హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Sircilla: కలకాలం కలిసుండాలి కానీ.. భార్య కాపురానికి రావడం లేదని అంత పని చేస్తావా.. బ్రదర్​..

Rajanna Sircilla: కలకాలం కలిసుండాలి కానీ.. భార్య కాపురానికి రావడం లేదని అంత పని చేస్తావా.. బ్రదర్​..

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

రాజన్న సిరిసిల్లకు చెందిన దేవిరెడ్డికి నాలుగు సంవత్సరాల క్రితం సింధుజతో పెళ్లి అయింది. కొద్దిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో రెండు నెలల క్రితం సింధుజ పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో భర్త కఠిన నిర్ణయం తీసుకున్నాడు.

ఇంకా చదవండి ...

(K. Haribabu, News 18 , Rajanna Sircilla)

ప్రమాదవశాత్తు చెక్ డ్యామ్‌ (dam)లో పడి రైతు మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల (Rajanna Siricilla) జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు చిగుర్ల రాజమల్లయ్య (62) మంగళవారం పశువులను మేపేందుకు తమ పొలం వద్దకు వెళ్ళాడు. రాత్రి అయినప్పటికీ రాజమల్లయ్య ఇంటికి రాకపోవడంతో భార్య బుచ్చవ్వ ఆందోళనకు గురై.. చుట్టుపక్కల్లో వెతికింది. ఎంతకూ ఆచూకీ లభించకపోవడంతో కుమారులకు సమాచారం అందించింది. ఈక్రమంలో తండ్రిని వెతుక్కుంటూ వెళ్లిన కుమారులకు తమ పొలం పక్కన ఉన్న చెక్ డ్యామ్‌లో శవమై కనిపించాడు రాజమల్లయ్య. భార్య బుచ్చవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.పశువులు చెక్ డ్యామ్ లోకి వెళ్లడంతో లోతు అంచనా వేయలేకపోయిన రాజమల్లయ్య నీటిలో మునిగి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రాజమల్లయ్యకు భార్య, ఇద్దరు కొడుకులు కూతుర్లు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

చెక్ డ్యామ్‌లో పడి మృతి చెందిన రైతు రాజమల్లయ్య
చెక్ డ్యామ్‌లో పడి మృతి చెందిన రైతు రాజమల్లయ్య

భార్య కాపురానికి రావడం లేదని..

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామానికి చెందిన వంగ దేవిరెడ్డి (27) బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు (Husband commits suicide) పాల్పడ్డాడు. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం దేవిరెడ్డికి నాలుగు సంవత్సరాల క్రితం గూడెం గ్రామానికి చెందిన సింధుజతో పెళ్లి అయింది. కొద్దిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దలు పంచాయతీలు కూడా నిర్వహించారు. ఈక్రమంలో రెండు నెలల క్రితం సింధుజ పుట్టింటికి వెళ్ళిపోయింది. భార్య (Wife) కాపురానికి రావడంలేదని మనస్థాపానికి గురై దేవిరెడ్డి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య (Hanging) చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. దేవిరెడ్డి తల్లిదండ్రులు రాజిరెడ్డి ప్రమీలల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

పేకాట స్థావరాలపై దాడి..

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్‌లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాబడిన సమాచారంతో పేకాట స్థావరాలపై దాడులు చేశామని తెలిపారు. ఆరుగురి నుంచి పదివేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని ఎస్సై హెచ్చరించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిషన్ రావు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం శివారులో బుధవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు యువకులు మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని ఎస్సై కిషన్ రావు వివరించారు.

First published:

Tags: Crime news, Husband commit suicide, Local News, Siricilla