హోమ్ /వార్తలు /తెలంగాణ /

Interesting: స్కూళ్లను బస్సు, హెలికాఫ్టర్‌లా మార్చేసిన చిత్రకారుడు

Interesting: స్కూళ్లను బస్సు, హెలికాఫ్టర్‌లా మార్చేసిన చిత్రకారుడు

స్కూళ్ల రూపురేఖలు మార్చేస్తున్న కళాకారుడు

స్కూళ్ల రూపురేఖలు మార్చేస్తున్న కళాకారుడు

ప్రభుత్వ పాఠశాల గోడలపై విజ్ఞానాన్ని నింపుతున్నాడు ఓ చిత్రకారుడు. అతడి బొమ్మలు విద్యార్థులను ఇట్టే ఆకట్టుకుంటాయనే చెప్పాలి. పాఠశాలలపై గీచిన బొమ్మలను చూస్తే నిజంగా జీవం ఉందా అనే ఆలోచన కలుగుతొంది అంటే అతిశయోక్తి కాదేమో!

  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar | Telangana

Haribabu, News18, Rajanna Sircilla

ప్రభుత్వ పాఠశాల గోడలపై విజ్ఞానాన్ని నింపుతున్నాడు ఓ చిత్రకారుడు. అతడి బొమ్మలు విద్యార్థులను ఇట్టే ఆకట్టుకుంటాయనే చెప్పాలి. పాఠశాలలపై గీచిన బొమ్మలను చూస్తే నిజంగా జీవం ఉందా అనే ఆలోచన కలుగుతొంది అంటే అతిశయోక్తి కాదేమో! స్టూడెంట్స్ఒక హెలిక్యాప్టర్ ఎక్కినట్లు, ఏరోప్లేన్, డబుల్ డెక్కర్ బస్సు ఎక్కినట్లు ఫీలవుతున్నారు. చిత్రకారుడు చందు వేసిన బొమ్మలతో సర్కారు బడుల రూపురేఖలే మారిపోయాయి. మంత్రి కేటీఆర్ నచ్చిన, మెచ్చిన చిత్రకారుడు.. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పలుమార్లు అభినందనలు అందుకున్న సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన చిత్రకారుడు నారోజు చందుపై న్యూస్18 తెలుగు ప్రత్యేక కథనం..!

రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) కేంద్రం.. సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన నారోజు చందు చిత్రకారుడిగా రాణిస్తున్నాడు. నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలపై వేసిన బొమ్మలు విద్యార్థులనే కాకుండా.. గ్రామ ప్రజలతో పాటు జిల్లా ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.

ఇది చదవండి: శ్రీమంతులు అంటే వీళ్లే.. చదువు చెప్పిన బడి కోసం ఏం చేశారో చూడండి..!

చందు తాత రమణచారీ, తండ్రి సీతరాం చారీ విగ్రహాలను తయారు చేసేవారు. వారి నుంచి వారసత్వం పునికిపుచ్చుకున్న చందు విగ్రహల తయారీతో పాటు బొమ్మలు వేయడంపై మక్కువ పెంచుకున్నాడు. చిన్నతనం నుంచి మక్కువతో నేర్చుకున్న బొమ్మలు వేయడం.. ప్రస్తుతం బొమ్మలే వేసే పనిగా తనకు ఉపాధిగా మారిందనే చెప్పకనే చెబుతున్నాడు. మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలలపై వేసిన బొమ్మలు, పెయింటింగ్ కేటీఆర్ ను ఆకర్షించాయి. ఏకంగా తన ట్విట్టర్ ద్వారా ఈ ఫోటోలు పోస్టు చేసి.. చందును అభినందించాడు. దీంతో ఒక్కసారిగా చందుకు రాష్ట్ర వ్యాప్తంగా.. దేశ విదేశాల నుంచి కూడా ట్విట్టర్ ద్వారా ప్రశంసల వర్షం కురిసింది.

ఇది చదవండి: రైతుల్లో ఆందోళన.. యాసంగి సాగుపై నీలినీడలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను రైలు బొమ్మతో నింపేశాడు చందు. దీంతో ఆ పాఠశాల కనిపించకుండా దూరం నుంచి చూస్తే ఓ రైలు బండి వచ్చేసిందనే అందంగా పెయింటింగ్ వేశాడు. స్టూడెంట్స్ సైతం ఓ రైలు ఎక్కినంత ఆనందంగా తరగతి గదిలోకి వెళ్తున్నారు. మద్దిమల్ల గ్రామంలో హెలికాప్టర్ , గొల్లపల్లిలో డబుల్ డెక్కర్ బస్సు, వెంకటాపూర్లో గొల్కొండ ఖిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ పాఠశాలపై జూపార్క్, రంగంపేటలో ఓరుగల్లు కాకతీయ తోరణం, బతుకమ్మ, బొమ్మలు, తెలంగణ సంస్కృతి బొమ్ములు ఇలా వేశాడు. ముస్తాబాద్, గంభీరావుపేటతో పాటు పలు మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల ప్రహారీ గొడలు, పాఠశాల తరగతి గదులపై ఆకట్టుకునే విజ్ఞానం నింపే బొమ్మలను పెయింటింగ్ వేశాడు చందు.

ఇది చదవండి: కర్రసాము, కత్తిసాము.. వీరి ట్యాలెంట్ చూస్తే ఔరా అనాల్సిందే!

అతని ప్రతిభను కేటీఆర్ మెచ్చుకొని నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇలాంటే పెయింటింగ్ వేయాలని దానికి సంబంధించిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఆదేశాలు జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో చందుకు జీవనోపాధి దక్కడమే కాకుండా పదిహేను మందికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదిగాడు. ఈ చిత్ర కళలనే నమ్ముకొని బతుకున్నాడు చందు. మంత్రి కేటీఆర్ ప్రశంసలు రావడంతో చందుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందనే చెప్పాలి. చందును నియోజకవర్గంలోని నాయకులంతా ప్రస్తుతం గుర్తుపడుతారంటే మీరే అర్థం చేసుకోవచ్చు. తమ గ్రామాలోని ప్రభుత్వ పాఠశాలలకు కూడా పెయింటింగ్ వేయాలని కోరుతున్నారు.

సర్కారు బడుల గోడలపై, తరగతి గదులపై పెయింటింగ్ వేయడం..

మంత్రి కేటీఆర్ మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉందన్నాడు చందు.. సర్ నాకు బతుకు దెరువు చూపించాడని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇచ్చిన అవకాశాన్ని వమ్ము చేసుకొనని, ఇంకా మంచి బొమ్మలు వేసి.. విద్యార్థులకు ఉపయోగపడేలా.. వారి సైకాలాజి ప్రకారం రోజు ఈ బొమ్మలు చూసేందుకన్న పాఠశాలకు వచ్చే విధంగా ఆకట్టుకునే బొమ్మలు వేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజాప్రతినిధులకు, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు చిత్రకారుడు చందు. మ్యూజిక్ డైరెక్టర్.. దేవిశ్రీప్రసాద్ సైతం ట్విట్టర్ వేదికగా చిత్రకారులు చందును అభినందించారు. తన ప్రతిభను గుర్తించిన మంత్రి కేటీఆర్, ప్రోత్సహిస్తున్న ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వస్తున్న ప్రశంసలను అభినందనలు చూస్తుంటే హ్యాపీగా ఉందని పేర్కొన్నాడు చందు.

First published:

Tags: Local News, Siricilla, Telangana

ఉత్తమ కథలు