Haribabu, News18, Rajanna Sircilla
తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా చెరువులలో, కుంటలలో చేపలను వదులుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇలా చేపలతో వచ్చే ఆదాయంపై రెండు గ్రామాల మధ్య వివాదం తలెత్తింది. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) చందుర్తి మండలం కొత్తపేట గ్రామ శివారులోని చెరువుల్లో ప్రభుత్వం ఫ్రీగా చేప పిల్లలను వదిలింది. చేపలతో వచ్చే ఆదాయం 2 గ్రామాల మధ్య వివాదం చెలరేగింది. రెవిన్యూ రికార్డుల్లో ఒక గ్రామానికి అనుకూలంగా ఉండగా, మత్సశాఖ రికార్డుల్లో మరో గ్రామానికి అనుకూలంగా ఉండడంతో ఇరు గ్రామాల మధ్య గొడవలకు దారి తీసిందని తేలుస్తోంది. రెండు గ్రామాల ప్రజలు ఆ చెరువు మాదంటే.. మాది అంటూ పరస్పరం గొడవలకు దిగుతున్నారు. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి చేరిన సమస్యను పరిష్కరించడంలో వారు మీన మేషాలు లెక్కిస్తుందటంతో మరింత ఇబ్బందిగా మారింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కొత్తపేట గ్రామ శివారులోని ఉన్న తీగల కుంట చెరువు మల్యాల రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 10,11తోపాటు ప్రభుత్వ భూమికూడా ఉందని తెలుస్తోంది. జగిత్యాల జిల్లాకథలాపూర్ మండలం తుర్థిగ్రామ ప్రజలకు జగిత్యాల మత్సశాఖ అధికారులు చేపలను ఉచితముగా పంపిణి చేయడంతో చెరువులో చేపల పెంపకం చేపట్టారు. కాగా, కొత్తపేట గ్రామ ప్రజలు తమ సంఘం ఆధ్వర్యంలో చేపలు కొనుగోలు చేసి అదే చెరువులో చేప పిల్లలు వదలడంతోరెండు గ్రామాల మత్సకారులు చెరువు మాదంటే మాదని గత నెల రోజులుగా గొడవలకు పాల్పడుతున్నారని, ఆయా గ్రామాల ప్రజలు చెరువులో చేప పిల్లలు పెంచుకొనే హక్కు తమకంటే తమకు ఉందని ఇరువర్గాలు వాదించుకుంటున్నారు.
ఈ వివాదంలో ఇరువర్గాలకు చెందినపెద్దలు పోలీస్, మత్సశాఖ, రెవిన్యూ శాఖ అధికారులను సంప్రదించిnaa.. వారు kooda పట్టి పట్టనట్టు వ్యవరిస్తున్నారు. ఆలస్యానికి ఎలాంటి మూల్యం చెల్లించవలసి వస్తుందో.. ఇరువర్గాలు ఆందోళన చెందుతున్నారు. మరోసారి వివాదం తలెత్తడంతోచందుర్తి సర్కిల్ పరిధిలోని రుద్రంగి, చందుర్తి పోలీస్ లు చెరువు వద్దకు వెళ్లి ఇరువర్గాలతోమాట్లాడుతూ.. కలసి చేపలు పట్టుకోవాలని సూచించారు. అయితే, కొత్తపేట గ్రామస్థులు వినకపోగా తీగలకుంట చెరువు గ్రామ పరిధిలో ఉందని, కావున చెరువులో హక్కులు మాకే చెందుతాయని ఆందోళన వ్యక్తం చేసారు.
పోలీస్ లు ఒకేవర్గానికి కొమ్ము కాస్తున్నారంటూ.. పోలీస్ ల పని తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇది ఇలా ఉండగా కొత్తపేట గ్రామం నుండి హన్మాజీపేట, మంగళ్లపల్లిగ్రామాలకు వలస వెళ్లిన రొక్కం వంశస్థులు తీగలకుంట చెరువులో గల భూములు మా పట్టా భూములని, ఆ చెరువులో సర్వే నెంబర్ 10,11లో గల 14 ఎకరాల భూములు తమదేనని అన్నారు. చేపల పెంపకానికి ఎవరికీ అనుమతి ఇవ్వవద్దని అధికారులను కోరారు. మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్యే రమేష్ బాబులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Siricilla, Telangana