RAJANNA SIRCILLA THE COUPLE CALLED ALL THE VILLAGERS AND ORGANIZED A BARASALA FOR THE CALF IN RAJANNA SIRICILLA DISTRICT RKH PRV
Barasala to a baby cow: లేగ దూడకు కొత్త బట్టలతో ముస్తాబు.. ఘనంగా బారసాల.. కదిలొచ్చిన ఊరి ప్రజలు..!
లేగ దూడకు శివ అని నామకరణం చేసిన దంపతులు
పుట్టిన పిల్లలకు బారసాల నిర్వహించి నామకరణ మహోత్సం నిర్వహించడం మన సాంప్రదాయం. కానీ, ఈ మధ్య చాలా చోట్ల లేగదూడలకు కూడా ఈ బారసాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఇదేవిధంగా బుజ్జాయికి చేసిన బారసాల విశేషాలు తెలుసుకుందాం!
రాజన్న సిరిసిల్ల (Rajanna siricilla) జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మిరియాల్కార్ రమణ కిషన్ దంపతులు (Ramana Kishan couple) తమ ఆవుకు జన్మించిన లేగదూడకు (Calf) బారసాల (Barasala) నిర్వహించారు. మనుషుల మాదిరిగానే కొత్తబట్టలు కట్టి ముస్తాబు చేసి ఈ నామకరణ మహోత్సవం శాస్త్రోక్తంగా వేడుక చేశారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ ఈ బారసాల కార్యక్రమాన్ని అర్చకస్వాములు నిర్వహించారు.
లేగదూడకు వెండి ఆభరణాలు:
గతంలోనే ఆ ఆవుకు (Cow) సీమంతం నిర్వహించగా లేగదూడ (Baby cow) జన్మించడంతో ఇటీవల మొలతాడు ధారణ కార్యక్రమాన్ని కూడా జరిపించారు. 21వ రోజు సందర్భంగా స్థానిక మార్కండేయ ఆలయంలో (Markandeya temple) అర్చకులు, వేద పండితుడు ఉమాశంకర శర్మ వేద మంత్రోచ్ఛరణల మధ్య సాంప్రదాయబద్దంగా బారసాల జరిపించారు. లేగదూడకు (Calf) శివుడు (Shivudu) అని పేరు పెట్టారు. గోమాతతో పాటు లేగదూడ (Calf) కు నూతన వస్త్రాలు (New dresses) వేసి వెండి ఆభరణాలతో అలంకరించారు. స్థానికులకు అన్నదాన కార్యక్రమం చేసి గోమాత పై వారికున్న భక్తి భావాలు ఆ దంపతులు చాటుకున్నారు
చుట్టుపక్కల గ్రామాల (Villagers)నుంచి కూడా ప్రజలు ఈ బారసాల కార్యక్రమాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గతంలో ఆవుకు (గోమాతకు) శ్రీమంతం కూడా ఘనంగా నిర్వహించి అందరి మన్ననలు పొందారు.
గోవును (Cow) పూజిస్తే ఆయురారోగ్యాలతో పాటు వంశాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి (Financial development) జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అని అర్చక స్వాములు వేద పండితులు చెబుతున్నారు. తాము ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఆవుకు లేగ దూడ (Baby cow) పుట్టడం సంతోషంగా ఉందని ఆ దంపతులు హర్షం వ్యక్తం చేస్తూ తెలిపారు. గోమాత ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ దేవ దేవున్ని కోరుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ బారసాల (Barasala) కార్యక్రమానికి పిలవగానే అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గ్రామ ప్రజలకు (Villagers) పుణ్య దంపతులు ధన్యవాదాలు (Thanks)తెలిపారు.
జంతు ప్రేమికుల హర్షం
ఎల్లారెడ్డిపేట (Ellareddy peta) మండల కేంద్రంలో బారసాల కార్యక్రమంతో పండుగ వాతావరణం నెలకొంది. లేగ దూడకు బారసాల నిర్వహించడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ (Viral in social media) గా మారుతోంది. ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల జంతు ప్రేమికులు (Animal lovers), హిందూ సంఘాలు (Hindu Groups) హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ ఇంట్లో పిల్లలు పుడితే జరుపుకునే బారసాల కార్యక్రమానికి ఏ మాత్రం తీసిపోకుండా లేగదూడకు (Baby cow) కార్యక్రమం నిర్వహించడంపై నెటిజన్లు (Netizens) సైతం హర్షిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.