హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Schools: అధికారులూ ఈ చిన్నారుల మాటలు వినైనా మేలుకోండి: వాళ్ల జీవితాలు ఆగం అవ్వాల్సిందేనా?

Telangana Schools: అధికారులూ ఈ చిన్నారుల మాటలు వినైనా మేలుకోండి: వాళ్ల జీవితాలు ఆగం అవ్వాల్సిందేనా?

వేములవాడ

వేములవాడ

కొలనూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అద్వానంగా తయారైంది. ఎంతలా అంటే గత 10 ఏళ్లుగా వర్షాలు కురిసిన ప్రతిసారి తరగతి గదులు, గోడల్లో నీరు చేరుతుంది. గోడలను పట్టుకుంటే జలధార చేతిలోకి వస్తుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (K. Haribabu, News18, Rajanna Sircilla)

  రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా వేములవాడ (Vemulawada) నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అద్వానంగా తయారైంది. ఎంతలా అంటే గత 10 ఏళ్లుగా వర్షాలు కురిసిన ప్రతిసారి తరగతి గదులు, గోడల్లో నీరు చేరుతుంది. గోడలను పట్టుకుంటే జలధార చేతిలోకి వస్తుంది. పూర్తిగా శిథిలమైన ఈ పాఠశాల (School) ఎప్పుడు కూలుతుందో తెలియని భయాందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం కొలనూర్ గ్రామంలోని స్కూల్లో కనీస వసతులు (Minimum facilities) కల్పించాలని విద్యార్థులు నిరసన తెలిపారు. స్కూల్ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులూడుతోందని, ఎప్పుడు మీద పడుతుందోనన్న భయంతో ఉంటున్నామని విద్యార్థులు తెలిపారు. పాఠశాల పరిస్థితిపై స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు, గ్రామప్రజలు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉందని పాఠశాల ఆవరణలో తాత్కాలికంగా మూడు గదులు నిర్మించారు. అయితే ఆ గదులకు కరెంటు, ఫ్యాన్లు, లైట్స్ లేవు. అంతేకాదు విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు గదుల్లో బ్లాక్ బోర్డులు కూడా లేవు. వర్షాలు పడినప్పుడల్లా ఆ గదుల్లో నీళ్లు వస్తున్నాయి. ఎండల ధాటికి ఉక్క పోస్తుంది. చెట్ల కింద కూర్చుంటే పాములు పురుగులు వస్తున్నాయని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. మధ్యాహ్న భోజనం వండేదుకు కనీసం వంటగది కూడా లేదు.

  విద్యార్థుల (Students) అవస్థలు దృష్టిలో పెట్టుకుని స్థానికంగా ఒక దాత స్పందించి ఫ్యాన్లు, లైట్స్ అందించారు. అయితే వాటిని బిగించాలని పాఠశాల సిబ్బంది గ్రామ సర్పంచ్‌కు చెప్పగా, తన వద్ద డబ్బులు లేవని, ఆ పని నాకు అవసరం లేదని గ్రామ సర్పంచ్ భర్త మాట దాటవేసాడు. పాఠశాల పరిసర ప్రాంతాలు సైతం పిచ్చి మొక్కలతో అధ్వానంగా మారి దర్శనమిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా దయనీయంగా పరిస్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లలను పంపించడం ఇబ్బందిగా, భయంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థులకు స్కూల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఎటువంటి ప్రమాదం జరగక ముందే జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే ప్రభుత్వ పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, తరగతి గదులకు మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారానైనా ఈ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలనీ కోరుతున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Local News, Sircilla, Telangana schools, Vemulawada

  ఉత్తమ కథలు