K.Haribabu,News18, Rajanna siricilla
జూన్ మాసంలో ప్రారంభమైన విద్యా సంవత్సరం పాఠశాల విద్యార్థులకు శాపంగా మారిందనే చెప్పాలి. చదువుకునేందుకు ప్రతి ముఖ్యమైన పాఠ్యపుస్తకాలు ఆలస్యంగా రావడమే కాకుండా అందులోని కొన్ని మాత్రమే రావడంతో సిలబస్ ఇన్ టైంలో పూర్తికాక స్టూడెంట్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Also : చల్లని లంబసింగిలో జనం ఇష్టపడే ఐటమ్ ఇదే!
విద్యార్థులకు ఈ సంవత్సరం సెలవులు ఎక్కువగా రావడం, పాఠాలు అభ్యసించేందుకు, వినేందుకు తక్కువయ్యాయి. ఆగస్టులో స్వతంత్ర భారత వజ్రోత్సవాల కారణంగా 15రోజులు, అధిక వర్షాలతో 7రోజులు సెలవులు వచ్చాయి. 10వ తరగతి విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమై 5 నెలలైనా సిలబస్ సగమే పూర్తయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేయాలని స్టూడెంట్స్, తల్లిదండ్రులు కోరుతున్నారు. మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.
పాఠశాల జూన్ లో ప్రారంభం కాగా పుస్తకాలు రెండు నెలలు ఆలస్యంగా వచ్చాయి. అవి కూడా పూర్తిస్థాయిలో రాలేదు. కానీ విద్యార్థులకు FA-1 పరీక్ష జూలైలోనే నిర్వహించారు. సెప్టెంబర్ లో కొన్ని నవంబర్లో ఇంకొన్ని పుస్తకాలు వచ్చాయి. ఈ విద్యా సంవత్సరం నవంబర్ వరకు పుస్తకాలే పంపిణీ చేశారు. ఇప్పటికీ 7వ తరగతిలో సైన్స్, 8వ తరగతిలో బయాలజీ, 9వ తరగతి ఇంగ్లీష్, 10వ తరగతిలో తెలుగు, ఇంగ్లీష్, గణితం, బయాలజీ పుస్తకాలు విద్యార్థులకు సరిపడా రాలేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పాఠశాలల వివరాలు..వాటి సంఖ్య,విద్యార్థులు:-
1.ప్రభుత్వ పాఠశాలలు...సంఖ్య 2, విద్యార్థులు..521
2. జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల (ZPHS).109, విద్యార్థులు15,113
3.(KGBV) కేజీబీవీలు..13, విద్యార్థులు..2.841
4.ఆదర్శ...7, విద్యార్థులు 3,836
5.ప్రభుత్వ DNT...1, విద్యార్థులు12
6.ప్రాథమిక పాఠశాల సంఖ్య 336, విద్యార్థులు 18,419
7.ప్రాథమికోన్నత పాఠశాలలు..38, విద్యార్థులు 3,034
8.MPHS(మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల)..3, విద్యార్థులు 729
9.ఆర్బీఎస్(RBS)..1, విద్యార్థులు 50 మంది
మొత్తం పాఠశాల సంఖ్య 510, విద్యార్థులు 44,555
పదవ తరగతి విద్యార్థి తోంటి అభినయ్, కోనరావుపేట మండలం..
క్లాసెస్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా పాఠ్యపుస్తకాలు కొన్నే వచ్చాయి. అవి అందరికీ సరిపోలేదు. ఉపాధ్యాయులు పాత బుక్స్ ఇచ్చారు. అందులో అన్ని రాసి ఉండడం ఏం చేయలేకపోతున్నామని విద్యార్థి అభినయ్ తెలిపాడు.
స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తున్నాం: కోనరావుపేట ఎంఈవో దూస రఘుపతి..
10వ తరగతి విద్యార్థులకు నవంబర్ 1నుంచి ఉదయం, సాయంత్రం స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తున్నామని, జనవరిలోగా సిలబస్ పూర్తి చేసి, ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్, మార్చిలో ఫైనల్ పరీక్షలకు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News