హోమ్ /వార్తలు /తెలంగాణ /

3 రోజులు లేట్ గా వచ్చిందని.. 5 రోజులు పాటు క్లాసు బయట నిల్చోబెట్టిన టీచర్.. ఎక్కడంటే..

3 రోజులు లేట్ గా వచ్చిందని.. 5 రోజులు పాటు క్లాసు బయట నిల్చోబెట్టిన టీచర్.. ఎక్కడంటే..

ఆస్పత్రి పాలైన యువతి

ఆస్పత్రి పాలైన యువతి

Rajannasircilla: యువతికి అనారోగ్యంగా ఉండటంతో ఇంటికి వెళ్లింది. ఒక రోజు సెలవు పెట్టి మూడు రోజుల పాటు కళాశాలకు రాలేదు. దీంతో కళాశాల అధ్యాపకురాలు కోపం పెంచుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

కొంత మంది ఉపాధ్యాయులు పవిత్రమైన స్థానంలో ఉండి, తమ స్థానానికి చెడ్డపేరు వచ్చేలా ప్రవర్తిస్తుంటారు. విద్యార్థులకు తరగతిలో విద్యా, బుధ్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే.. దిగజారీ ప్రవర్తిస్తున్నారు. కొందరు తాగి స్కూల్ కు వస్తున్నారు. మరికొందరు.. విద్యార్థినులపై, తోటి ఉపాధ్యాయులపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మరికొందరు సరిగ్గా క్లాసులు చెప్పకుండా.. విద్యార్థులతో సపర్యలు కూడా చేసుకుంటున్నారు. ఇంకొన్ని చోట్ల ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వెలుగులోనికి వచ్చింది.


పూర్తి వివరాలు.. తెలంగాణ లోని (Telangana)  రాజన్న సిరిసిల్లా జిల్లాలో (Rajanna sircilla) దారుణ జరిగింది. వేములవాడలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పెద్ద పల్లి జిల్లా సుల్తానాబాద్ మండలానికి చెందిన యువతి, బీకాం కంప్యూటర్ సైన్స్ మూడో సంవత్సరం చదువుకుంటుంది. ఈ నెల 18 న అనారోగ్యంగా ఉందని ఒక రోజు సెలవు పెట్టి ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత.. వరుసగా మూడురోజులు రాలేదు. ఆ తర్వాత..కళాశాలకు వచ్చింది. అయితే.. ఉపాధ్యాయురాలు అమ్మాయిని ఐదురోజుల పాటు ఉదయం 9 నుంచి సాయత్రం 5 వరకు క్లాస్ లో బయటనే ఉండేలా పనిష్మేంట్ విధించింది.దీంతో ఆమె హస్టల్ లో తీవ్ర ఇబ్బంది పడింది. ఆదివారం ఆమె కాళ్లు చచ్చుబడిపోయేలా మారిపోయింది. దీంతో ఆమెను తోటి విద్యార్థినులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆమెను చికిత్స చేసి వెంటనే పెద్దపల్లిలోని ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో ఇది కలెక్టర్ వరకు వెళ్లింది. దీనిపై ఆయన సీరియస్ అయ్యారు. వెంటనే ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది.


ఇదిలా ఉండగా నాగర్ కర్నూల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.


నాగర్‌కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) లో వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం (Sunday) జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు వంగూరు మండలంలోని సర్వారెడ్డిపల్లి తండా స్టేజి వద్ద శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందారు. వనపల్లి గ్రామానికి చెందిన గడ్డిమీది మల్లేష్ (36) బైక్ పై డిండి వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మల్లేష్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి గాయపడిన మల్లేష్ ను చికిత్స కోసం 108 వాహనంలో కల్వకుర్తి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు ఎస్సై కురుమూర్తి తెలిపారు. మృతుడు మల్లేష్‌కు భార్య భవాని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


అచ్చంపేట మండలం పులిజాల సమీపంలో అతివేగంగా వస్తున్న బైక్ అదుపుతప్పడంతో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులవివరాలు ప్రకారం పులిజాల గ్రామానికి చెందిన రాములు (35) గ్రామం నుంచి అచ్చంపేటకు తన బైక్ పై బయలుదేరాడు. అతివేగంగా బైకును నడపడంతో అదుపుతప్పి రోడ్డు సమీపంలో ఉన్న మండలాలపై పడ్డాడు.రాములు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య ఈశ్వరమ్మ, కుమారుడు ఉన్నారు.భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Rajanna, Telangana News

ఉత్తమ కథలు