(Haribabu, News18, Rajanna Siricilla)
రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా సిరిసిల్ల పట్టణంలోని గోపాల్‌నగర్‌లో జరిగిన సంఘటన షాక్‌కు గురిచేస్తోంది. వినాయక చవితి (Vinayaka Chaviti) సందర్భంగా చిన్నారులు ఏర్పాటు చేసుకున్న మండపంలో వినాయుకడి ప్రతిమను దుండగులు ఎత్తుకెళ్ళడం స్థానికంగా కలకలం రేపింది. ఒకే వీధిలో ఉంటున్న ఆ చిన్నారులు ఎంతో ముచ్చటగా, ఆనందోత్సాహాల నడుమ తొలిసారి ప్రతిష్ఠించిన గణపతి ప్రతిమను (Ganesh idol) గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు (Theft). రాత్రి 12 గంటల వరకు మండపం వద్ద పిల్లలు, స్థానికులు అక్కడే ఉండగా, అర్థరాత్రి తర్వాత ప్రతిమ చోరీకి గురైంది. ఘటన పట్ల చిన్నారులు, కాలనీ వాసులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సోషల్ మీడియాలో ఈ చోరీ వ్యవహారం వైరల్‌గా మారింది.
మరో చోట తాళం వేసిన ఇంటి తలుపులు పగులకొట్టి చోరీకి విఫలయత్నం చేశారు దుండగులు. గోపాల్ నగర్‌లో చోరీ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వినాయక ప్రతిమ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. 12 గంటల సమయంలో కరెంటు పోగా అదును చూసుకొని విగ్రహాన్ని అపహరించారని స్థానికులు చెబుతున్నారు.
విగ్రహాలు అలా పెట్టొద్దు..
గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ మండపాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. రోడ్డుకు అడ్డంగా మండపాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ అసౌకర్యం కలిగించ వద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. భక్తులు తమ వాహనాలను మండపానికి కొంత దూరంలో పార్క్ చేసుకొనే విధంగా వాలంటీర్లు శ్రద్ధ తీసుకోవాలని, మండపాల వద్ద 24 గంటలు వాలంటీర్లు ఉండేలా జాగ్రత్త వహించాలని సూచించారు. గణేష్ మండపాల వద్ద ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదని, పూజ కోసం వచ్చే మహిళా భక్తుల పట్ల వాలంటీర్లు దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించకుండా వారి పట్ల సత్ప్రవర్తనతో ఉండాలని పేర్కొన్నారు.
IRCTC Tirupati Tour: సెప్టెంబర్‌లో హైదరాబాద్ నుంచి తిరుపతి టూర్ ప్యాకేజీలు
""మద్యం సేవించి మండపాల వద్దకు రాకూడదు, మండపం వద్ద టపాకాయలు, బాణాసంచా ఉంచరాదు. ఈ మండపాన్ని నాణ్యమైన వస్తువులతో నిర్మించాలి ఒకవేళ వర్షం కురిసినా... భక్తులకు,విగ్రహానికి ఎటువంటి ఇబ్బందిలేకుండా మండపంపైన టార్పాలిన్ ఏర్పాటు చేయాలి. మండపాలు తాత్కాలికంగా తీసుకొనే విద్యుత్ కనక్షన్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కావున తగిన జాగ్రత్తలు పాటిస్తూ విద్యుత్ అధికారులను సంప్రదించి కనెక్షన్ తీసుకోవాలి.
మండపాల వద్ద కనీసం రెండు సీసీ కెమెరాలు ఉండేవిధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు తక్షణమే స్పందించేలా నీళ్లు (4) బకెట్లలో ఇసుక ఉండేలా చూడాలి. భక్తి పాటలను మాత్రమే పెట్టుకోవాలి. అధిక శబ్ద కాలుష్యాన్ని సృష్టించే డీజేలను వినియోగించరాదు. ఊరేగింపులో మద్యం సేవించి పాల్గొనరాదు. ఎట్టి పరిస్థితుల్లో డి.జె.లను వినియోగించరాదు. నిమజ్జనం కోసం ఏర్పాటు చేసుకొనే వాహనం ముందుగానే మాట్లాడి , సమయానికి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి".
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.