Home /News /telangana /

RAJANNA SIRCILLA TWO YOUTHS DIED AFTER FALLING INTO A WELL IN RAJANNA SIRCILLA DISTRICT ABH BRV RKH

Rajanna Sircilla: వేర్వేరు ఘటనల్లో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి...

యువకుల మృతితో గ్రామంలో అలుముకున్న విషాదం

యువకుల మృతితో గ్రామంలో అలుముకున్న విషాదం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన పట్టెంల లక్ష్మణ్ (26) ఆగష్టు 7న రాత్రి ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. తెల్లవారే వరకు ఇంటికి రాకపోవడంతో తండ్రి శంకరయ్య గ్రామంలో గాలించాడు

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Sircilla, India
    (K.Haribabu, News 18, Rajanna Sircilla)

    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ (vemulavada) నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన పట్టెంల లక్ష్మణ్ (26) ఆగష్టు 7న రాత్రి ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. తెల్లవారే వరకు ఇంటికి రాకపోవడంతో తండ్రి శంకరయ్య ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామంలో గాలించాడు. ఉదయం కుంటకట్ట వద్ద గ్రామపంచాయతీ నల్లాల బావిలో శవమై తేలియాడుతూ లక్ష్మణ్ కనిపించాడు. ప్రమాదవశాత్తు బావిలో పడి లక్ష్మణ్ మృతి చెందిఉంటాడని గ్రామస్థులు, బంధువులు భావిస్తున్నారు. మృతుడి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు మంగళవారం నాడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ పేర్కొన్నారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

    ప్రమాదవశాత్తు పశువుల తొట్టిలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని గంభీరావుపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గంభీరావుపేటలోని దోసలగూడెం కాలనీకి చెందిన దోసల హరీశ్ (అన్వేశ్ )(22) మంగళవారం తెల్లవారు జామున బహిర్భూమి కోసం ఇంటి నుంచి వెళ్లాడు. కాలనీ శివారులో ఉన్న పశువుల తొట్టి వద్ద కాలకృత్యాలు తీర్చుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారీ నీటిలో పడిపోయాడు. సమయానికి రక్షించే వారు లేకపోవడంతో హరీష్ మృతి చెందాడు. స్థానికులు గమనించి మృతుని కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తల్లి దేవవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు.



    రాజన్న సిరిసిల్ల జిల్లాగంభీరావుపేట మండలంలోనిపెద్దమ్మ అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. మంగళవారం సాయంత్రం చిరుత కనిపించిందంటూ అటుగా వచ్చిన కొందరు వాహనదారులు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. ఎడతెరిపి లేని వర్షాలకు చిరుత రోడ్డుపైకి వచ్చినట్లు భావిస్తున్నారు. అయితే చిరుత సంచారంపై అటవీశాఖ అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన రాలేదు.

    అదే సమయంలో ఇల్లంతకుంట మండలంలోని చిక్కుడువానిపల్లి గ్రామానికి చెందిన కంకటి శ్రీనివాస్, యాళ్ల రాంరెడ్డి అనే రైతులకు చెందిన రెండు దూడలపై సోమవారం రాత్రి చిరుత దాడి చేసింది. రోజు మాదిరిగానే రైతులు తమ వ్యవసాయ పాలం వద్ద ఉన్న పశువుల పాకల్లో దూడలను కట్టేసి రాగా, తెల్లవారి వెళ్లి చూసేసరికి చిరుత దాడి చేసి చంపినట్లు బాధిత రైతులు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని స్థానిక రైతులు, వ్యవసాయ కూలీలు కోరుతున్నారు.

    Read this : http://ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'ను బహిష్కరించండి.. మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపు
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Sircilla, Telangana

    తదుపరి వార్తలు