హోమ్ /వార్తలు /తెలంగాణ /

అభివృద్ధి దిశగా తండాలు.. క్రమేణా మెరుగుపడిన మౌలిక వసతులు!..

అభివృద్ధి దిశగా తండాలు.. క్రమేణా మెరుగుపడిన మౌలిక వసతులు!..

తండాల్లో మౌళిక వసతులు

తండాల్లో మౌళిక వసతులు

Telangana: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజవర్గం పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలంలో తండాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయనే చెప్పాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజవర్గం పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలంలో తండాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం రాక ముందు గతంలో ఉండే తండాల్లో గిరిజనులు కనీస వసతులకు నోచుకోక అవస్థలు ఎదుర్కొన్న విషయం మనందరికీ తెలిసిందే. జ్వరం వస్తే వైద్యం కోసం కాలినడకన కిలోమీటర్లు నడిచి ఆసుపత్రికి చేరుకోవాల్సిన పరిస్థితి.

సరైన రోడ్లు, డ్రైనేజీలు, రక్షిత మంచి నీరు లేకుండా చిమ్మ చీకట్లో బిక్కుబిక్కుమంటూ కాలం గదుపుతూ తండావాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వరాష్ట్రం సిద్ధించిన అనంతరం సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని గిరిజన తండాలైన బుగ్గరాజేశ్వర తండా, బాకురుపల్లితండా, దేవునిగుట్టతండా, కిష్టు నాయక్ తండా, గుంటపల్లిచెరువుతండాల్లో మౌలిక వసతులు క్రమేణా మెరుగు పడ్డాయి.

సర్కార్ కోట్లాది రూపాయల నిధులు కేటాయించడంతో ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రణాళికబద్ధంగా ఎప్పటికప్పుడు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్లు, ఇంటింటా ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు, ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు, స్ట్రీట్ లైట్స్, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. ఒక్కోటిగా తండాల్లో ప్రగతి పనులు అందుబాటులోకి రావడంతో తండాల రూపు రేఖలు మారిపోతున్నాయి.

ప్రగతిలో పరుగులు పెడ్తున్న తండాలు..

ఎల్లారెడ్డిపేట మండలంలోని దేవునిగుట్టతండా, బుగ్గరాజేశ్వరతండా, బాకురుపల్లి తండా, దేవునిగుట్టతండా, గుంటపల్లి చెరువుతండా, కిష్టునాయక్ తండాలు నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు కావడంతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో తండాల అభివృద్ధికి రూ. కోట్లాది నిధులు కేటాయించారు. మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు.

అన్ని తండాల్లో ఒక్కో శ్మశాన వాటికకు రూ.12.60లక్షలు, నూతన గ్రామ పంచాయతీ భవనాలకు రూ.20 లక్షలు, సీసీ రోడ్లకు రూ.50 లక్షలు, క్రీడా ప్రాంగణానికి రూ.3లక్షలు, డంపింగ్ యార్డుకు రూ.2 లక్షలు, ఇంటింటికీ మిషన్ భగీరథ, ఇంకుడు గుంతలు, స్త్రీట్ లైట్స్, హైమస్ట్ లైట్లు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల ఏర్పాటుతో తండాల్లో ప్రగతి పరుగులు పెడుతున్నాయి.

పనులను సకాలంలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడంతో గిరిజనుల కష్టాలు తీరాయని తెలుస్తోంది. హరితహారంలో భాగంగా రోడ్డుకిరువైపులా మొక్కలను నాటి సంరక్షించారు. ప్రస్తుతం ఏపుగా పెరిగి పచ్చదనంతో తండాలకు స్వాగతం పలుకుతున్నాయి. ఆహ్లాదం పంచుతున్నాయి. బుగ్గరాజేశ్వర తండాలో రూ.9.60 లక్షల నిధులతో బంజారా సంఘం భవనాన్ని నిర్మించారు.

ఒకప్పుడు అవస్థలతో కాలం వెళ్లదీసిన గిరిజనులు ప్రస్తుతం ప్రభుత్వ ఫలాలు అందడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ రజిత అజ్మీరా మాట్లాడుతూ.. బుగ్గరాజేశ్వరతండా, ఎల్లారెడ్డిపేటగతంలో చిమ్మచీకటి, సరైన రోడ్లు, తాగేందుకు నీరు లేక తండావాసులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో ఎస్టీ మహిళా రిజర్వేషన్ కావడంతో మొట్టమొదట తండాకు ప్రజలందరూ కలిసి నన్ను ఏకగ్రీవ సర్పంచ్ గా ఎన్నుకున్నారు. మంత్రి కేటీర్ సహకారంతో తండాను అభివృద్ధిలోకి తీసుకొచ్చి.. అన్ని వసతులు కల్పించామని సర్పంచ్ తెలిపారు.

First published:

Tags: Local News, Rajanna sircilla, Telangana

ఉత్తమ కథలు