Home /News /telangana /

RAJANNA SIRCILLA THIEVES STOLEN ALL VALUBALES IN THE HOME BUT DID NOT TOUCH ANYTHING IN THE GOD ROOM BRV RKH ABH

Rajanna Sircilla: ఇల్లంతా దోచేసిన దొంగలు.. కానీ వాటిని మాత్రం టచ్ చేయలేదు.. ఆ మాత్రం భయం ఉండాల్సిందే..!

ఆవేదన

ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు ఏనుగుల మనోహర్ రెడ్డి

సోమవారం ఉదయం ఇంటికి చేరుకున్న మనోహర్ రెడ్డి... ఇంటి తాళం పగిలి ఉండడం గమనించి లోపలికి వెళ్లి చూశాడు. ఇంట్లో దాచిన 35 తులాల బంగారు, 50 తులాల వెండి ఆభరణాలు, రూ. 2.80 లక్షలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు

  • News18 Telugu
  • Last Updated :
  • Sircilla, India
    K.Haribabu, News 18, Rajanna Sircilla

    Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల(Sircilla) జిల్లా వేములవాడ (vemulawada) పట్టణంలోని ఉప్పుగడ్డ వీధికి చెందిన ఏనుగుల మనోహర్ రెడ్డి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారు(gold), వెండి ఆభరణాలు(silver), నగదు ఎత్తుకెళ్లారు. పట్టణ ఇన్స్పెక్టర్ ఓ.వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం ... మనోహర్ రెడ్డి ఆగష్టు 14న ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లాడు. సోమవారం ఉదయం ఇంటికి చేరుకున్న మనోహర్ రెడ్డి... ఇంటి తాళం పగిలి ఉండడం గమనించి లోపలికి వెళ్లి చూశాడు. ఇంట్లో దాచిన 35 తులాల బంగారు, 50 తులాల వెండి ఆభరణాలు, రూ. 2.80 లక్షలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు.

    బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన టౌన్ సీఐ డాగ్ స్క్వాడ్(Dog squad), క్లూస్ టీంను రంగంలోకి దించారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఊరికి వెళ్లి సోమవారం రాగానే తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా చేసి ఉన్నాయని, విలువైన ఆభరణాలతో పాటు నగదును సైతం దుండగులు ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. కౌన్సిలర్ ఇప్పప్పుల జై సైతం సమాచారం తెలుసుకొని బాధితుని ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు.

    Read this also; Mulugu: రేషన్ బియ్యంను పక్కదారి పట్టిస్తున్న మాయగాళ్లు: ఒకే చోట 60 క్వింటాళ్ల బియ్యం



    పట్టణ సీఐ వెంకటేష్ ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే చోరీకి పాల్పడిన వారిని పట్టుకుంటామని తెలిపారు. కాగా ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలను, నగదును దోచుకెళ్లిన దుండగులు దేవుడి వద్ద ఉన్న వస్తువులు, ఆభరణాలను ఎత్తుకెళ్లకుండా విడిచిపెట్టడం గమనార్హం. ఇక కేసు విచారణలో భాగంగా సీసీటీవీని పరిసలించారు పోలీసులు. అర్ధరాత్రి ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా మహిళ సంచరిస్తున్న వీడియో.. సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆ మహిళనే చోరీకి పాల్పడి ఉంటుందని బాధితులు అనుమానిస్తున్నారు. చోరీ జరిగిన సొత్తు విలువ సుమారు రూ. 40 లక్షల వరకు ఉంటుందని బాధితులు తెలిపారు.
    First published:

    Tags: Crime news, Local News, Sircilla, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు