హోమ్ /వార్తలు /తెలంగాణ /

Siricilla: చేనేత కార్మికుల గొప్పదనాన్ని, కళా నైపుణ్యాన్ని అభినందించిన ప్రధాని

Siricilla: చేనేత కార్మికుల గొప్పదనాన్ని, కళా నైపుణ్యాన్ని అభినందించిన ప్రధాని

X
కార్మికులను

కార్మికులను ప్రశంసించిన మోదీ

RajannaSiricilla: ప్రధాని నోట సిరిసిల్ల నేతన్న ప్రస్తావన రావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ శ్రేణులు హార్షం వ్యక్తం చేశారు. ‘‘మన్ కీ బాత్'' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, చేనేత కార్మికుడు హరి ప్రసాద్ జీ-20 పేరుతో చేతితో స్వయంగా నేసిన వస్త్రాన్ని చూపించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

K.Haribabu,News18, Rajanna siricilla

ప్రధాని నోట సిరిసిల్ల నేతన్న ప్రస్తావన రావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ శ్రేణులు హార్షం వ్యక్తం చేశారు. ‘‘మన్ కీ బాత్'' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, చేనేత కార్మికుడు హరి ప్రసాద్ జీ-20 పేరుతో చేతితో స్వయంగా నేసిన వస్త్రాన్ని చూపించారు. చేనేత కార్మికుల గొప్పదనాన్ని కళా నైపుణ్యాన్ని వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. దీంతో కళాకారుడు హరిప్రసాద్ తో పాటు జిల్లా బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహంలో మునిగిపోయారు. సిరిసిల్ల చేనేత ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన కళాకారుడు హరి ప్రసాద్ ని జిల్లా బీజేపీ నాయకులు సన్మానించి అభినందించారు.

భారతదేశానికే ఆదర్శం సిరిసిల్ల నేతన్నల ప్రతిభ. నాడు నేతన్నల ఆకలి చావులు ఆత్మహత్యలు నేడు భారతదేశానికే ఆదర్శం. భారతదేశ ప్రధాని నోట సిరిసిల్ల నేతన్నల మాట రాజన్న సిరిసిల్ల నేత కళాకారుడు హరిప్రసాద్ పేరును దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించడంపై సిరిసిల్ల పేరు జాతీయస్థాయిలో చర్చకు వచ్చింది. ఆదివారం ‘‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని చేతిలో సిరిసిల్ల పేరు ప్రఖ్యాతులు, సిరిసిల్ల నేత కళాకారుడు హరిప్రసాద్ ప్రతిభను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు.

చేనేత కార్మికుడు హరి ప్రసాద్ జీ-20 పేరుతో చేతితో స్వయంగా నేసిన వస్త్రాన్ని చూపించిన నరేంద్రమోదీ సిరిసిల్ల నేత కళాకారుడు హరిప్రసాద్ ప్రతిభను తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ తెలంగాణ పేరును గుర్తు చేశారు. చేనేత కార్మికుల గొప్పదనాన్ని, కళా నైపుణ్యాన్ని వివరిస్తూ అభినందించిన ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆసక్తిగా తిలకించారు. జాతీయస్థాయిలో సిరిసిల్ల నేత కళాకారుడు హరి ప్రసాద్ పేరు సంపాదించడం కాకుండా సిరిసిల్ల పేరును ప్రధాని మోడీచే పలికించడంతో రాజన్న సిరిసిల్ల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చేనేత కార్మికుడు, కళాకారుడు వెల్డి హరిప్రసాద్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తన పేరును ప్రస్తావించడం అదృష్టంగా భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. G20కి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని మోడీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కార్మికుల ప్రతిభను ప్రస్తావిస్తూ.. అభినందించడం గొప్ప విషయమని, అదృష్టమని జిల్లా ప్రజలు, చేనేత కార్మికుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సైతం ఈ చేనేత కార్మికుడు అగ్గిపెట్టెలో పట్టే చీరే, జాతీయ పతాకాన్ని, వివిధ రకాల పట్టుచీరలను, ప్రముఖుల చిత్రపటాలను చేనేత వస్త్రంపై చేసి అబ్బురపరిచాడు.

First published:

Tags: Local News, Rajanna, Telangana

ఉత్తమ కథలు