హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: కరోనాతో తండ్రి, గుండె పోటుతో తల్లి మృతి.., అనాథలైన అక్కాతమ్ముడు, ఆపన్నహస్తం కోసం ఎదురు చూపు

Rajanna Siricilla: కరోనాతో తండ్రి, గుండె పోటుతో తల్లి మృతి.., అనాథలైన అక్కాతమ్ముడు, ఆపన్నహస్తం కోసం ఎదురు చూపు

సంగీత, అవినాష్ (ఫైల్)

సంగీత, అవినాష్ (ఫైల్)

గత సంవత్సరం కరోనాతో తండ్రి...ఇటీవల గుండె పోటుతో తల్లి మృతిచెందడంతో అనాథలైన ఇద్దరు పిల్లలు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ (Telangana) లోని రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) బోయినిపల్లి మండలం దుండ్రపల్లికి చెందిన ఎడెల్లి మల్లేశం, సత్య దంపతులకు అవినాష్, సంగీతా సంతానం.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  Haribabu, News18, Rajanna Sircilla

  గత సంవత్సరం కరోనాతో తండ్రి...ఇటీవల గుండె పోటుతో తల్లి మృతిచెందడంతో అనాథలైన ఇద్దరు పిల్లలు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ (Telangana) లోని రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) బోయినిపల్లి మండలం దుండ్రపల్లికి చెందిన ఎడెల్లి మల్లేశం, సత్య దంపతులకు అవినాష్, సంగీతా సంతానం. గతేడాది కరోనా సోకడంతో ఎడెల్లి మల్లేశం మరణించగా, ఐదురోజుల క్రితం ఆయన భార్య సత్య ఆనారోగ్యంతో మృతిచెందింది. దీంతో అవినాష్, సంగీత ఇద్దరూ ఆనాధలయ్యారు. పోయిన సంవత్సరం కరోనా సోకినా తండ్రి మల్లేశం వైద్య చికిత్స నిమిత్తం రూ. 3 లక్షల వరకు ఖర్చు చేశారు కుటుంబ సభ్యులు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈక్రమంలో ఇటీవల సత్యకు జ్వరం రాగా..గ్రామంలోనే వైద్యం చేయించుకుంది. పరిస్థితి విషమించడంతో కరీంనగర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే జ్వరం తీవ్రమై గుండెపోటు కూడా రావడంతో తల్లి మృతి చెందిందని కుమారుడు అవినాష్, కూతురు సంగీతలు తెలిపారు.

  తల్లిదండ్రులను కోల్పోయిన అవినాష్, సంగీతలు దాతల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. తండ్రి మరణించినప్పడు.. సైతం పలువురు ఆర్థిక సహాయం చేసి అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పుడు తల్లి మృతితో అక్కాతమ్ముడి బతుకు భారంగా మారింది. సంగీత వేములవాడలోని ప్రైవేటు కళాశాలలో బీకాం, సీఏ డిగ్రీ చదువుతోంది. అవినాష్ వేములవాడ ప్రభుత్వ కళాకాలలో ఇంటర్ ఒకేషనల్ కోర్సు చదువుతున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

  ఇది చదవండి: భర్త లేని సమయంలో మహిళా సీఐ ఇంటికి వచ్చిన సీఐడీ సీఐ.., అసలు ఆ టైంలో ఎందుకు వచ్చాడు?

  ప్రభుత్వం సైతం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. రామడుగు మండలం దేశరాజుపల్లికి చెందిన మేనమామ గంగరాజు విరికి తోడుగా వుంటున్నాడు. దాతలు స్పందించి తమ చదువులకు ఆర్థిక సహాయం అందించాలని, ఫోన్ పే,గూగుల్ పే..నంబర్ :9963867671కు సహాయ అందించాలని కోరారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Siricilla, Telangana

  ఉత్తమ కథలు