Home /News /telangana /

RAJANNA SIRCILLA TWO BIKES WERE BURNT AT MIDNIGHT IN KONARAOPET MANDAL POLICE FILE CASE BRV RKH PRV

Rajanna Sircilla: అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలను తగలబెట్టిన దుండగులు.. ఎందుకంటే..? 

రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదం

గుర్తు తెలియని వ్యక్తులు రెండు బైకులకు నిప్పుపెట్టిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు బైకులు కాలిపోగా.. విద్యుత్ తీగలకు అంటుకున్న మంటలను సకాలంలో ఆర్పివేయడంతో..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    (K.Haribabu, News 18, Rajanna Sircilla)

    గుర్తు తెలియని వ్యక్తులు రెండు బైకులకు నిప్పుపెట్టిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna siricilla) కోనరావుపేట మండలం పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు బైకులు కాలిపోగా.. విద్యుత్ తీగలకు అంటుకున్న మంటలను సకాలంలో ఆర్పివేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. బాధితులు తెలిపిన వివరాలు మేరకు.. కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన లింగంపెల్లి రాజు తన బైక్‌ను (Bike) ఇంటిపక్కన రేకుల షెడ్డులో పార్కింగ్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి అదే వాహనంలో నుంచి పెట్రోల్ తీసి నిప్పంటించారు. రాజు ఇంటి సమీపంలోనే ఉన్న జాప బాలయ్య ఇంటి ఎదుట నిలిపి ఉంచిన మరో ద్విచక్ర వాహనానికి సైతం నిప్పంటించి వెళ్లిపోయారు దుండగులు. ఆ సమయంలో బహిర్భూమికి వెళ్తున్న పక్కింటి యువకుడు బైకులు తగలబడటం చూసి వెంటనే రాజుకి సమాచారం అందించాడు. వారు మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంలో రాజు బైక్ పూర్తిగా కాలిపోగా, బాలయ్య వాహనం పాక్షికంగా ధ్వంసం అయింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాలను పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

    కేసులు నమోదు చేస్తామని..

    మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శేఖర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఎక్స్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ముగ్గురిపై కేసు నమోదు చేశామన్నారు. ఎస్సై మాట్లాడుతూ .. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రతీ ఒక్క వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. తనిఖీల్లో ఏఎస్సై కిషన్ రావు, సిబ్బంది ఉన్నారు.



    రాత్రిపూట రోడ్డు వెంట కాలినడకన నడుచుకుంటూ వెళుతున్న ఓ వృద్ధుడిని ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా మాచారెడ్డి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. సోమారిపేట బంజపల్లి తండాకు చెందిన ఓ (60) వృద్ధుడిని గజసింగవరం వైపు నుండి లైట్ లేకుండా వస్తున్న AP 28 BP 5567 అనే పల్సర్ వాహనం వచ్చి డీ కొట్టటంతో ప్రమాదం చోటు చేసుకుంది. అదే సమయంలో గోరంటాల నుండి ద్విచక్రవాహనంపై వస్తున్న ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్ యాదవ్.. వాహనం ఆపి 108కు ఫోన్ చేయగా సిబ్బంది స్పందించలేదు. దీంతో గంభీరావుపేట ఎస్సై బొజ్జ మహేష్‌కు ఫోన్ చేయగా.. వారు పాట్రోలింగ్ వాహనాన్ని పంపించారు. గాయాలపాలైన వృద్ధుడిని ఎల్లారెడ్డిపేటలోని ఆసుపత్రికి పంపించారు. అనంతరం గంభీరావుపేట ఎస్సై ఆదేశాల మేరకు ఏఎస్ఐ బాబు పెట్రోలింగ్ వాహనంలో వచ్చి వృద్ధుడి గాయాలకు కారణమైన ద్విచక్రవాణాదారుడిని, వాహనంలో అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ కాల్‌కు స్పందించి, వృద్ధుడికి సహాయపడిన గంభీరావుపేట ఎస్సై మహేష్‌కు బాలరాజ్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Local News, Road accidents, Siricilla

    తదుపరి వార్తలు