(Hari Babu, News18, Rajanna Sircilla)
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో క్షేత్రస్థాయిలో చేపూరి లక్ష్మణ్ అనే రైతు పొలంలో మోగి పురుగు ఉధృతిని నివారించుటకు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తరాజేంద్ర ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి ప్రకృతితో కలిసి పరిశీలించారు. వరికి వింత తెగులు.. అప్పుడే రైతులకు దిగుబడిపై దిగులు.. అనే న్యూస్18 కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన వ్యవసాయ శాఖ అధికారులు నేడు గ్రామంలో పర్యటించి.. వరి పొలాలను పరిశీలించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో ప్రధాన సమస్యలైన కాండం తొలిచే పురుగు, మొగి పురుగు, తెల్ల కంకి, ఊసపోటు, ఊసతిరుగటం ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. నారుమడిలో ఆశిస్తే మొక్కలు, పిలక దశలో ఆశిస్తే మొవ్వలు ఎండి చనిపోతాయని చెప్పారు. అంకురం నుండి చిరు పొట్ట దశలో ఆశిస్తే ఈనిన తర్వాత తెల్ల కంకులు బయటకి వస్తాయి. ఆలస్యముగా ముదురు నారు నాటడం, కరువు పరిస్తితులు, తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు ఉంది, సూర్య రశ్మి రోజుకు 7 గంటల కంటే ఎక్కువ ఉంటే ఈ పురుగు ఆశించడానికి అనుకూలం.
Nagar Kurnool: పత్తితో పరేషాన్.. అమ్ముదామంటే రేటు లేదు.. ఇంట్లో పెట్టుకుంటే వ్యాధులు
ముఖ్యంగా యాసంగీ వరి పైరులో ఎక్కువుగా ఆశిస్తుంది. ముదురు గోదుమ, ఎండుగడ్డి, పసుపు రంగులో ఉన్న ఆడ పురుగుల ముందు జత రెక్కలపై నల్లటి మచ్చ కలిగి ఉంటాయి. గోధుమ రంగు వెంట్రుకలతో కూడిన గ్రుడ్ల సముదాయం చిన్న గోధుమ రంగు ముద్దలా ఆకు కొనలపై లేదా కాండం మీద కనబడుతుంది. తెలుపు గోదుమ రంగులో ఉండే పిల్ల పురుగుల (లార్వ) ఎదిగిన తర్వాత నారింజ పసుపు రంగు తల కలిగి ఉంటుంది.
Love Failure: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అన్నాడు.. పాపం చివరికి ఇలా అయ్యిందేంటి..?
నారు తీసే 7 రోజుల ముందు 2 గుంటల (200 చదరపు మీటర్ల) నారు మడికి 800 గ్రాముల కార్బోఫ్యురాన్ 3 జి గుళికలను చల్లి నీటిని ఆ మడిలోనే ఇంకెటట్లు చేయాలి. ముదురు నారు నాటేటప్పుడు నారు కొనలను త్రుంచి నాటాలి. పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యురాన్ 3 జి గుళికలను ఎకరాకి 10 కిలోల చొప్పున లేదా ఎసీపేట్ 75 ఎస్. పి. 1.5 గ్రా. లేదా కార్తాప్ హైడ్రో క్లోరైడ్ 50 ఎస్. పి. 2 గ్రా. లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేయాలి. అంకురం నుండి చిరు పొట్ట దశలో తప్పని సరిగా కార్తాప్ హైడ్రో క్లోరైడ్ 4 జి గుళికలు ఎకరాకు 8 కిలోలు లేదా క్లోరాంత్రనిలిప్రొల్ 0.4 జి గుళికలు 4 కిలోలు లేదా కార్తాప్ హైడ్రో క్లోరైడ్ 50 ఎస్ పి 2 గ్రా లేదా క్లోరాంత్రనిలిప్రొల్ 18.5 ఎస్ పి 0.3 మిలీ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలని సూచించారు.
ఈ పురుగు లార్వాలు ఆశించిన ఆకులు/ పిలకలు ఎండి పోయి .. కోయగానే సులభంగా వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వాటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిందం రమేష్, సింగిల్ విండో డైరెక్టర్ గుడి శ్రీనివాసరెడ్డి, రైతులు వంచ కనకా రెడ్డి, అమిదల లక్ష్మారెడ్డి బుర్ర రాజు తదితరులు ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Farmers, Local News, Rajanna sircilla