హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: కూలీ పని చేసుకునే వ్యక్తి 25 కేసుల్లో నిందితుడు.., పోలీసులే బిత్తరపోయారు 

Rajanna Siricilla: కూలీ పని చేసుకునే వ్యక్తి 25 కేసుల్లో నిందితుడు.., పోలీసులే బిత్తరపోయారు 

సిరిసిల్ల

సిరిసిల్ల పోలీసుల అదుపులో దొంగ దంపతులు

కరీంనగర్ జిల్లా (Karimnagar District) మానకొండూర్ మండలం ఊటూరుకు చెందిన వడ్డేపల్లి సత్యం ప్రస్తుతం సిరిసిల్లలోని గాంధీనగర్లో నివసిస్తున్నాడు. వెంకంపేటలో ఉంటున్న లక్ష్మితో పరిచయం ఏర్పడి ఇద్దరూ వివాహం చేసుకున్నారు

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  Haribabu, News18, Rajanna Siricilla

  రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) లో ఇటీవల దొంగతనాలకు పాల్పడిన దంపతులను పోలీసులు పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి రూ. 4.50 లక్షల సోత్తు రికవరీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రాహుల్ హెగ్డే నిందితుల వివరాలను తెలిపారు. కరీంనగర్ జిల్లా (Karimnagar District) మానకొండూర్ మండలం ఊటూరుకు చెందిన వడ్డేపల్లి సత్యం ప్రస్తుతం సిరిసిల్లలోని గాంధీనగర్లో నివసిస్తున్నాడు. వెంకంపేటలో ఉంటున్న లక్ష్మితో పరిచయం ఏర్పడి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కూలీ పనులు చేసుకొని జీవించే సత్యం మద్యానికి ఆలవాటు పడ్డాడు. కుటుంబ ఖర్చుల భారం పెరగడంతో ఇద్దరు కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ఇలా వీరిద్దరూ పలు ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

  కూలీ పని చేసుకొని జీవించే సత్యం దాదాపు 25 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని అధికారులు వెల్లడించారు. కొన్ని కేసుల్లో జైలు శిక్ష అనుభవించినా అతడిలో మార్పు రాలేదని, ప్రస్తుతం మరో 8 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘా, కఠిన శిక్ష ఉంటుందని, మార్పురాకపోతే భవిష్యత్తులో మరింత కఠిన చర్యలుంటాయని ఎస్సీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. దొంగతనం చేసిన ఆభరణాలు అమ్మేందుకు సిరిసిల్ల పెద్దబజారుకు చేరుకోగా పోలీసులు సత్యంను పట్టుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

  ఇది చదవండి: దర్జాగా హైవేపైనే స్మగ్లింగ్.. మరి పోలీసులు ఊరుకుంటారా..?

  దీంతో సత్యం, లక్ష్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరి నుంచి చోరీకి ఉపయోగించే ఇనుప రాడ్డు, విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. వీరి నుంచి 6.840 గ్రాముల బంగారం, 27.200 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 4.50 లక్షలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు.

  పండుగల సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు సంబంధిత స్టేషన్, వీలేజ్ పోలీసు ఆఫీసర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. తమ తమ ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే.. ప్రజలు విధిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. తాళాలు వేసిన ఇళ్లను దొంగలు టార్గెట్ చేస్తున్నారని, ఎవరైనా పండగలకు ఇతర ఊర్లకు, ప్రాంతాలకు వెళితే విలువైన ఆభరణాలు ఇంట్లో ఉంచవద్దని, బ్యాంకులో దాచుకోవాలని ఎస్పీ సూచించారు. సిసి కెమెరాలు అమర్చుకుంటే దొంగతనాలను అరికట్టవచ్చని, లేక దొంగతనాలు చేసిన నిందితులను త్వరగా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు దోహదపడతాయని అన్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Karimnagar, Local News, Telangana

  ఉత్తమ కథలు