన్నాయని జిల్లా భూగర్భ జిల్లా అధికారి గంగ నర్సింహులు తెలిపారు.

  భూగర్భజలాలు మండలాల వారీగా (మీటర్లలో)భూగర్భజలాలు మండలాల వారీగా (మీటర్లలో)

  మండలాలు                           2021           2022 (September)

  బోయినిపల్లి                               1.81            1.84

  చందుర్తి                                     0.90            1.46

  గంభీరావుపేట                           3.56           3.32

  ఇల్లంతకుంట                           2.09         3.35

  కోనరావుపేట                               3.82         3.80

  ముస్తాబాధ్                                   2.09          3.35

  రుద్రంగి                                        1.55           3.04

  సిరిసిల్ల                                          4.21            5.57

  తంగళ్ళపల్లి                                 0.92            1.75

  ఎల్లరెడ్డిపేట                                 2.07             5.50

  వీర్నపల్లి                                        3.16              5.08

  వేములవాడ అర్బన్                  8.37               6.62

  వేములవాడ రూరల్                  1.33                  1.78

  సగటు: 2.80(2021 సెప్టెంబర్) 3.27(2022 సెప్టెంబర్)గా ఉంది.

  ఇది చదవండి: నిర్మిస్తే సరిపోదు.. రోడ్లు కూడా వేయాలిగా.. రాజన్న జిల్లాలో వింత పరిస్థితి..

  జిల్లాలో సాధారణ వర్షపాతం 713.2 మిల్లీ మీటర్లు (సెప్టెంబరు 29వ తేదీ నాటికి) కాగా ఇప్పటికే జిల్లాలో 1158.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. సాధారణం కన్నా 62 శాతం అధిక వర్షాలు పడ్డాయి. ఉమ్మడి చందుర్తి మండలంలో భూగర్భ జలాలు 1.46 మీటర్ల లోతులో ఉండగా వేములవాడ అర్బన్ మండలంలో అత్యధికంగా 6.61 మీటర్ల లోతులో ఉన్నాయి. జిల్లాలోని బోయినిపల్లి మండలం మాన్వాడ వద్ద మధ్యమానేరు జలాశయం నిండా నీరు ఉంది. నీటి ఊటలు పెరిగేందుకు ఇది దోహదపడిందనే చెప్పాలి.

  ఇది చదవండి: బస్ స్టాప్ ఉంది కానీ రోడ్డు.., 60 ఏళ్లుగా రోడ్డు లేక ఏజెన్సీ గ్రామస్థుల అవస్థలు

  ఇల్లంతకుంట మండలం అనంతగిరి రిజర్వాయర్ కూడా జలకళ సంతరించుకుంది. సిద్దిపేట జిల్లా మీదుగా గోదావరి జలాలు కూడెళ్లి వాగు నుంచి ఎగువ మానేరుకు చేరాయి. జిల్లెల్ల నక్కవాగు జలాశయం, ముస్తాబాద్ మండలంలోని కొన్ని గ్రామాలకు గోదావరి జలాలు వచ్చాయి. మరోవైపు వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి, రుద్రంగి, బోయినపల్లి, వేములవాడ మండలాల్లో చెరువులు, కుంటల్లో ఎల్లంపల్లి ద్వారా గోదావరి జలాలు చేరాయి. దీంతో పాటు గతంలో కంటే మెరుగైన వర్షాలు పడడంతో భూగర్భ మట్టం ఈ ఏడాది నిలకడగానే ఉంది.

  బీడు భూములు సైతం సాగు చేసిన రైతులు:

  జిల్లాలో పెరిగిన నీటి ఊటలు వ్యవసాయానికి ఊతం ఇస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలంలో 2,33,756 ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయి. ఇందులో అగ్రభాగం 1,75,080 ఎకరాల్లో వరి పంట సాగవుతుండగా.. పత్తి 54,114 ఎకరాల్లో, ఇతర పంటలు 3,660 ఎకరాల్లో వేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 666 చెరువులు ఉండగా.. 600 చెరువులు ఇప్పటికే నిండాయి. జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు పెరగడం, బోర్లు, బావుల్లో ఉండడంతో వానాకాలంలో రైతులు భీడు భూములను సైతం సాగు చేశారు. దీంతో సాగు విస్తీర్ణం పెరిగిందనే విషయం తెలుస్తోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Telangana

  ఉత్తమ కథలు