Home /News /telangana /

RAJANNA SIRCILLA THE EO OF RAJANNA TEMPLE IS FACING ALLEGATIONS REGARDING THE ISSUANCE OF PERMANENT ABHISHEKAM TICKET ABH BRV RKH

Rajanna Sircilla: రాజన్న ఆలయంలో ఏం జరుగుతుంది?... ఒకే వ్యక్తికి 52 శాశ్వత అభిషేకం టికెట్లు జారీ

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయం

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో భక్తుల విశ్వాసాలకు భంగం వాటిల్లింది. శాశ్వత పూజల పేరిట జరిగిన బడా గోల్మాల్ వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది

 • News18 Telugu
 • Last Updated :
 • Sircilla, India
  (K.Haribabu, News 18, Rajanna Sircilla)

  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో భక్తుల విశ్వాసాలకు భంగం వాటిల్లింది. శాశ్వత పూజల పేరిట జరిగిన బడా గోల్మాల్ వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. సామాన్య భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర దేవాదాయ శాఖ రూపొందించిన శాశ్వత పూజ విధానాలను ఆలయ అధికారులు తమకు సన్నిహతుడైన ఓ వ్యక్తికి అనుకూలంగా మార్చివేసి అక్రమ పద్ధతిలో 52 శాశ్వత అభిషేకం టికెట్లు కేటాయించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేములవాడ రాజన్న క్షేత్రంలో మూడు నాలుగేళ్లుగా ప్రతి సోమ, శుక్ర, ఆదివారాల్లో గర్భాలయ ప్రవేశాలను నిలిపివేసి లఘు దర్శనం అమలు చేస్తున్నారు. ఈ మూడు రోజులలో వీఐపీలను సైతం గర్భాలయంలోకి అనుమతించడం లేదు.

  ఎమ్మెల్యేలు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని , రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉన్నవారిని సైతం అనేకసార్లు గర్భాలయంలోకి అనుమతించని ఆలయ ఉన్నతాధికారులు వరంగల్‌కు చెందిన ఓ విద్యాసంస్థ అధినేతకు మంత్రి స్థాయిలో మర్యాదలు, అక్రమ పద్ధతుల్లో అభిషేకం టికెట్లు కట్టబెట్టినట్టి దగ్గరుండి రాచమర్యాదలు కల్పించి స్వామివారి అభిషేక భాగ్యం కల్పిస్తున్నారు. ప్రతి సోమవారం ఆయన వచ్చేవరకు కొందరు ఆలయ సిబ్బంది ఎదురు చూసి మరి ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు చేయిస్తారు.

  ఆలయ భద్రత పర్యవేక్షించే ఎస్పీఎఫ్ సిబ్బంది నుంచి హోంగార్డులు, అర్చకులు, వేద పండితులు ఆయన వెంటనే ఉండటం గమనార్హం. అయన వచ్చిన ప్రతి సోమవారం వేలాది రూపాయలు అప్పజెబుతుండడంతో ఆయనకు స్వాగతం పలికేందుకు ఉద్యోగులు పోటీపడుతుంటారని ఆలయ వర్గాలు చెప్పుకుంటున్నారు. ఆగష్టు 7వ తేదీన ఆదివారం ఆయనతో పాటు పది మంది కుటుంబ సభ్యులను గర్భాలయంలోకి అనుమతించడం వివాదాస్పదమైంది. ఈ మొత్తం వ్యవహారంపై ఆలయ ఈవో రమాదేవిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని మొదట చెప్పిన ఆమె, తర్వాత తనకు తెలియదంటూ మాట మార్చారు. మొన్నటి వరకు సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని, విఐపిలకు పూర్తిగా దూరంగా ఉంటానని దేవాలయ ఆదాయానికి గండి కొడితే సహించబోనంటూ చెప్పిన ఈవో రమాదేవి, తాజాగా గర్భాలయ వివాదంపై నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తుంది.

  ఆలయ ఈవోను తక్షణమే సస్పెండ్ చేయాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ రాజన్న ఆలయంలో శాశ్వత అభిషేకం టికెట్లను అక్రమంగా జారీ చేసిన వ్యవహారంలో ఆలయ ఈవో రమాదేవిని వెంటనే సస్పెండ్ చేసి, శాఖ పరమైన విచారణతో పాటు విజిలెన్స్ విచారణ జరిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. సామాన్య భక్తులను గాలికి వదిలేసి... శ్రీమంతులను, మంత్రుల సిఫార్సు చేసిన వారిని సోమవారాలు అభిషేకానికి అనుమతించిన వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ తరపున డిమాండ్ చేస్తున్నామని రామకృష్ణ అన్నారు.

  వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో ఎంతోకాలంగా మూడు వేల రూపాయలు చెల్లించిన వారికి శాశ్వత అభిషేకం టిక్కెట్లు జారీ చేస్తున్నారు. వారిని సంవత్సరంలో ఒకసారి పదేళ్లలో మొత్తం పదిసార్లు గర్భాలయంలో అభిషేకానికి అనుమతిస్తారు. గదిహ్సిన మూడేళ్ళుగా ముఖ్యంగా కరోనా (covid) అనంతరం సోమ, శుక్ర, ఆదివారాల్లో గర్భాలయంలోకి ప్రవేశం నిషేధించారు. దీంతో వేలాది భక్తులు అభిషేక ప్రియుడైన శివయ్య (రాజన్నకు) మొక్కు చెల్లించుకోకుండానే నిరాశతో తిరిగి వెళుతున్నారు. ఇదే క్రమంలో తమకు సన్నిహితుడైన ఓ వ్యక్తి భక్తి కోసం ఆలయ అధికారులు మూడు వేల రూపాలకు ఒక టికెట్ చొప్పున మొత్తం 52 శాశ్వత అభిషేకం టిక్కెట్లను రూ. 1 లక్షా 56 వేలకు ఒకే పేరుపై జారీ చేశారు.

  ఒక టికెట్ సంవత్సరంలో ఒక రోజు అనుమతించే విధానంలో ఏకంగా ఒకే వ్యక్తి 52 టికెట్లు కొనుగోలు చేసిన కారణంగా ప్రతి సంవత్సరం వరుసగా 52 వారాలు చొప్పున పదేళ్ల పాటు 520 వారాలు అభిషేకానికి అనుమతించే విధంగా ఆలయ శాశ్వత పూజల రిజిస్టరులోని 202 పేజీ నుంచి 208 పేజీలలో వివరాలురాలు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి రశీదు నంబరు 3346 నుంచి వరుసగా ఆయన పేరే నమోదు అయి ఉంది. పైగా ప్రతి టోకెన్ ( టికెట్ )పై అన్ని నెలలలోనూ సోమవారాలనే నమోదు చేయడం గమనార్హం. రాజన్న ఆలయ ఈవోగా ఎల్.రమాదేవి బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు.. అనగా 2022 జనవరి 18వ తేదీ నుంచి ఈ అక్రమ తంతు సాగడం ఆశ్చర్యకరం. పైగా శాశ్వత అభిషేకం టికెట్లు జారీచేసిన సంవత్సర కాలం తరువాత అభిషేకంకు అనుమతించాలని నిబంధనలు చెబుతుండగా, ఈ ప్రత్యేక వ్యక్తికి మాత్రం ఆనాటి నుంచే ప్రతీ సోమవారం అనుమతిస్తుండడం విశేషం.
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Crime, Local News, Sircilla, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు