Home /News /telangana /

RAJANNA SIRCILLA TWO GIRLS FROM SIRICILLA DISTRICT WROTE A LETTER TO MINISTER KTR ASKING HIM TO MEDICAL TREATMENT THEIR FATHER SNR RKH BRV

Rajannasircilla: కేటీఆర్ సార్! మానాన్నని బ్రతికించండి: మంత్రికి లేఖ రాసిన ఇద్దరు సిరిసిల్ల జిల్లా బాలికలు

(కేటీఆర్‌కి చిన్నారుల లేఖ)

(కేటీఆర్‌కి చిన్నారుల లేఖ)

Siricilla:'మా నాన్నకు వైద్యం చేయించి బతికించండి మంత్రి కేటీఆర్ సార్' అంటూ ఆ బాలికలిద్దరూ చెమ్మగిల్లిన కళ్లతో వేడుకుంటున్న దృశ్యం చూసిన ఎవ్వరికైనా హృదయం ద్రవించుకుపోతుంది. బాలికల తండ్రి అనారోగ్యం బారిన పడడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆపన్నహస్తం అందించే దాతల సాయం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది.

ఇంకా చదవండి ...
    (K.Haribabu,News18, Rajanna siricilla)
    మా నాన్నకు వైద్యం చేయించి బతికించండి మంత్రి కేటీఆర్ సార్' అంటూ ఆ బాలికలిద్దరు చెమ్మగిల్లిన కళ్లతో వేడుకుంటున్న దృశ్యం చూసిన ఎవరికైనా హృదయం ద్రవించుకుపోతుంది. బాలికల తండ్రి అనారోగ్యం బారిన పడడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో దాతల సాయం కోసం ఎదురు చూస్తుంది. అంతులేని వ్యాధితో బాధపడుతున్న తమ తండ్రికి వైద్యం చేయించండి అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు ఆ అక్కచెల్లెళ్లు.

    పేద కుటుంబానికి పెద్ద కష్టం..వైద్యం చేయించుకోలేని వైనం:
    రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మామిండ్ల శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం కొన్నేళ్ల క్రితం సిరిసిల్ల పట్టణానికి వచ్చాడు. పట్టణంలోని తుక్కారావుపల్లెలో కుటుంబంతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. శ్రీనివాస్‌కు తల్లి మల్లవ్వ, భార్య మంజుల, కూతుళ్ళు రుచిత, సునీత, కుమారుడు బాబు ఉన్నారు. శ్రీనివాస్ హమాలి కూలీగా పనిచేస్తుండగా, మంజుల బీడీలు చుడుతూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుంది. ఈక్రమంలో శ్రీనివాస్ కొంత కాలం క్రితం శ్రీనివాస్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో తెలిసిన వారి వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుని వైద్యం చేయించారు కుటుంబ సభ్యులు. అయినా శ్రీనివాస్ కోలుకోలేదు. ఇదిలాఉంటే గత నాలుగు నెలలుగా శ్రీనివాస్ ఆరోగ్యం మరింత క్షిణిస్తూ వస్తుంది. అంతులేని వ్యాధితో చిక్కిశైల్యమైన శ్రీనివాస్..సొంత పనులు కూడా చేసుకోలేని విధంగా మంచానికే పరిమితం అయ్యాడు.

    అచేతనంగా కుటుంబ పెద్ద, దిక్కుతోచని స్థితిలో కుటుంబం:
    కుటుంబ పెద్దగా బరువు బాధ్యతలు చేపట్టాల్సిన వయసులో శ్రీనివాస్ ఇలా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో పూట గడిచే పరిస్థితి కనిపించడం లేదు. మంజుల బీడీలు చుట్టగా వచ్చిన కాస్త ఆదాయంతోనే ఇల్లు గడుస్తుండగా..ముగ్గురు పిల్లలున్న ఆ కుటుంబంలో నిత్యం కన్నీళ్ల మధ్య జీవనం సాగించాల్సిన దయనీయమైన పరిస్థితి నెలకొంది. ఇంటికి పెద్ద దిక్కై కుటుంబాన్ని నడిపించాల్సిన మనిషి అనారోగ్యంతో ఆచేతనమై కళ్ళముందు కదలలేని స్థితిలో మిగిలాడు. ఇంటి అద్దెలతోపాటు కుటుంబం గడిచే దారిలేక కుటుంబ సభ్యులందరు నిస్సహాయంగా ఉండిపోయారు. దాతలెవరైనా స్పందించి తమకు ఆర్ధిక సహాయం చేస్తే తమ తండ్రి తిరిగి కోలుకుంటాడని ఆ చిన్నారులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాసిన ఆ చిన్నారులు తమ తండ్రికి వైద్య సహాయం అందేలా చూడాలని కోరారు.

    ఇది చదవండి: మంత్రి కేటీఆర్ ఇలాకాలో నాసిరకం పనులు: చెక్ డ్యామ్ నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు



    వైద్యం అందిస్తే కన్న తండ్రి కోలుకుంటాడనే చిన్నారుల ఆశ:
    తండ్రి అలనాపాలనలో పెరగాల్సిన ఆ చిన్నారులు, అనారోగ్యంతో మంచం పట్టిన తండ్రిని చూసి బావురుమంటున్నారు. శ్రీనివాస్ కుమార్తెలు రుచిత, సూచితలు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతుండగా, కుమారుడు బాబు ఐదో తరగతి చదువుతున్నాడు. తల్లి బీడీలు చుట్టగా వచ్చిన కాస్త ఆదాయం కుటుంబ పోషణకూ సరిపోవడం లేదని, ఇంత దయనీయ స్థితిలో ఉన్న తమకు సహాయం చేయండి అంటూ ఆ చిన్నారులు వేడుకుంటున్న తీరు సాటి మనిషి హృదయాన్ని కదిలించింది. ప్రస్తుతం తమ కుటుంబం ఉన్న పరిస్థితులను వివరిస్తూ ఆ చిన్నారులు మంత్రి కేటీఆర్ కు లేఖ రాశారు. తమ తండ్రికి వైద్య సహాయం అందించి ఆదుకోవాలని లేఖలో కోరారు.

    దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: మామిండ్ల వేణు, శ్రీనివాస్ సోదరుడు, 9959790556
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Local News, Siricilla

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు