Home /News /telangana /

RAJANNA SIRCILLA TWO YOUTH CAUGHT REDHANDEDLY WITH GANJA IN SIRCILLA DISTRICT POLICE TRYING TO NAB DRUG PEDDLER RKH PRV BRV

Rajanna Sircilla: మత్తులో చిత్తవుతున్న యువకులు: రాకెట్​ ఛేదించే దిశలో పోలీసు విభాగం

సిరిసిల్లలో గంజాయి

సిరిసిల్లలో గంజాయి

నిషేధిత మత్తు పదార్థాలను కలిగి ఉండడంతో పాటు సేవిస్తున్న ముగ్గురిపై శుక్రవారం సిరిసిల్ల పీఎస్‌లో కేసు నమోదైంది. సిరిసిల్ల శివనగర్ పరిధిలోని జూనియర్ కళాశాల మైదానంలో ఒల్లెపు వంశీ, నడిగొట్టు శివకుమార్ అనే ఇద్దరు యువకులు గంజాయి సేవించేందుకు వచ్చారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India
  (K. Haribabu, News 18, Rajanna Sircilla)

  నిషేధిత మత్తు పదార్థాలను (Intoxicants) కలిగి ఉండడంతో పాటు సేవిస్తున్న ముగ్గురిపై శుక్రవారం సిరిసిల్ల (Siricilla) పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సిరిసిల్ల శివనగర్ పరిధిలోని జూనియర్ కళాశాల మైదానంలో ఒల్లెపు వంశీ, నడిగొట్టు శివకుమార్ అనే ఇద్దరు యువకులు గంజాయి సేవించేందుకు వచ్చారు. వీరిని గమనించిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని యువకుల నుంచి 200 గ్రాముల గంజాయి (ganja) స్వాధీనం చేసుకున్నారు. బీవైనగర్‌కు చెందిన ఇప్పకాయాల వినోద్ అనే వ్యక్తి నుంచి ఈ గంజాయి కొనుగోలు చేసినట్లు యువకులు చెప్పడంతో పక్కా సమాచారంతో ఎస్ఐ శ్రీకాంత్ దాడులు నిర్వహించారు. తహసీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల సీఐ తెలిపారు. గంజాయి సరఫరాదారు వినోద్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిసింది.

  Nagarkurnool: కోరుకున్న యువతిని పెళ్లి చేసుకున్నాడు: కానీ, పెళ్ళైన 40 రోజులకే ఊహించని ఘటన

  నలుగురిపై డ్రంకెన్ డ్రైవ్ కేసు..

  ఇటీవల కాలంలో రాజన్న సిరిసిల్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్  (Drunk and drive)కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా కొందరిలో మార్పు రావడంలేదు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి శివారులోని మూడుగుండ్ల వద్ద శుక్రవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో నలుగురు మద్యం తాగి వాహనాలు నడపుతూ పట్టుబడ్డారని ఎస్సై శేఖర్ తెలిపారు. వారిపై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.  తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు..

  రాజన్న సిరిసిల్ల (Rajanna siricilla) జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడ్డారు. మల్కపేటకు చెందిన ఎదురుగట్ల నాగరాజు దంపతులు సిరిసిల్లకు వెళ్లారు. తిరిగి గ్రామానికి రాగా ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. అల్మారాలో దాచిన రూ.50 వేల నగదు, 7 తులాల బంగారు నగలతోపాటు కిరాణా దుకాణం కౌంటర్లో ఉన్న రూ .3 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి పరిశీలించారు. క్లూస్ బృందం ఆధారాలు సేకరించి తనిఖీ చేపట్టారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే ప్రజలు విధిగా పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు సైతం ప్రధాన కూడల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Local News, Siricilla

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు