హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajanna Siricilla: పంచాయతీ ట్రాకర్ బహిరంగ వేలం.. వైరల్ అయిన సర్పంచ్ ప్రకటన..

Rajanna Siricilla: పంచాయతీ ట్రాకర్ బహిరంగ వేలం.. వైరల్ అయిన సర్పంచ్ ప్రకటన..

X
ట్రాక్టర్

ట్రాక్టర్ ను వేలానికి పెట్టిన సర్పంచ్

Rajanna -Siricilla: ప్రభుత్వం నుంచి గ్రామానికి నిధులు రావడం లేదు అంటే ఎవరైనా ఏం చేస్తారు..? నిధుల కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు. ప్రభుత్వానికి వినతలు అందిస్తారు. కానీ ఓ గ్రామ సర్పంచ్ చేసి ప్రకటన ఇప్పుడు వైరల్ అవుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Sircilla, India

K.Haribabu,News18, Rajanna siricilla

సాధారణంగా గ్రామానికి ప్రభుత్వం నుంచి నిధులు రాకుంటే.. ఆ గ్రామ సర్పంచ్ (Villiage President) కు ఇబ్బందులు తప్పవు. దీంతో ఆ నిధుల కోసం వివిధ రాకల ప్రయత్నాలు చేస్తారు. అయితే తాజాగా ఓ సర్పంచ్ ఏం చేశాడో తెలుసా..?  తమ గ్రామ పంచాయతీకి నిధులు రావడంలేదని పంచాయితీకి చెందిన ట్రాక్టర్ ను వేలం (Tractor Auction) వేస్తున్నామంటూ సోషల్ మీడియా (Social Media) లో చేసిన ప్రకటించాడు. దీంతో ఆ ప్రకటన  వైరల్ అయ్యింది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla) లో చోటుచేసుకొంది. జిల్లా ఇల్లంతకుంట మండలం చిక్కుడువానిపల్లె గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కు బహిరంగ వేలం వేస్తామని ఆ గ్రామ సర్పంచ్ లాల రాధ సోషల్ మీడియాలో ప్రకటించారు.

పంచాయతీ ట్రాక్టర్ కు చెల్లించాల్సిన ఈఎంఐ బకాయిలు చెల్లించ లేకపోతున్నామని, బ్యాంకు అధికారుల నుండి తీవ్రంగా ఒత్తిడి వస్తుందని సర్పంచ్ వాపోయారు. గ్రామ పంచాయతీ నిధులు గత తొమ్మిది నెలల నుండి రావడం లేదని అధికారులు వెంటనే స్పందించి తమకు నిధులు విడుదల అయ్యేలా చూడాలని కోరుతున్నారు.

ట్రాక్టర్ ఇఎంఐలు కట్టలేకపోవడం వల్లనే, సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టామంటున్నారు గ్రామ పెద్దలు.  ఏది ఏమైనప్పటికీ ఈ ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది సర్పంచ్ తీరు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని ఈ పరిస్థితి ఉంటే.. మరి మిగతా జిల్లాలోని గ్రామపంచాయతీలో పరిస్థితి ఇలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని నెటిజన్లు చర్చిస్తున్నారు.

ఇదీ చదవండి : పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార రథం 'వారాహి'.. ఈ పేరు వెనక కథ ఇదే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లను కేటాయించిన విషయం తెలిసింది. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో భాగంగా వాటికి తోడ్పాటు అందించేందుకు మున్సిపాలిటీలకు గ్రామపంచాయతీలకు వాటర్ ట్యాంకర్ లతోపాటు ట్రాక్టర్ లను ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండి : రెండు రాష్ట్రాలు కలిసే పరిస్థితి వస్తే స్వాగతస్తాం.. ఏపీ మంత్రి బొత్స

అయితే, నెలవారీ పేమెంట్స్ సరిగా ఇవ్వకపోవడంతో సంబంధించిన ఈఎంఐ బ్యాంకు వారు సర్పంచులపై ఒత్తిడి తీసుకురావడంతో ఇబ్బందులకు గురవుతున్నామని సర్పంచులు చెబుతున్నారు. ఇటీవలే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజక వర్గం పరిధిలోని చందుర్తి మండలం రామారావు పల్లి గ్రామంలో సర్పంచ్ జీపీ ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్ ను ప్రైవేటు పనులకు లీజుకు ఇచ్చినట్లు, వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు సర్పంచ్ స్పందిస్తూ గ్రామపంచాయతీ తీర్మానం ప్రకారమే ప్రైవేటు పనులకు జిపి ట్యాంకర్ ను రెంటుకు ఇచ్చినట్లు పేర్కొన్న విషయం మనందరికీ తెలిసిందే. గ్రామపంచాయతీలకు నిధులు సరైన సమయంలో రాకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ గ్రామపంచాయతీ ట్రాక్టర్లు బహిరంగ వేలం వేయడం అనేది సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ట్రాక్టర్ ఈఎంఐ కట్టేందుకు గ్రామ పంచాయతీలో నిధులు లేవని సర్పంచ్ లాల రాధ చెబుతోంది.

First published:

Tags: Local News, Sircilla, Telangana

ఉత్తమ కథలు