హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajannasiricilla: రాజన్న అనుబంధ ఆలయంలో అపచారం.. మరీ అంత నిర్లక్ష్యమా..? ఇంతకీ ఏం జరిగిందంటే..!

Rajannasiricilla: రాజన్న అనుబంధ ఆలయంలో అపచారం.. మరీ అంత నిర్లక్ష్యమా..? ఇంతకీ ఏం జరిగిందంటే..!

X
రాజన్న

రాజన్న అనుబంధ ఆలయంలో అపచారం..

రాజన్న అనుబంధ ఆలయాల్లో పూజలు కరువయ్యాయి. నిత్యం దూపదీప నైవేద్యాలతో అభిషేకాలు జరగాల్సిన స్వామిని...స్వీపర్లే శుభ్రం చేయడం శోచనీయం. రాజన్న ఆలయ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Sircilla, India

K.Haribabu, News 18, Rajanna sircilla

Rajanna sircilla; రాజన్న అనుబంధ ఆలయంలో పూజలు కరువయ్యాయి. రాజన్న ఆలయ అధికారుల తీరు విమర్శలకు తావిస్తుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా, పేదల పెన్నిధిగా, దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రమైన శ్రావణమాసంలో కూడా... అనుబంధ ఆలయాల్లో పూజలు కరువయ్యాయి. నిత్యం అభిషేకాలు చేయాల్సిన శివుడికి స్వీపర్లే పైప్‌లతో శుభ్రం చేయడం విమర్శలకు తావిస్తోంది. ఏటా 100 కోట్ల ఆదాయం ఉందని గొప్పలు చెప్పుకునే దేవాదాయ శాఖ కనీసం, ఆలయంలో జరిగే పూజలపై దృష్టి సారించకపోవడం శోచనీయమని భక్తులు మండిపడుతున్నారు.

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధం ఆలయమైన శ్రీదక్షిణామూర్తి ఆలయ అర్చకుడు ఏడాది క్రితం మరణించగా, మరో ఆలయమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చకుడు రిటైర్డ్ అయ్యాడు. ఆనాటి నుండి ఆ రెండు దేవాలయాల్లో దేవతలను పట్టించుకునే నాథులే కరువయ్యాడు. దేవాలయంలో ప్రతిరోజు నాలుగు వేళల్లో పూజలు జరగాల్సి ఉండగా, ఇప్పుడు దేవతలకు కనీసం పూజ చేయడం మర్చిపోయారు. ఇది గమనించిన ఆలయ స్వీపర్లు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ప్రతిరోజు పైపులతో స్వామివారిని కడుగుతున్నా ఆలయ అధికారులు నిమ్మకు నీరేత్తనట్లు వ్యవహరించడం శోచనీయం.

Read this also; ఈ ధాన్యం పండించే రైతులకు డబ్బే డబ్బు..! ఇంతకీ ఆ ధాన్యం ఏంటంటే..!

వెంటనే ఈ రెండు ఆలయాలకు అర్చకులను నియమించి, నిత్యం పూజలు జరిగేలా చూడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ నాయకులు సైతం ఆలయ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంటనే ఆలయ ఉన్నతాధికారులు స్పందించి పరివార దేవతలైన దక్షిణామూర్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయంలోని స్వామివార్లను శుద్ధి చేసేందుకు పరిచారకులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

కోట్లలో ఆదాయం వస్తున్న ఆలయ అధికారుల నిర్లక్ష్య ధోరణికి, సాంప్రదాయాలకు విరుద్ధంగా చేస్తున్న పనుల పట్ల సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. వెంటనే ఈ ఘటనపై ఈవో వెంటనే స్పందించి పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

Read this also ; Nagarkurnool: కోరుకున్న యువతిని పెళ్లి చేసుకున్నాడు: కానీ, పెళ్ళైన 40 రోజులకే ఊహించని ఘటన

పరివార దేవాలయాల్లో ఉన్న దేవత విగ్రహాల మూలవిరాట్లను శుద్ధమైన నీటితో అభిషేక పూజలు నిర్వహిస్తూ ప్రతిరోజు పూజలు నిర్వహించాలి.. కానీ రాజన్న ఆలయ పరివార దేవతలకు పైపులతో మూరవిరాట్లను శుద్ధి చేయడం, అది పరిచారకులు కాకుండా స్వీపర్లు శుద్ధి చేయడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ అన్నారు.

Read this also; Rajanna Sircilla: భర్తే కాలయముడు: సిరిసిల్ల మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఇలాంటి చర్యలు చేయడం సంస్కృతి సాంప్రదాయాలకు ఆలయ అధికారులు ఏ మాత్రం విలువిస్తున్నారనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. వెంటనే ఈవో తాత్కాలిక అర్చక స్వాములను ఏర్పాటు చేసి పరివార దేవతలకు ప్రతిరోజు శాస్త్రోక్తంగా పూజలు జరిగే విధంగా చూడాలని భక్తులు, హిందూ సంఘాలు కోరుతున్నాయి.

First published:

Tags: Crime news, Devotional, Local News, Sircilla, Telangana

ఉత్తమ కథలు