హోమ్ /వార్తలు /తెలంగాణ /

నేత్ర శోభితంగా స్వామి వార్ల రథోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తజనం! ..

నేత్ర శోభితంగా స్వామి వార్ల రథోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తజనం! ..

X
నేత్ర

నేత్ర పర్వంగా సాగిన రథోత్సవం

Telangana: హరిహర క్షేత్రంగా, దక్షిణ కాశీగా ప్రసిద్దిగాంచిన వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మి అనంతపద్మ స్వామి వార్ల రథోత్సవం గురువారం సాయంత్రం శోభాయమానంగా జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(K.Haribabu,News18, Rajanna siricilla)

హరిహర క్షేత్రంగా, దక్షిణ కాశీగా ప్రసిద్దిగాంచిన వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మి అనంతపద్మ స్వామి వార్ల రథోత్సవం గురువారం సాయంత్రం శోభాయమానంగా జరిగింది. స్వామి, అమ్మవార్లు విహరించనున్న రథాలను వివిధ వర్ణాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

రథాలపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చక స్వాములు, వేద పండితులు అధిష్టించారు. ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ కుష్మాండాలు, నారికేళలతో స్వామివార్లకు మంగళ హారతులు ఇచ్చారు. భక్తజనం రథాన్ని ముందుకు లాగుతూ భక్తులు, ఆలయ అధికారులు హరిహరులను స్మరించుకున్నారు. వేములవాడ పట్టణంలోని రహదారులకు ఇరువైపులా బారులు తీరిన భక్తజనం స్వామి అమ్మవార్లు విహరించే రథాలకు మంగళ హారతులు ఇచ్చి దర్శించుకున్నారు.

వేములవాడలో రథోత్సవంపై భక్తులకు స్వామివార్లు దర్శనమిచ్చారు. రథోత్సవం నేపథ్యంలో భక్తులు, ఆలయ అధికారులు జోగినీలు, మేళతాళల మధ్య నృత్యాలు చేసి సంబరపడ్డారు. ప్రతి సంవత్సరం రాజన్న సన్నిధానంలో నేత్రపర్వంగా సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఆలయ ప్రధానార్చకులు భీమాశంకర శర్మ ఆధ్వర్యంలో అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాల్లో సైతం అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు అర్చకులు వెల్లడించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో ఉగాది పర్వదినం నుంచి తొమ్మిది రోజులపాటు శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గురువారం రాత్రి డోలోత్సవంతో శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి.

సీతారాముల దివ్య కళ్యాణాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. ఉదయం పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు, స్వామివారిని దర్శించుకుని, స్వామివారి దివ్య కల్యాణాన్ని తిలకించి సేవలో తరించారు. ప్రతి సంవత్సరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగడం ఆనవాయితీగా వస్తుందని అర్చకులు, వేద పండితులు చెబుతున్నారు.

రథోత్సవానికి ముందుగా అర్చకులు వేద పండితులు స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించి రథంపై ఉత్సవమూర్తులను అధిష్టించారు. శ్రీరామ నవమి (సీతారాముల కళ్యాణం)కి గత సంవత్సరాలతో పోల్చితే ఈ ఏడాది స్వామివారి కల్యాణానికి భక్తులు తక్కువగా వచ్చారు. శుక్రవారం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారితో పాటు బద్ది పోచమ్మ తల్లిని దర్శించుకుని బోనాల నైవేద్యాలు సమర్పించుకొని తమ తమ ఇళ్లకు వెళ్లడం ఆనవాయితీగా వస్తుందని జోగినిలు చెబుతున్నారు.

First published:

Tags: Local News, Rajanna sircilla, Sriramanavami, Telangana

ఉత్తమ కథలు