Haribabu, News18, Rajanna Sircilla
ముగ్గురు కొడుకులు ఉన్న ఆ కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉంది. భర్త అనారోగ్యంతో మరణించగా ముగ్గురు కొడుకులను కష్ట పడి పెద్ద చేసింది ఆ నిరుపేద తల్లి. పెద్దకుమారుడు, చిన్న కుమారుడు దివ్యాంగులు కావడంతోరెండవ కుమారునిపైనే పూర్తిగా భారం పడింది. అమ్మ లక్ష్మీ, తన భార్య మానస, పిల్లలతో పాటు ఇద్దరు దివ్యాంగ సోదరులను, రెండవ కుమారుడైన నరేష్ కుటుంబ బాధ్యతను తీసుకొని కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆ రెండవ కుమారుడు నరేష్.. వృత్తి పని చేస్తుండగాతన చేతి రెండు వేళ్ళను పోగొట్టుకోవడంతో ఆ నీరుపేద కుటుంబాన్ని పోషించే దిక్కు లేకుండా పోయింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) వేములవాడ (Vemulawada) గ్రామీణ మండలం ఫాజుల్ నగర్ గ్రామానికి చెందిన మ్యాడారం లక్ష్మీ-వైకుంఠం దంపతులకు ముగ్గురు కుమారులు. అనారోగ్యంతో భర్త మృతి చెండంతో తల్లి లక్ష్మీ తన ముగ్గురు కొడుకులను పోషించింది. అందులో పెద్ద, చిన్న కుమారులిద్దరు దివ్యాంగులు కాగా.. వృద్దాప్యంలో ఉన్న తల్లి లక్ష్మీని, తన భార్య పిల్లలతో పాటు ఇద్దరు దివ్యాంగ సోదరులను రెండవ కుమారుడు నరేష్ పోషిస్తున్నాడు.
ఇటీవల అతడు కూడా పని చేసేటప్పుడు తన చేతి రెండు వెళ్లను కోల్పోవడంతో ఆ కుటుంబాన్ని పోషించే పెద్దదిక్కు లేకుండా పోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి మరింత దిక్కులేని పరిస్థితి నెలకొంది.గతంలో ఉన్న ఊరిలో ఉపాధి లేక తన తండ్రి గల్ఫ్ బాట పట్టాడని నరేష్ తెలిపాడు. అక్కడ కూడా సరిగా పని లేక ఇండియాకు రావడంతో తాము అప్పుల పాలు అయ్యామని తెలిపాడు. డిగ్రీ వరకు విద్యను అభ్యసించానని, తర్వాత ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో చదువు మానేశానని తెలిపాడు. ఏదైనా ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కుటుంబ భారం పోషిస్తున్న కొడుకు రెండు చేతివేళ్లు కట్ కావడంతో తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎమ్మెల్యే రమేష్ బాబు మంత్రి కేటీఆర్ స్పందించి తన కొడుకు ఉద్యోగం ఇప్పించాలని తల్లి వేడుకుంటుంది. ప్రత్యేక చొరవ తీసుకుని తమ కుటుంబానికి సహాయం అందించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సహాయం అందించాలని గ్రామ ప్రజలు సైతం కోరుతున్నారు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని అని నరేష్ కోరుతున్న తీరు చూసి పలువురు కంటతడి పెట్టిస్తొంది. నరేష్ సెల్ నంబర్: 8978951170
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Siricilla, Telangana