హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఈ మల్లేశంకు నటనంటే ప్రాణం.. షార్ట్ ఫిల్మ్స్ సినిమాల్లో రాణిస్తున్న 108 ఉద్యోగి..!

ఈ మల్లేశంకు నటనంటే ప్రాణం.. షార్ట్ ఫిల్మ్స్ సినిమాల్లో రాణిస్తున్న 108 ఉద్యోగి..!

నటనలో

నటనలో రాణిస్తున్న గుంట మల్లేశం

Local Actor: చాలా మందికి నటనంటే పిచ్చి. కొందరకి అవకాశాలు వస్తాయి. మరికొందరికి రావు. అందుకే సినిమాల్లోకి వెళ్లకపోయినా.. స్థానికంగా నాటకాలు వేస్తూ తమ అభిరుచిని కొనసాగిస్తుంటారు. అలాంటి ఓ యువకుడి కథే ఇది.

 • News18 Telugu
 • Last Updated :
 • Vemulawada R, India

  Haribabu, News18, Rajanna Sircilla

  చాలా మందికి నటనంటే పిచ్చి. కొందరకి అవకాశాలు వస్తాయి. మరికొందరికి రావు. అందుకే సినిమాల్లోకి వెళ్లకపోయినా.. స్థానికంగా నాటకాలు వేస్తూ తమ అభిరుచిని కొనసాగిస్తుంటారు. అలాంటి ఓ యువకుడి కథే ఇది. తెలంగాణ (Telangana) లోని రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ గ్రామానికి గుంట మల్లేశం.. వృత్తిరీత్యా 108 అంబులెన్స్‌లో కాంట్రాక్టు ఉద్యోగి. కానీ అతని ప్రవృత్తి మాత్రం నటనే. ప్రవృత్తిని వృత్తిగా మార్చుకునేందుకు మల్లేశం ఎంతగానో శ్రమిస్తున్నాడు. నటన పై ఆసక్తి ఉన్నా కుటుంబ బాధ్యతలు అతనిని కట్టిపడేస్తున్నాయి. అయినా నటనపై ఉన్న ఆసక్తి చంపుకోలేక తన టాలెంట్‌తో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సమయం దొరికినప్పుడల్లా సినిమాల్లో తన నటనను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

  చిన్నప్పటి నుంచి ఒగ్గు కథ కళాకారుడు కావడంతో మల్లేశంకు నటనపై ఆసక్తి పెరిగింది. కుటుంబాన్ని పోషించేందుకు 108 అంబులెన్స్ సర్వీసులో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తుండగా సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. దీంతో ఓ వైపు ఉద్యోగం, మరోవైపు సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, ఫోక్ సాంగ్స్, కామెడీ షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ నటనపై తన ఇష్టాన్ని చాటుకున్నాడు. 'జీఎం ఫోక్ సాంగ్స్' అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా జానపద, కామెడీ షార్ట్ ఫిలిమ్స్, సాంగ్స్ తీసుకుంటూ.. తనతో పాటు తోటి కళాకారులను ప్రోత్సహిస్తున్నాడు.

  ఇది చదవండి: వినాయకుడు చెప్పాడంటూ ఈ గ్రామస్థులు ఏం చేశారో తెలుసా..?

  ఇప్పటివరకు 100 వరకు షార్ట్ ఫిలిమ్స్, ఫోక్ సాంగ్స్, కామెడీ ఆల్బమ్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. సైన్యం, సైదుల్ అనే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన మల్లేశం ఇటీవల బ్రహ్మచారి అనే సినిమాలో హీరోగా చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉందని తెలిపాడు. బ్రహ్మచారి అనే సినిమాలో హీరోగా చేయగా యూట్యూబ్లో, ఓటీపీలో ఆదరించినట్లే అందరూ ఆశీర్వదించాలని కోరాడు. ఎప్పటికీ తాను హీరో కాదని ఆర్టిస్టుగా, కమెడియన్‌గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. సినిమాలో అవకాశం ఇచ్చిన నర్సింగ్ సార్‌కి ధన్యవాదాలు తెలిపారు.

  ఇది చదవండి: తెలంగాణలో దొంగల రాజ్యంగా చరిత్రలో నిలిచిన లింగాల.. ఆ ఊరి కథేంటి..?

  సర్దార్ గబ్బర్ సింగ్ (Sardar Gabbar Singh) సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు వచ్చే చేజారిందని, ఎప్పటికైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిత్రంలో నటించడమే తన లక్ష్యమని మల్లేశం అన్నాడు. సినిమాలో నటించడం అంటే చాలా ఇష్టమని, దానికోసం ఎంత\ శ్రమించాలంటే అంత శ్రమిస్తానని అన్నాడు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన గుంట మల్లేశం.. నటన కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేసినట్లు తెలిపాడు. ఒక గొప్ప నటునిగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు. సినిమాల్లో నటించిన తర్వాత పలు ప్రాజెక్టుల్లో అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Karimnagar, Local News, Telangana

  ఉత్తమ కథలు