హోమ్ /వార్తలు /తెలంగాణ /

పోలీస్ స్టేషన్ పై గిరిజనులు దాడి...కారణం ఇదే..!

పోలీస్ స్టేషన్ పై గిరిజనులు దాడి...కారణం ఇదే..!

పోలీస్ స్టేషన్ పై దాడిచేసిన గిరిజనులు

పోలీస్ స్టేషన్ పై దాడిచేసిన గిరిజనులు

Telangana: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజవర్గం పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ తండాకు చెందిన తండావాసులు మండల కేంద్రంలోని ఎక్సైజ్ స్టేషన్ పై దాడికి దిగారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(K.Haribabu,News18, Rajanna siricilla)

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజవర్గం పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ తండాకు చెందిన తండావాసులు మండల కేంద్రంలోని ఎక్సైజ్ స్టేషన్ పై దాడికి దిగారు. దీంతో కార్యాయలంలోని ఫర్నిచర్,ముందు ఉన్న పూలకుండీలను రోడ్డుపై పడేశారు.అనంతరం కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.అధికారులను సస్పెండ్ చేయాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

బాధితుల కథనం మేరకు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్పూర్ తండాకు చెందిన గిరిజన మహిళ భూక్య కళ సారా అమ్ముతోందని ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ నెల 21న అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు స్థానిక పీహెచ్సీలో కొవిడ్ పరీక్షలు చేయిస్తున్న తరుణంలో ఛాతిలో నొప్పి అంటూ..అస్వస్థతకు గురైంది.

అధికారులు పట్టించుకోకుండానే తహసీల్దార్ జయంత్ కుమార్ ముందు బైండోవర్ చేశారు. MRO రూ.లక్ష జరిమానా విధించారు.దీంతో ఆమె కుటుంబసభ్యులు జరిమానా చెల్లించేందుకు సిరిసిల్లలోని బ్యాంకుకు వెళ్లారు.

అప్పటికే కళ తీవ్ర అస్వస్థతకు గురవడంతో అధికారులు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు గుండెపోటుకు గురైందని, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆందోళనకు గురైన అధికారులు ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. బ్యాంకులో జరిమానా డబ్బులు చెల్లిస్తున్న కుటుంబసభ్యులకు విషయం తెలియడంతో ఆస్పత్రికి చేరుకున్నారు.

వెంటనే ఆమెను కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చేయని నేరానికి బైండోవర్ చేశారనీ, రూ.లక్ష జరిమానా కట్టించుకున్నారని,గుండెపోటుకు గురైన ఎక్సైజ్ అధికారులు పట్టించుకోలేదనీ ఆరోపిస్తూ.. మండిపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గిరిజనులను శాంతింపజేసేందుకు యత్నించారు.ఎక్సైజ్ పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు.తమకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ విషయంపై ఎక్సైజ్ సీఐ ఎంపీఆర్ చంద్రశేఖర్ ను వివరణ కోరగా తండాలోని భూక్య కళను సారా అమ్ముతుందని 3 రోజుల కిందట అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.ఆమెకు కొవిడ్ (కరోనా) నిర్ధారణ పరీక్షలు చేయించి MRO ఎదుట బైండోవర్ చేయడంతో రూ. లక్ష జరిమానా విధించారని పేర్కొన్నారు.కళ కుటుంబసభ్యులు జరిమానా డబ్బులు చెల్లించారని వెల్లడించారు.కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో అస్వస్థతకు గురి కాలేదని ఆమె ఆరోగ్యంగానే ఉందన్నారు.తాము నిర్లక్ష్యంగా వ్యవహరించామనడంలో నిజం లేదని పేర్కొన్నారు.

First published:

Tags: Local News, Rajanna sircilla, Telangana